సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గత సోమవారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు రెండు విడతల పోలింగ్ జరగగా ఈనెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది.
జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం
ఖమ్మం 73.35 శాతం
నల్లగొండ 65 శాతం
సూర్యపేట 77 శాతం
పెద్దపల్లి 67.30 శాతం
రంగారెడ్డి 65.3 శాతం
కరీంనగర్ 64 శాతం
యాదాద్రి 63 శాతం
కామరెడ్డి 81.78 శాతం
నిజామాబాద్ 69.38 శాతం
వనపర్తి 80 శాతం
నాగర్ కర్నూల్ 76 శాతం
జోగులాంబ గద్వాల 78 శాతం
వరంగల్ అర్బన్ జిల్లా 87 శాతం
జనగామ 90 శాతం
భూపాల్ పల్లి 83 శాతం
Comments
Please login to add a commentAdd a comment