symbols
-
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
రాజముద్రపై రాజకీయ రగడ
-
రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర అధికారిక చిహ్నం రూపకల్పనపై చ ర్చించారు. రాజేశం రూపొందించిన పలు నమూనాలను పరి శీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు.గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర అధికార చిహ్నంలో చారి్మనార్‌తో పాటు కాకతీయ కళాతోరణం గుర్తు లు ఉండగా, వాటిని రాచరిక ఆనవాళ్లుగా పరిగణించి, కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త అధికారిక చిహ్నంతో పాటు రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి ని ర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త అధికారిక చిహ్నం రూపకల్పన కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో దీనిని ఆవిష్కరించే అవకాశాలు అంతగా లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గేయం ఆవిష్కరణకు ఏర్పాట్లు ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం, జూన్ 2న నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా దానిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందెశ్రీ రాసిన ఈ గేయాన్ని ఎలాంటి మార్పులు లేకుండా రాష్ట్ర గేయంగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. అయితే 13 నిమిషాల నిడివి కలిగిన ఈ గేయాన్ని అంతర్జాతీయ అతిథులు పాల్గొనే కార్యక్రమాల్లో పాడడానికి వీలుగా సంక్షిప్తీకరించి మరో వెర్షన్‌ను సైతం రూపొందించాలని సీఎం గతంలో అందెశ్రీకి సూచించారు. నేడు సోనియాకు ఆహ్వానం జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సోనియాను ముఖ్యమంత్రి కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పలకనున్నారు. సోమవారం కేరళ వెళ్లిన సీఎం అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చన సోనియాగాం«దీని జూన్ 2న జరిగే వేడుకలకు ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల గుర్తుల్లో బుల్డోజర్ను ఎందుకు తొలగించారు?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్డోజర్ చిహ్నాన్ని తొలగించింది. అయితే దీని వెనుక గల నిర్దిష్ట కారణాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ ఒక ప్రత్యేక వర్గానికి గుర్తింపుగా మారిందనే భావన అందరిలో ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే దానిని తొలగించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాస్మోటిక్స్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా పలు వస్తువులను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు. ఈ జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్‌లు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ముత్యాల హారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవాటిని జోడించారు. ఎన్నికల చిహ్నాల జాబితాలో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఆపిల్, ఫ్రూట్ బాస్కెట్, బిస్కెట్లు, బ్రెడ్, కేక్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఐస్‌క్రీం, జాక్‌ఫ్రూట్, లేడీఫింగర్, నూడుల్స్, వేరుశెనగ, బఠానీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో వాల్నట్, పుచ్చకాయను కూడా చేర్చారు. అలాగే బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్లు కూడా ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. కొన్ని ఎన్నికల చిహ్నాలు వాడుకలో లేకుండా పోయాయి. వీటిలో హ్యాండ్ మిల్లు, డోలీ, టైప్‌రైటర్, మంచం, బావి, టార్చ్, స్లేట్, టెలిఫోన్, రోకలి, బ్లాక్ బోర్డు, చిమ్నీ, పెన్ నిబ్, గ్రామోఫోన్, లెటర్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి. ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఆధునిక పరికరాల జాబితాలో ఎయిర్ కండీషనర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, కాలిక్యులేటర్, సీసీ కెమెరా, డ్రిల్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, పెన్ డ్రైవ్, బ్రెడ్ టోస్టర్, రిమోట్, స్పానర్, స్టెప్లర్, స్టెతస్కోప్, ఎక్స్టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్ఫోన్లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల చిహ్నాలలో అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్‌కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైనవి కూడా ఉన్నాయి. -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు(ఉచిత గుర్తులు) విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బీఆర్ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్ఎస్ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించారు. ఇక, ఎన్నికల్లో ఈ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యారు. ఒక రకంగా బీఆర్ఎస్ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్! -
మ్యాచ్ గెలవలేదు లేదంటే ఆ గుర్తులపై పెద్ద చర్చ జరిగేది!
టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. దీంతో అంతా కోహ్లి మాయాలో పడిపోయారు. కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు... పాక్‌పై మరోసారి విజయం సాధించిదంటూ గెలుపు సంబరాలు వగైరా లాంటి వాటిలో మునిగిపోయారు టీమిండియా అభిమానులు. అయితే ఇదే మ్యాచ్‌లో టీమిండియా వికెట్ పడిన ప్రతీసారి పాక్ ఆటగాళ్లు పలుమార్లు తమ చేతితో గుర్తులు పెడుతూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది కాబట్టి ఈ ఫోటోలు అంతగా పాపులర్ కాలేకపోయాయి. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మాత్రం పాక్ ఆటగాళ్లు చేతితో చేసిన గుర్తులపై పెద్ద చర్చ జరిగి ఉండేది. అయితే మ్యాచ్ ముగిసిన రెండు రోజులకు పాక్ ఆటగాళ్ల చేతి గుర్తుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాస్తవానికి ఒక మ్యాచ్‌లో ఏ బౌలర్ అయినా వికెట్ తీస్తే తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పాక్ బౌలర్లు వికెట్ తీసిన ప్రతీసారి ఒకే రకమైన సెలబ్రేషన్ చెయ్యడం ఆసక్తికరంగా మార్చింది. ఇంతకీ పాక్ ఆటగాళ్లు తమ చేతితో చూపెట్టిన గుర్తులకు అర్థం ఏమిటి.. అలా ఎందుకు చేశారనేది తెలుసుకుందాం. పాక్ బౌలర్లు పెట్టిన గుర్తులకు అర్థమేమిటంటే.. ►సాధారణంగా మనం దేన్నైనా గురి చూసి కొట్టడానికి రాయిని ఉపయోగిస్తాం. అలాగే పాక్ బౌలర్లందరూ కూడా వికెట్ టు వికెట్ బంతులు వెయ్యాలి, ఫీల్డర్లు కూడా డైరెక్ట్ గా వికెట్లకే బాల్ విసరాలి అన్న ప్లాన్ తో మైదానంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అందుకే వికెట్ పడ్డ ప్రతీసారి తమ ప్లాన్ ప్రకారంమే ఆ గుర్తును పైకి చూపారని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ►సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్న జట్టు పాకిస్థాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. షాహీన్ షా అఫ్రీది, హారీస్ రౌఫ్ లాంటి బౌలర్లు మెరుపు వేగంతో బంతులు విసరడంలో సిద్దహస్తులు. అలాంటి బంతులు విసరాలి అనే వ్యూహంతోనే బరిలోకి దిగినట్లు అర్దం అవుతోంది. వారు అనుకున్నట్లే మెుదట్లో మెరుపు బంతులతో టాపార్డర్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. దాంతో వారి వ్యూహం ఫలిస్తోంది అనే సంకేతాన్ని ఈ గుర్తు ద్వారా తెలియజేశారు. ►హాలీవుడ్ స్టార్ ‘ది రాక్’ ప్రధాన పాత్రలో.. డీసీ కామిక్స్ నుంచి వచ్చిన భారీ చిత్రం ‘బ్లాక్ ఆడం’(Black Adam). పాక్ ప్లేయర్లు పెట్టిన డైమండ్ గుర్తుకు ఈ సినిమాలో అద్భుత శక్తులకు మధ్య సంబంధం ఉంది. అద్భత శక్తులను మెరుపులతో చూపడం మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏదో ఒక అద్భుత శక్తి తమకు సహకరిస్తుంది అన్న నమ్మకంతోనే వారు ఈ విధంగా చేతివేళ్లు పెట్టి ఉంటారు అనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ గుర్తులకు సంబంధించి ఎలాంటి సమాచారన్ని పాక్ ప్లేయర్లు బయటపెట్టలేదు. Everything is fine but what’s with these signs vro? Whole team be doing it 😭👀 pic.twitter.com/t8o5hAvJg3 — 🕊 (@HeyitsRabea) October 24, 2022 చదవండి: T20 WC 2022: 2011లో ఇలాగే.. నమ్మలేం కానీ నిజమైతే బాగుండు! భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు వర్షం ముప్పు.. ఇదే జరిగితే సఫారీల ఖేల్ ఖతం..! -
Munugode Bypoll: రోడ్డురోలర్ ఎఫెక్ట్.. ఆర్వోపై వేటు.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ గుర్తును మార్చి మరో గుర్తును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఆర్వో తనకు లేని అధికారాలను వినియోగించారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. జగన్నాథరావును ఎన్నికల విధుల నుంచి తప్పించి.. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు అప్పగించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా ఎన్నికలో తొలుత గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులను కేటాయిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం చివరిగా 2021 సెప్టెంబర్ 23న ‘ఫ్రీసింబల్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న జనరల్ అబ్జర్వర్ సమక్షంలో లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు చండూరులోని ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. టీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్‌ను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాయి. నల్లగొండలోని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నివాసం ఎదుట కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మరోవైపు 18న విడుదల చేసిన గుర్తుల కేటాయింపు జాబితాలో రోడ్డురోలర్ గుర్తు మాయమైంది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు.. రోడ్డురోలర్ గుర్తును మార్చి కొత్తగా బేబీ వాకర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించారు. అదికూడా జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లకుండా/ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చే ముందు అభ్యర్థికి ఎలాంటి నోటీసు/సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ పత్రాల్లో శివకుమార్ ఇచ్చిన ప్రాథమ్యాల్లో బేబీ వాకర్ గుర్తు లేదు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తును మార్చిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ.. జనరల్ అబ్జర్వర్ ఈ నెల 18న లేఖ రాశారు. శివకుమార్ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక తెప్పించుకుంది. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, 1961లోని నిబంధన 10(5)’ను ప్రయోగిస్తూ ఆర్వో జగన్నాథరావు ఎన్నికల గుర్తు మార్పు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఒకసారి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను మార్చే అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాలను వినియోగించి ఎన్నికల గుర్తు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై సంజాయిషీ ఇవ్వాలని జగన్నాథరావును ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు జగన్నాథరావు పంపిన సంజాయిషీని సీఈవో కార్యాలయం గురువారం రాత్రి సీల్డ్ కవర్లో ఈసీకి పంపింది. మారిన గుర్తులతో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సీఈవో కార్యాలయాన్నీ సంప్రదించని తీరు ఎన్నికల గుర్తు మార్పు విషయంలో ఆర్వో జగన్నాథరావు సీఈవో కార్యాలయాన్ని కూడా సంప్రదించలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఈసీ ఆదేశాల మేరకు జగన్నాథరావుపై చర్యలకు అవకాశముందని పేర్కొన్నాయి. అయితే ఓ పార్టీ ఒత్తిడితోనే జగన్నాథరావు ఎన్నికల గుర్తును మార్చారని ఈసీ నిర్ధారణకు వచ్చిందని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసీ నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అయిన జగన్నాథరావును తప్పించి.. ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని జగన్నాథరావుకు సూచించింది. గుర్తుల తొలగింపుపై టీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈసీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారును పోలిన ఎనిమిది ఎన్నికల చిహ్నాలు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకి), రోడ్డురోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, పడవ గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తి సజావుగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై సీఈవో వికాస్‌రాజ్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. సీరియల్ నంబర్‌పైనా ఫిర్యాదు ఇక బ్యాలెట్లో తమకు సీరియల్ నంబర్ కేటాయింపు విషయంలోనూ యుగతులసి పార్టీ రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాలెట్ పేపర్లో మొదట తమకు సీరియల్ నంబర్ 5ను కేటాయించినా.. తర్వాత 14వ నంబర్‌కు మార్చారని, దీనిని కూడా సరిదిద్దాలని కోరింది. నాకు ఉన్న అధికారాలతోనే గుర్తును మార్చాం: జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు తొలుత రోడ్డురోలర్ గుర్తు కేటాయించింది వాస్తవమేనని.. తర్వాత వచ్చిన వినతుల మేరకు తనకున్న అధికారంతో గుర్తును మార్చానని తొలగింపునకు గురైన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు యుగతులసి పార్టీకి తిరిగి రోడ్డురోలర్ గుర్తును కేటాయించామన్నారు. యుగతులసి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్ 14 వచ్చిందని, 5వ నంబర్ కాదని చెప్పారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అ«ధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. -
మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఎన్నికల్లో గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. కాగా, తాజాగా ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్ అయ్యింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని సీఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని గుర్తించినట్టు సీఈసీ పేర్కొంది. ఇక, మునుగోడులో యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. -
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీకి కొత్త టెన్షన్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలను స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చపాతీ రోలర్ గుర్తు చిక్కు తెస్తుందేమోనని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. రెండూ ఒకే బ్యాలెట్లో ఉండనుండటంతో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు తమ ఓట్లను ఎవరికేస్తారోనన్న గుబులు పట్టుకుంది. బీజేపీలోనూ ఒకింత ఆందోళన కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల పేర్లు మొదటి వరుసలోనే ఉన్నాయి. స్క్రూటినీ తరువాత తిరస్కరణకు గురైన, ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈనెల 15న ప్రకటించారు. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రభాకర్‌రెడ్డి కూసుకుంట్లగా పేర్కొంది. నామినేషన్ల ఉప సంహరణ తరువాత ఇంటిపేరును పరిగణనలోకి తీసుకొని ఆంగ్ల అక్షరక్రమంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు, తరువాత రిజిస్టర్డ్ పార్టీలకు, తరువాత స్వతంత్రులకు సీరియల్ నంబర్లను, గుర్తులను సోమవారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేటాయించారు. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కంటే ముందుకు వచ్చింది. బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి సీరియల్ నంబరు 1, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సీరియల్ నంబరు 2, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నంబరు 3, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి నాలుగో నంబరు ఇచ్చారు. ఒకే బ్యాలెట్లో.. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మారమోని శ్రీశైలం యాదవ్‌కు చపాతీ రోలర్ గుర్తును, సీరియల్ నంబరు 12ను కేటాయించారు. తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ, సోషల్ జస్జిస్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రజావాణి పార్టీలకు కేటాయించిన హెలికాప్టర్, షిప్, డైమండ్, టెలివిజన్ గుర్తులు ఒకే బ్యాలెట్లో ఉండనున్నాయి. ఈ ఎన్నికకు మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. కప్పు సాసర్, క్యాలీఫ్లవర్, టిల్లర్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. దీంతో బీజేపీకీ ఆందోళన తప్పడం లేదు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి గుర్తులే చాలా చోట్ల తమ అభ్యర్థుల ఓటమికి కారణం అయ్యాయని టీఆర్ఎస్ వాపోయింది. ఆ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నకిరేకల్‌లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు 11 వేల ఓట్లు లభించాయి. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
మునుగోడులో గుర్తుల గోల...
-
Munugode War: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను స్వతంత్రులకు కేటాయించొద్దని.. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటి షన్ వేసింది. ఈ పిటిషన్‌పై నేడు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. పిటిషన్లో వివరాలివి.. ‘మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఇవ్వొద్దంటూ ఈ నెల 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈవీఎంలో స్టాంప్ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. రోడ్‌రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించింది. 2018లో రోడ్డు రోలర్ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్ రోలర్ గుర్తు కారు పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను స్వతంత్రులకు కేటాయిస్తే టీఆర్ఎస్ నష్టపోయే అవకాశం ఉంది.’ స్వతంత్రులకు ‘కారు’ ఇవ్వొద్దు సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలన్నారు. -
Huzurabad Bypoll: సింబల్ హడల్!
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే ఎన్నికల గుర్తులను ఎంచుకోవడం గమనార్హం. రాష్ట్రంలో 2014 అసెంబ్లీ–పార్లమెంటు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి గుర్తులే చాలాచోట్ల తమ ఓటమికి కారణమయ్యాయని టీఆర్ఎస్ లబోదిబోమన్న సంగతి తెలిసిందే. అయితే, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్తోపాటు బీజేపీ కూడా ఇదేవిధమైన టెన్షన్‌కు గురవుతోంది. ఈ గుర్తులతోనే టీఆర్ఎస్లో టెన్షన్ రోడ్‌రోలర్, ట్రక్కు, రైతు ట్రాక్టర్, చపాతీరోలర్, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ ఈ గుర్తులు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల చీలికకు కారణమయ్యాయి. దీంతో తమ గుర్తును పోలిన గుర్తులను జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ట్రక్కు, రోడ్‌రోలర్, ఆటో గుర్తులను తొలగించింది. అయినప్పటికీ కారు గుర్తును పోలిన చపాతీ రోలర్, రైతు ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టే, లారీ, బస్సులను కావాలంటూ కొందరు స్వతంత్రులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. పువ్వుకు దడ.. కాలీఫ్లవర్, పైనాపిల్ ఇవి రెండూ దూరం నుంచి చూసినప్పుడు బీజేపీ అధికారిక గుర్తు అయిన కమలం పువ్వును పోలి ఉంటాయి. ఈ రెండు నామినేషన్లు కూడా ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ.రాజేందర్ అనే వ్యక్తులే వేయడం విశేషం. ఈ గుర్తులను ఈసీ ఆమోదిస్తే తమకు చిక్కులేనని కమలనాథులు కలవరపడుతున్నారు. మరోవైపు ఓ స్వతంత్ర అభ్యర్థి తనకు కేటాయించాలని కోరిన పెన్నుపాళి(పెన్‌నిబ్) గుర్తు కూడా దూరం నుంచి వికసించిన కమలాన్ని పోలి ఉండటం గమనార్హం. ఎంఐఎం తరహాలో పతంగి కావాలట ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)ను పోలిన పార్టీ పేరుతో ఓ అభ్యర్థి వేసిన నామినేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలిండియా మజ్లిస్ ఇ–ఇంక్విలాబ్ ఇ–మిలాత్ (ఏఐఎంఐఎం)ను తన పార్టీగా పేర్కొన్నారు. తనకు కూడా పతంగి గుర్తు కావాలని కోరడం గమనార్హం. స్క్రూటినీ తరువాత తేలుస్తాం: ఆర్డీవో ‘ప్రస్తుతానికి కేవలం నామినేషన్ల ఘట్టమే ముగిసింది. స్క్రూటినీ అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరిస్తాం’అని ఆర్డీవో అరవింద్‌రెడ్డి తెలిపారు. ఎందుకు ఈ టెన్షన్? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో ఉన్న ట్రక్కు గుర్తే పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని దూరం చేసిందని ఆ పార్టీ నిర్ధారించుకుంది. ట్రక్కు గుర్తు.. కారు గుర్తును పోలి ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు ట్రక్కు గుర్తు కలిగిన అభ్యర్థులకు పడ్డాయి. సంగారెడ్డి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తువల్లే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది. -
ఏపీ, తెలంగాణల్లో నాలుగు గుర్తులకు నో
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను సవరిస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది. ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల కోసం కేటాయించే ఫ్రీ సింబల్స్ విషయంలో కొన్ని ఆంక్షలను విధించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పలు గుర్తులను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ఉంచింది. -
ఎన్నికల చిహ్నంపై స్టే కుదరదు: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలను కూటమి పార్టీల అభ్యర్థులకు కేటాయింపుపై నిషేధం విధించేందుకు వీలులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తరువాత ఈసీ బదులివ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి 14 మంది మిత్రపక్ష పార్టీల అభ్యర్థులు ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని 12 మంది మిత్రపక్ష అభ్యర్థులు రెండాకుల చిహ్నంపై బరిలోకి దిగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయా పార్టీల సభ్యులు మాత్రమే ఆ చిహ్నంపై పోటీచేయాలని, ఇతరులు పోటీ చేసేందుకు వీలులేకున్నా ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను అంగీకరించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన పార్టీలు మిత్రపక్షపార్టీలకు తమ పార్టీ చిహ్నం కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌కు నిషేధ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్‌కు బుధవారం విచారణకు వచ్చింది. ఎన్నికల చిహ్నం కేటాయింపులు పూర్తయినందున పిటిషనర్ వాదనపై ప్రస్తుత ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌పై బదులి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్ 3వ వారానికి వాయిదావేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వేటు అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ రాజామణి, పోలీస్ కమిషనర్ సుమిత్ శరణ్‌లను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. చెన్నై వేలాచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు దిగిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులపై తిరువాన్మియూరు పోలీసులు మూడు సెక్షన్లపై కేసులు పెట్టారు. ఐజేకే కూటమి సారధి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణంలో మిత్రపక్ష సమక అధ్యక్షులు శరత్‌కుమార్ గురువారం ప్రచారం చేయనున్నారు. చెన్నైలో 7,300 మంది వృద్ధుల నుంచి పోస్టల్ ఓట్ల కోసం ఈసీ 70 బృందాలను నియమించింది. ఇంటింటికీ వెళ్లి పోస్టల్ ఓట్ల సేకరణకు శిక్షణ బుధవారం ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా 14,215 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల కోసం బుధవారం రిజర్వేషన్ ప్రారంభమైంది. పోలింగ్ నేపథ్యంలో ఈనెల 4,5,6 తేదీల్లో టాస్మాక్ దుకాణాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నరసింగ పాడు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థులిద్దరు గుర్తులు తారుమారయ్యాయని రగడ నెలకొంది. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా.. ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని వారే పొరపాటు పడి ఒకరి గుర్తును మరొకరు ప్రచారం చేసుకున్నారు. వారికి అధికారికంగా కేటాయించిన అసలు గుర్తులేమిటో అధికారులు వివరించడంతో నాలుక్కరుచుకోవడం అభ్యర్థుల వంతయ్యింది. అభ్యర్థుల్లో ఒకరైన సకినాల ఏడుకొండలుకు గౌను, మరో అభ్యర్థి పొదిలి వెంకటేశ్వర్లుకు ప్రెషర్ కుక్కర్‌ను అధికారులు కేటాయించగా.. అభ్యర్థులు పొరబడి పోటీ అభ్యర్థి గుర్తును తమదిగా ప్రచారం చేసుకున్నారు. (చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!) ప్రజా తీర్పును వక్రీకరిస్తావా? -
ట్రెండ్ చేంజ్.. కాదేదీ గుర్తుకు అనర్హం..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారి ఉత్కంఠకు తెరదించుతూ బల్దియా ఎన్నికల నగారా మోగింది.. అతితక్కువ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఈవీఎంలు లేవు.. ఈ ఓటింగ్ కూడా లేదు. బ్యాలెట్‌తోనే ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. వార్డుల డీలిమిటేషన్ లేకపోవడం, గతంలో ఉన్న రిజర్వేషన్లనే ఈసారీ వర్తింపజేయడంతో మహిళలకు 75 సీట్లు లభిస్తున్నాయి. గత పాలక మండలిలోనూ జనరల్ స్థానాల్లో గెలిచి మొత్తం 79 మంది మహిళలు పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎస్టీలకు 2, ఎస్సీలకు 10, బీసీలకు 50, మహిళలకు(జనరల్) 44 సీట్లు ఉన్నాయి. ఇవిపోనూ మిగిలిన 44 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మొత్తం సీట్లలో సగం మహిళలకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో టెన్షన్.. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఒక వైపు అధికార పార్టీ సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులపై ఇంత వరకూ కసరత్తే మొదలు కాలేదు. వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్‌ల పరిధిలో అభ్యర్థుల కోసం పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ డివిజన్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. పేరుకు మాత్రం ఒక్కో డివిజన్ నుంచి 10 మంది వరకు టికెట్ ఆశిస్తున్నా.. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చదవండి: ‘బందోబస్తు’ సెల్ రెడీ! కాదేదీ.. గుర్తుకు అనర్హం.. సాక్షి, సిటీబ్యూరో: ట్రెండ్ మారింది.. దానికి తగ్గట్లుగానే గుర్తులను కేటాయిస్తోంది ఎన్నికల సంఘం.. ప్రస్తుతం బాగా పాపులర్‌గా ఉన్న హెడ్‌ఫోన్, పెన్‌డ్రైవ్, రోబో తదితర 50 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీచేసే వారు వీటిల్లో తమకు నచ్చిన గుర్తును ఎంచుకోవచ్చు. వీటిలో ఎయిర్‌కండిషనర్, యాపిల్, గాజులు, బ్యాట్, విజిల్, టైర్లు, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్, సీసా, బకెట్, క్యారమ్బోర్డు, చెయిన్, కోటు, కొబ్బరితోట, మంచం, కప్పు–సాసర్, కటింగ్‌ప్లేయర్, ఎలక్ట్రిక్పోల్, ఎన్వలప్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గాజుగ్లాసు, ద్రాక్షపండ్లు, హెడ్‌ఫోన్, హాకీకర్ర–బంతి, బెండకాయలు, లెటర్‌బాక్స్, మూకుడు, ప్యాంటు, పెన్‌డ్రైవ్, పైనాపిల్, కుండ, ప్రెషర్‌కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రోబో, రంపం, కత్తెర, షటిల్‌కాక్, సితార్, సాక్స్, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, టేబుల్, టూత్‌బ్రష్, ట్రంపెట్. చదవండి: ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్ దూకుడు! 2009 ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు 8, ఎస్సీ మహిళలకు 4 వెరసీ ఎస్సీలకు మొత్తం 12 దక్కాయి. బీసీ జనరల్‌లో 33 సీట్లు ఉండగా, 2016లో అవి 25కు తగ్గాయి. బీసీ మహిళలకు మాత్రం 17 నుంచి 25కు పెరిగాయి. మహిళల జనరల్ స్థానాలు 28 నుంచి 44కు పెరిగాయి. 2009లో స్థూలంగా జనరల్‌లో 100, మహిళలకు 50 సీట్లు వెరసీ మొత్తం 150 కాగా, 2016లో రెండు విభాగాల్లో చెరో 75కు మారాయి. తిరిగి ఈసారి ఇదే పునరావృతం అవుతోంది. ఓపెన్ కేటగిరీ(రిజర్వు కానివి).. (5)మల్లాపూర్, 12)మన్సూరాబాద్, (13)హయత్‌నగర్, (14)బీఎన్‌రెడ్డి నగర్, (15)వనస్థలిపురం, (17)చంపాపేట, (18)లింగోజిగూడ, (21)కొత్తపేట, (22)చైతన్యపురి, (23)గడ్డిఅన్నారం, (27)అక్బర్‌బాగ్, (30)డబీర్‌పురా, (31)రెయిన్‌బజార్, (32)పత్తర్‌గట్టి, (36)లలితాబాగ్, (40)రియాసత్‌నగర్, (44)ఉప్పుగూడ, (45)జంగమ్మెట్, (50)బేగంబజార్, (59)మైలార్‌దేవ్‌పల్లి, (77)జాంబాగ్, (87)రామ్‌నగర్, (93)బంజారాహిల్స్, (94)షేక్‌పేట్, (95)జూబ్లీహిల్స్, (96)యూసుఫ్‌గూడ, (99)వెంగళ్రావునగర్, (102)రహ్మత్‌నగర్, (104)కొండాపూర్, (105)గచ్చిబౌలి, (106)శేరిలింగంపల్లి, (107)మాదాపూర్, (108)మియాపూర్, (114)కేపీహెచ్‌బీ కాలనీ, (117)మూసాపేట్, (118)ఫతేనగర్, (119)ఓల్డ్‌బోయిన్‌పల్లి, (120)బాలానగర్, (121)కూకట్పల్లి, (123)హైదర్‌నగర్, (124)ఆల్విన్‌కాలనీ, (129)సూరారం, (139)ఈస్ట్ఆనంద్బాగ్, (140)మల్కాజిగిరి. వార్డు నెంబర్ల వారీగా జనరల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ వార్డులు ఎస్టీ జనరల్: (46)ఫలక్‌నుమా ఎస్సీ జనరల్: (1)కాప్రా, (4)మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, (62)జియాగూడ, (133)మచ్చబొల్లారం, (135)వెంకటాపురం బీసీ జనరల్: (3)చర్లపల్లి, (29)చావని, (39)సంతోష్‌నగర్, (43)చాంద్రాయణగుట్ట, (48)శాలిబండ, (51)గోషామహల్, (52)పురానాపూల్, (53)దూద్‌బౌలి, (54)జహనుమా, (55)రామ్నాస్పురా, (56)కిషన్‌బాగ్, (58)శాస్త్రిపురం, (64)దత్తాత్రేయనగర్, (65)కార్వాన్, (69)నానల్‌నగర్, (70)మెహదీపట్నం, (71)గుడిమల్కాపూర్, (83)అంబర్‌పేట,(88)భోలక్‌పూర్, (103)బోరబండ, (112)రామచంద్రాపురం, (113)పటాన్చెరువు, (125)గాజులరామారం,(126)జగద్గిరిగుట్ట, (127)రంగారెడ్డినగర్ మహిళల రిజర్వేషన్ వార్డులు.. వార్డు నంబర్ల వారీగా.. ఎస్టీ మహిళ: (16) హస్తినాపురం ఎస్సీ మహిళ: (60)రాజేంద్రనగర్, (90) కవాడిగూడ, (142)అడ్డగుట్ట, (144) మెట్టుగూడ, (147)బన్సీలాల్‌పేట. బీసీ మహిళ: (9)రామంతాపూర్, (26) ఓల్డ్ మలక్‌పేట్, (34)తలాబ్‌చంచలం, (35)గౌలిపురా, (37)కుర్మగూడ, (41) కంచన్‌బాగ్, (42)బార్కాస్, (47)నవాబ్‌సాహెబ్‌కుంట, (49)ఘాన్సీబజార్, (57)సులేమాన్‌నగర్, (61)అత్తాపూర్, (63)మంగళ్‌హాట్, (67)గోల్కొండ, (68)టోలిచౌకి, (72)ఆసిఫ్‌నగర్, (73)విజయనగర్‌కాలనీ, (74)అహ్మద్‌నగర్, (75)రెడ్‌హిల్స్, (76)మల్లేపల్లి, (82)గోల్నాక, (86)ముషీరాబాద్, (101)ఎర్రగడ్డ, (128)చింతల్, (146)బౌద్ధనగర్, (148)రాంగోపాల్‌పేట్. మహిళ జనరల్.. (2)డాక్టర్ ఏఎస్‌రావునగర్, (6)నాచారం, (7)చిలుకానగర్, (8)హబ్సిగూడ, (10)ఉప్పల్, (11)నాగోల్, (19)సరూర్‌నగర్, (20)ఆర్కేపురం, (24)సైదాబాద్, (25)మూసారాంబాగ్, (28)ఆజంపురా, (33)మొఘల్‌పురా, (38)ఐఎస్ సదన్, (66)లంగర్‌హౌస్, (78)గన్‌ఫౌండ్రి, (79)హిమాయత్‌నగర్, (80)కాచిగూడ, (81)నల్లకుంట,(84)బాగ్‌అంబర్‌పేట, (85)అడిక్‌మెట్, (89)గాంధీనగర్, (91)ఖైరతాబాద్, (92)వెంకటేశ్వరకాలనీ, (97)సోమాజిగూడ, (98)అమీర్‌పేట్, (100)సనత్‌నగర్, (109)హఫీజ్‌పేట్, (110)చందానగర్, (111)భారతీనగర్, (115)బాలాజీనగర్, (116)అల్లాపూర్, (122) వివేకానందనగర్ కాలనీ, (130)సుభాష్‌నగర్, (131)కుత్బుల్లాపూర్, (132)జీడిమెట్ల, (134)అల్వాల్, (136)నేరేడ్మెట్, (137)వినాయకనగర్, (138)మౌలాలి, (141)గౌతంనగర్, (143)తార్నాక, (145)సీతాఫల్మండి, (149)బేగంపేట్, (150) మోండామార్కెట్. గడువులోపే ఎన్నికలు.. బల్దియాలో పాలకమండలి గడువు పూర్తికాకముందే ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. గతంలో పాలకమండలి గడువు ముగిశాక, ఎన్నోఏళ్ల తర్వాత మాత్రమే తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆమధ్య కాలంలో స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 1970 నుంచి 1986 వరకు, అనంతరం 1991 నుంచి 2002 వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ పాలనే సాగింది. 2007లో పాలకమండలి గడువు ముగిశాక, అదే సంవత్సరం జీహెచ్ఎంసీగా అవతరించాక సైతం స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 2009 ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది. 2014లో పాలకమండలి గడువు ముగిశాక కూడా తిరిగి 2016 ఎన్నికలు జరిగేంత వరకు కూడా స్పెషలాఫీసర్ పాలనే నడిచింది. ఈసారి మాత్రం పాలకమండలి గడువుకు దాదాపు రెండున్నరనెలల ముందుగా ఎన్నికలు జరగనున్నాయి. -
కిమ్‌కి శస్త్ర చికిత్స జరిగిందా ?
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ కుడి చెయ్యి మణికట్టుపై సూదితో పొడిచినట్టు ఉన్న గుర్తులు కనిపిస్తున్నా యి కదా ! ఆ గుర్తులు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జ రుగుతోంది. 20 రోజుల పాటు కనిపించకుండా పోయిన కిమ్ మే 1న ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోల్లో కిమ్ చేతిపై కనిపించే గుర్తులు చూసి ఆయన గుండెకి శస్త్రచికిత్స జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు కిమ్ ఏప్రిల్ 11న ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో చేతిపై అలాంటి గుర్తులేవీ కనిపించలేదు. గుండెలో రంధ్రాలను పూడ్చడానికి స్టంట్ అమర్చడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతి ద్వారా కూడా శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు వాదిస్తూ ఉంటే మరికొందరు గుండెకి స్టంట్ వెయ్యడానికి చేసే ఇంట్రావీనస్ ప్రక్రియకి అలాంటి గురుతులు పడవని అంటున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైనా పరీక్షలు జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే, కిమ్‌కు సర్జరీ జరిగిందంటూ వస్తున్న వార్తల్ని దక్షిణ కొరియా కొట్టి పారేసింది. కిమ్‌కి ఎలాంటి శస్త్రచికిత్స కానీ, వైద్య పరీక్షలు కానీ జరగలేదని స్పష్టం చేశారు. -
ఏసీ, ఫ్రిజ్, ఆపిల్, సోఫా..!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కేటాయించింది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఫ్రీ సింబల్స్ జాబితాను విడుదల చేసింది. కొత్త మున్సిపల్ చట్టంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ఆర్డర్‌కు చేసిన సవరణకు అనుగుణంగా కేటాయించే గుర్తులపై స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు వాటికి రిజర్వ్ చేసిన గుర్తులు, రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు రిజర్వ్ చేసిన సింబళ్లు, రిజిస్టరై రిజర్వ్ సింబళ్లు లేని పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే ఫ్రీ సింబళ్లపై నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, ఎస్ఈసీ వద్ద రిజిస్టరై, రిజర్వ్ సింబళ్లున్న రాజకీయ పార్టీలేవి రాష్ట్రంలో లేవని పేర్కొంది. ఎస్ఈసీ వద్ద రిజిస్టరై, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొంది, రిజర్వ్ సింబల్స్ ఉన్న పార్టీలు, రాష్ట్రంలో రిజిస్టరై రిజర్వ్ సింబళ్లు లేని పార్టీలు, ఫ్రీ సింబళ్ల జాబితాను పొందుపరిచింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పాత గుర్తులే.. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొంది ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకున్న కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి కొడవలి, సీపీఎంకు సుత్తి కొడవలి గుర్తులను రిజర్వు చేసింది. తెలంగాణలో గుర్తింపు పొంది ఎస్ఈసీ వద్ద రిజిస్టరైన టీఆర్ఎస్కు కారు, ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీకి గాలిపటం, వైసీపీకి ఫ్యాన్, టీడీపీకి సైకిల్ గుర్తులు కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా.. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఎస్ఈసీ వద్ద రిజిస్టరైన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కి సింహం, జనతాదళ్ (యూ)కు బాణం, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి పార–స్టోకర్ గుర్తులను ఎస్ఈసీ కేటాయించింది. టీజేఎస్, జనసేన, లోక్‌సత్తాలు రిజర్వ్ సింబళ్లు లేని పార్టీలు. రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టరై రిజర్వ్ సింబళ్లు లేని జాబితాలో మొత్తం 37 రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో ప్రధానంగా తెలంగాణ జనస మితి(టీజేఎస్), జనసేన, లోక్‌సత్తా పార్టీలతో పాటు యువ తెలంగాణ, సోషల్ వెల్ఫేర్పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ, తెలుగు కాంగ్రెస్ పార్టీ, దళిత బహుజన పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి, తెలంగాణ యువశక్తి, సోషల్ వెల్ఫేర్ పార్టీ తదితర పార్టీలున్నాయి. ‘ఫ్రీ సింబల్స్’ఇవే.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు (రిజర్వ్ సింబళ్లు కేటాయించిన పార్టీలు,అభ్యర్థులు, స్వతంత్రులకు) ఫ్రీ సింబల్స్ 50 గుర్తుల నుంచి కేటాయించే అవకాశాలున్నాయి.. ఏసీలు, ఆపిల్ పండు, గాజులు, బ్యాట్, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్, నీళ్ల బాటిల్, కెమెరా, చెయిన్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు సాసర్, విద్యుత్ స్తంభం, కవరు, పిల్లన గ్రోవి, ఫుట్‌బాల్, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, హెడ్‌ఫోన్, హాకీ బ్యాట్–బంతి, బెండకాయ, పోస్టుబాక్స్, అగ్గిపెట్టె, మూకుడు, ప్యాంటు, పెన్‌డ్రైవ్, పైనాపిల్, కుండ, ప్రెషర్ కుక్కర్, ఫ్రిజ్, కత్తెర, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, టెలిఫోన్, టూత్‌బ్రష్, ట్రంపెట్, టైర్లు, ఈల.. ఇవీ పుర ఎన్నికల్లో పోటీపడే.. రిజర్వ్ సింబళ్లు లేని అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయిస్తారు. -
ఈ గుర్తులు చాలా టేస్టీ గురూ!
నూడిల్స్, ఐస్‌క్రీమ్స్, టాఫీలు, ఫ్రూట్ బాస్కెట్, వాల్ నట్స్.. పేర్లు చదివితేనే నోరూరిపోతోందా? ఆహా ఏమి రుచి..అని మైమరిచిపోతున్నారా? ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ లంచ్ మెనూ కాదు.. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం ఆహార పదార్థాలను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చింది. స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాష్ట్రాల్లో చిన్న పార్టీలు ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌ని ఎన్నికల్లో గుర్తుగా ఎంచుకోవచ్చు. ఆ జాబితాలో ఐస్‌క్రీమ్, పచ్చిబఠాణీలు, నూడిల్స్, టాఫీలు, పైనాపిల్, వేరుశెనగ, బ్రెడ్, కేప్సికమ్, పండ్ల బుట్ట, ద్రాక్షలు, పచ్చి మిరపకాయ, బెండకాయలు, బిస్కెట్, వాల్నట్స్, పుచ్చకాయలు, థాలి ప్లేట్ ఉన్నాయి. మహారాష్ట్రలో హైటెక్ గుర్తులు: మహారాష్ట్రలో మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా 198 ఫ్రీ సింబల్స్‌ను జాబితాలో చేర్చింది. ఇవన్నీ డిజిటల్ గుర్తులే. వీటిలో ల్యాప్‌టాప్, సీసీ టీవీ కెమెరా, పెన్ డ్రైవ్, హెడ్‌ఫోన్స్, కంప్యూటర్ మౌస్ వంటివి ఉన్నాయి. అన్ని తరాల వారిని ఆకర్షించేలా ఈ గుర్తుల్ని ఎంపిక చేశామని మహారాష్ట్రకు చెందిన ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇక వంటగదిలో వాడే వస్తువులు కూడా ఈ ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్, స్టౌ, ప్రెజర్ కుక్కర్, ఫ్రైయింగ్ ఫ్యాన్ వంటి గుర్తులు మహిళల్ని ఆకర్షించేలా రూపొందించారు. -
మంచిర్యాల: పోరు త్రిముఖం
సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది. మొన్న నామినేషన్ల దాఖలు... నిన్న పరిశీలన పూర్తి కాగా.. తాజాగా గురువారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇక ప్రచార పర్వానికి తెరలేవనుంది. శుక్రవారం నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన నరేశ్ జాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. పెద్దపల్లిలో మాత్రం ఏ అభ్యర్థి కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోవడం గమనార్హం. ఆదిలాబాద్‌లో 11 మంది.. ఆదిలాబాద్ లోకసభ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులుగా మొత్తం 11 మంది బరిలో మిగిలారు. తొలుత 17 మంది నామినేషన్లు వేయగా, అందులో నాలుగు నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించారు. గురువారం భారతీయ బహుజన్ క్రాంతి దళ్ పార్టీకి చెందిన అడే బాలాజీ, కాంగ్రెస్ రెబల్ నరేశ్ జాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 11 మంది మిగిలారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఆశించి, రెబల్‌గా నామినేషన్ వేసిన నరేశ్ జాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ ఆశించారు. కాని అధిష్టానం రమేశ్ రాథోడ్‌కు అవకాశం కల్పించింది. దీంతో అలక వహించిన నరేశ్ రెబల్‌గా పోటీ చేశారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసి, బీ–ఫారం ఇవ్వకున్నా పోటీకి సై అన్నారు. కాని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో మెత్తబడ్డ ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో పోటీలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదిలాఉంటే టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్, కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మధ్య ప్రధాన పోరు నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బాపూరావు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి బరిలో 17 మంది పెద్దపల్లి లోక్‌సభ బరిలో 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఏ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోకపోవడం గమనార్హం. నామినేషన్ల పరిశీలన అనంతరం మిగిలిన 17 మందిలో ఎవరూ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. కాగా పెద్దపల్లిలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నడుమ ప్రధాన పోటీ నెలకొంది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి, అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న బొర్లకుంట వెంకటేశ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ల మధ్య పోటీ ఉంది. మూడు ప్రధాన పార్టీలు కూడా తమ విజయంపై ధీమాతో ఉన్నాయి. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. ఆదిలాబాద్ బరిలో వీరు.. అభ్యర్థి పేరు పార్టీ గుర్తులు 1.గోడం నగేశ్ టీఆర్ఎస్ కారు 2.రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ హస్తం 3.బాపూరావు సోయం బీజేపీ కమలం 4.కుందం వందన నవ ప్రజారాజ్యం ట్రాక్టర్ నడిపే రైతు 5.భీమ్రావు అంబేద్కర్ రైట్ పార్టీ ఆఫ్ ఇండియా కోటు 6.పవార్ కృష్ణ రాష్ట్రీయ జనక్రాంతి హెల్మెట్ 7.ధరావత్ నరేందర్ జనసేన గాజుగ్లాసు 8.గంట పెంటన్న స్వతంత్ర కుండ 9.కుమ్ర రాజు స్వతంత్ర ఉంగరం 10.ఆరె ఎల్లన్న స్వతంత్ర బ్యాట్ 11.నేతావత్ రాందాస్ స్వతంత్ర గ్యాస్ సిలిండర్ పెద్దపల్లి బరిలో వీరే.. పేరు పార్టీ గుర్తు 1. వెంకటేశ్‌నేత టీఆర్ఎస్ కారు 2.డాక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ హస్తం 3.ఎస్.కుమార్ బీజేపీ కమలం 4.బాలకల్యాణ్ పంజా బీఎస్పీ ఏనుగు 5. ఎరుగుర్ల భాగ్యలక్ష్మి పిరమిడ్ పార్టీ పిల్లనగ్రోవి 6. ఎస్.కృష్ణ సెక్యులర్ డెమోక్రటిక్ బావి 7. రాజ్‌ప్రకాశ్ ఇండియా ప్రజాబంధు ట్రంపెట్ 8. వెలుతురు మల్లయ్య రిపబ్లిక్ పార్టీ హెలికాఫ్టర్ 9. సబ్బని కృష్ణ సీపీఐయూ కంప్యూటర్ 10. దేవదాస్ యాంటీ కరెప్షన్ పనసకాయ 11. అర్షం అశోక్ స్వతంత్ర గ్యాస్ సిలిండర్ 12. కుంటాల నర్సయ్య స్వతంత్ర రోడ్డురోలర్ 13. గద్దల వినయ్ స్వతంత్ర గాజుగ్లాస్ 14. గొడిశెల్లి నాగమణి స్వతంత్ర గౌను 15. దుర్గం రాజ్‌కుమార్ స్వతంత్ర బ్యాట్ 16. ఎరికిల్ల రాజేశ్ స్వతంత్ర ఓర 17. అంబాల మహేందర్ స్వతంత్ర ట్రాక్టర్ నడిపే వ్యక్తి -
కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) స్పందించింది. కారు గుర్తును పోలిన సింబల్స్ వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని ఈసీకి కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ కారు గుర్తు బోల్డ్(గుర్తు రంగు కనిపించేలా మార్పు) చేయడంపై టీఆర్ఎస్ సూచనలను కోరింది. ఈ మేరకు మార్పు చేసిన కారు గుర్తు సింబల్‌ను ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. అనంతరం మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడారు. ఓటర్లు గందరగోళానికి గురయ్యారు: వినోద్ ఎన్నికల బ్యాలెట్లో కారు రంగు సరిగా లేకపోవడంతో వృద్ధులు, కంటి సమస్య ఉన్న వారు తమ పార్టీ గుర్తును పోల్చుకోవడంలో ఇబ్బందులు పడ్డారని వినోద్ వివరించారు. మరో పార్టీకి సంబంధించిన ట్రక్కు గుర్తు, కారు గుర్తును పోలి ఉండటం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని పేర్కొన్నారు. గుర్తు మాత్రమే కాకుండా పేర్లు కూడా ఒకేలా ఉండేలా ఆ పార్టీ ఓటర్లను గందర గోళానికి గురిచేసిందన్నారు. ఇలాంటి తప్పులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూడాలని కేసీఆర్ గతంలో ఎన్నికల సంఘాన్ని కోరారని గుర్తు చేశారు. -
అభ్యర్థులకు గుర్తుల గుబులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఓటర్లు సులభంగా గుర్తుపట్టడానికి అనువుగా లేని, దగ్గర పోలికలు గల గుర్తులు ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఫోర్క్, చం చా, గ్యాస్ స్టౌ, గ్యాస్ సిలిండర్,బ్యాట్, విమానం వంటి దగ్గరి పోలికలున్న గుర్తులను కేటా యించారు. దాంతో ఓటర్లకు వాటిని ఎలా వివరించాలో తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాలెట్æలో ఊరు, పేరు, ఫొటో ఉండకపోవడం, తికమకపెట్టేలా గుర్తులు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్ని కల్లో కొందరు అభ్యర్థుల గెలుపు, ఓటములను ‘ట్రక్కు’ గుర్తు తారుమారు చేసిన విషయం తెలి సిందే. పంచాయతీ ఎన్నికల్లోనూ తికమకపెట్టే గుర్తులతో తమకు చిక్కులు వస్తాయేమోనని అభ్యర్థులు భయపడుతున్నారు. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేవారికి వరుసగా ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పుసాసర్, విమానం, పుట్‌బాల్, షటిల్‌కాక్, కుర్చి, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, హ్యాండ్‌బ్యాగ్, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్æ, బ్యాటరీ లైట్, బ్రష్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు, ఫోర్క్, చంచా ఇలా 30 రకాల గుర్తులు నిర్ణయించారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే ‘నోటా’కు వేసుకోవచ్చు. వార్డులకు ఇలా... వార్డు స్థానాలకు వరుసగా జగ్గు, గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్æ, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, విజిల్æ, కుండ, డిష్ యాంటీనా, గరాట, మూ కు డు, కేటిల్æ, విల్లుబాణం, పోస్టల్æ కవర్, హాకీస్టిక్, బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పోస్ట్‌డబ్బా ఇలా 19 రకాల గుర్తులతో పాటు నోటా కూడా ఉంటుంది. ఓటర్లు గుర్తించే, సులువుగా అర్థమయ్యే గుర్తులెన్నో ఉన్నాయి. అలాంటి వన్నీ వదిలేసి క్లిష్టమైనవి గుర్తులుగా పెట్టడంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థులకు మొదటిస్థానంలో ఉంగరం గుర్తు ఉంది. అది చూడగానే అందరికీ సులువుగా అర్ధం అవుతుంది. ఏడోస్థానంలో ఉన్న షటిల్ కాక్ గుర్తు దక్కే అభ్యర్థికి దానిని ప్రచారం చేసుకోవడం ఇబ్బందిగా మారింది. బ్యాలెట్ పేపర్లో మూడోస్థానంలో ఉన్న బ్యాట్, ఐదో స్థానంలో ఉన్న విమానం గుర్తులు దగ్గరి పోలికలతో ఉన్నాయి. వీటి విషయంలో వృద్ధులు పొరబడే అవకాశాలున్నాయి. బ్యాలెట్æ పేపర్లో 29వ స్థానంలో ఉన్న ఫోర్కు, 30వ స్థానంలో ఉన్న చంచా గుర్తులు దాదాపు ఒకేలా ఉన్నాయి. దాంతో ఒకదానికి బ దులు మరొకదానికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు. వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగించే బ్యాలెట్లో మూడోస్థానంలో గ్యాస్‌పొయ్యి, ఐదో స్థానంలో గ్యాస్ సిలిండర్ గుర్తులున్నాయి. పొరపాటున గ్యాస్‌పొయ్యికి పడే ఓట్లు సిలిండర్‌కు పడే అవకాశం ఉంది. -
ఈసీ సునీల్ ఆరోరాను కలిసిన కేసీఆర్
-
కారుకు ట్రక్కు బ్రేకులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు ‘ట్రక్కు’బ్రేకులు వేసింది. ప్రజలు ఎప్పుడూ పేరు కూడా వినని సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) అనే పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిన ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈవీఎంలలో పొందుపరిచిన ట్రక్కు చిహ్నం, కారు గుర్తును పోలి ఉండటం నిరక్షరాస్యులు, వృద్ధులు గందరగోళపరిచింది. దీంతో ఎస్ఎంఎఫ్బీ పోటీ చేసిన 26 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఫలితంగా ఆయా చోట్ల టీఆర్ఎస్ మెజారిటీ 5 వేల నుంచి 10 వేల ఓట్ల వరకు తగ్గడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఆరు చోట్ల ప్రత్యక్ష ప్రభావం... రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎఫ్బీ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఆ పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,152 ఓట్లు రాగా, అత్యధికంగా ధర్మపురిలో 13,114 ఓట్లు వచ్చాయి. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ, టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు పోటీలో లేని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీనే మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల ఈ పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు కూడా సాధించింది. నియోజకవర్గాలవారీ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్‌లో ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రక్కు గుర్తు ఓడించింది. తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మార్జిన్ 2,925 ఓట్లకు చేరడానికి కూడా ట్రక్కు గుర్తే కారణమైంది. ధర్మపురిలో 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్ బతుకు జీవుడా అంటూ 400 ఓట్లతో గెలివాల్సి వచ్చింది. అలాగే పరిగి, పెద్దపల్లి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకన్నా ట్రక్కు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వాటితోపాటు మరో 20 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ట్రక్కు గుర్తు కారణంగా తగ్గిపోయింది. సీపీఎం కూటమికన్నా ఎక్కువ ఓట్లు... సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ 26 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 1,66,367 ఓట్లు సాధించగా కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సీపీఎంతో కలసి 107 స్థానాల్లో పోటీ చేసిన బహుజన లె‹ఫ్ట్ ఫ్రంట్ పార్టీ (బీఎల్ఎఫ్) కేవలం 1,41,432 ఓట్లే సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలయిన ఓట్లలో బీఎల్ఎఫ్పీ అభ్యర్థులకు 0.7 శాతం ఓట్లు రాగా ఎస్ఎంఎఫ్బీకి మాత్రం 0.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ఓటర్లు కారు, ట్రక్కు గుర్తులను పోల్చుకోవడంలో గందరగోళానికి గురయ్యారని, అందుకే ఆ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో తీసేశారు కానీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు కారుతోపాటు ఆటో గుర్తుకు కూడా ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆటో గుర్తు కారణంగా అప్పట్లో టీఆర్ఎస్ చాలా చోట్ల నష్టపోగా కొన్ని చోట్ల లాభపడింది. అయితే ఈ గందరగోళం మంచిది కాదనే ఆలోచనతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎన్నికల సంఘం మినహాయించింది. కానీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తును వదిలేయడంతో వీలున్నంతమేర ఆ గుర్తు టీఆర్ఎస్కు నష్టం చేయడం గమనార్హం. వివిధ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు... అలంపూర్ (8,803), భువనగిరి (3,613), భూపాలపల్లి (2,171), దుబ్బాక (12,215), గద్వాల (7,189), జడ్చర్ల (2,886), జనగామ (10,031), కామారెడ్డి (10,537), ఖైరతాబాద్ (1,152), ఎల్బీ నగర్ (3,739), మహేశ్వరం (3,457), మల్కాజిగిరి (4,651), మానకొండూరు (13,610), మంథని (5,457), మెదక్ (6,947), మునుగోడు (2,279), నాగార్జున సాగర్ (9,819), నాగర్ కర్నూల్ (5,545), నకిరేకల్ (10,383), పాలకుర్తి (3,199), పరిగి (8,694), పెద్దపల్లి (8,499), కుత్బుల్లాపూర్ (3,045), రామగుండం (3,531), కంటోన్మెంట్ (1,745), తాండూరు (2,608), తుంగతుర్తి (3,729), వికారాబాద్ (3,214), వరంగల్ వెస్ట్ (3,619). 2,124ఓట్లు.. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం కారు గుర్తుకు 85,440 ఓట్లు పోలవగా ఈ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య హస్తం గుర్తుకు 93,699 ఓట్లు వచ్చాయి. 8,259 ఓట్ల తేడాతో వీరేశంపై లింగయ్య గెలిచారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) పార్టీ తరఫున పోటీ చేసిన దుబ్బ రవికుమార్ ట్రక్కు గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పడ్డాయి. వీరేశం, లింగయ్యల మధ్య ఉన్న తేడా కంటే 2,124 ఎక్కువ ఓట్లు ట్రక్కు గుర్తుకు పడ్డాయన్నమాట. 267ఓట్లు.. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 70,428 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య తేడా 2,875 ఓట్లు. కానీ ఇక్కడ అదే ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసిన పి. మహేందర్‌రెడ్డి అనే అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. అంటే ప్రధాన అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిల మధ్య తేడాకన్నా కేవలం 267 ఓట్లే తక్కువ వచ్చాయి. -
ఏపీకి చిహ్నాలు ఖరారు చేసిన ప్రభుత్వం