Munugode War: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి | TRS Party To Move High Court On Symbols Resembling Car | Sakshi
Sakshi News home page

Munugode War: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

Published Tue, Oct 18 2022 3:13 AM | Last Updated on Wed, Oct 19 2022 6:58 PM

TRS Party To Move High Court On Symbols Resembling Car - Sakshi

చండూరులో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

సాక్షి, హైదరాబాద్‌: తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను స్వతంత్రులకు కేటాయించొద్దని.. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటి షన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై నేడు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

పిటిషన్‌లో వివరాలివి..
‘మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఇవ్వొద్దంటూ ఈ నెల 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈవీఎంలో స్టాంప్‌ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. రోడ్‌రోలర్‌ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించింది.

2018లో రోడ్డు రోలర్‌ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్‌ రోలర్‌ గుర్తు కారు పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను స్వతంత్రులకు కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ నష్టపోయే అవకాశం ఉంది.’

స్వతంత్రులకు ‘కారు’ ఇవ్వొద్దు 
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్‌లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement