సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఓటర్లు సులభంగా గుర్తుపట్టడానికి అనువుగా లేని, దగ్గర పోలికలు గల గుర్తులు ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఫోర్క్, చం చా, గ్యాస్ స్టౌ, గ్యాస్ సిలిండర్,బ్యాట్, విమానం వంటి దగ్గరి పోలికలున్న గుర్తులను కేటా యించారు. దాంతో ఓటర్లకు వాటిని ఎలా వివరించాలో తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాలెట్æలో ఊరు, పేరు, ఫొటో ఉండకపోవడం, తికమకపెట్టేలా గుర్తులు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్ని కల్లో కొందరు అభ్యర్థుల గెలుపు, ఓటములను ‘ట్రక్కు’ గుర్తు తారుమారు చేసిన విషయం తెలి సిందే. పంచాయతీ ఎన్నికల్లోనూ తికమకపెట్టే గుర్తులతో తమకు చిక్కులు వస్తాయేమోనని అభ్యర్థులు భయపడుతున్నారు. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేవారికి వరుసగా ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పుసాసర్, విమానం, పుట్‌బాల్, షటిల్‌కాక్, కుర్చి, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, హ్యాండ్‌బ్యాగ్, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్æ, బ్యాటరీ లైట్, బ్రష్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు, ఫోర్క్, చంచా ఇలా 30 రకాల గుర్తులు నిర్ణయించారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే ‘నోటా’కు వేసుకోవచ్చు.
వార్డులకు ఇలా...
వార్డు స్థానాలకు వరుసగా జగ్గు, గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్æ, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, విజిల్æ, కుండ, డిష్ యాంటీనా, గరాట, మూ కు డు, కేటిల్æ, విల్లుబాణం, పోస్టల్æ కవర్, హాకీస్టిక్, బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పోస్ట్‌డబ్బా ఇలా 19 రకాల గుర్తులతో పాటు నోటా కూడా ఉంటుంది. ఓటర్లు గుర్తించే, సులువుగా అర్థమయ్యే గుర్తులెన్నో ఉన్నాయి. అలాంటి వన్నీ వదిలేసి క్లిష్టమైనవి గుర్తులుగా పెట్టడంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థులకు మొదటిస్థానంలో ఉంగరం గుర్తు ఉంది. అది చూడగానే అందరికీ సులువుగా అర్ధం అవుతుంది. ఏడోస్థానంలో ఉన్న షటిల్ కాక్ గుర్తు దక్కే అభ్యర్థికి దానిని ప్రచారం చేసుకోవడం ఇబ్బందిగా మారింది. బ్యాలెట్ పేపర్‌లో మూడోస్థానంలో ఉన్న బ్యాట్, ఐదో స్థానంలో ఉన్న విమానం గుర్తులు దగ్గరి పోలికలతో ఉన్నాయి. వీటి విషయంలో వృద్ధులు పొరబడే అవకాశాలున్నాయి. బ్యాలెట్æ పేపర్‌లో 29వ స్థానంలో ఉన్న ఫోర్కు, 30వ స్థానంలో ఉన్న చంచా గుర్తులు దాదాపు ఒకేలా ఉన్నాయి. దాంతో ఒకదానికి బ దులు మరొకదానికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు. వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగించే బ్యాలెట్‌లో మూడోస్థానంలో గ్యాస్‌పొయ్యి, ఐదో స్థానంలో గ్యాస్ సిలిండర్ గుర్తులున్నాయి. పొరపాటున గ్యాస్‌పొయ్యికి పడే ఓట్లు సిలిండర్‌కు పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment