నిడమనూరు (నాగార్జునసాగర్) : మండలంలోని బంకాపురంలో వరుసకు అత్తా కోడలు అయిన ఉన్నం కౌసల్య, ఉన్నం శోభ ఎన్నికల బరిలో నిలిచారు. బంకాపురం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేయించారు. ఇక్కడ గత సర్పంచ్‌గా పనిచేసిన ఉన్నం శోభ తిరిగి పోటీ చేస్తుండగా ఆమె అత్త అయిన ఉన్నం కౌసల్య కొత్తగా బరిలో నిలిచారు. ఉన్నం శోభ భర్త కాంగ్రెస్ పార్టీకి చెందగా, కౌసల్య భర్త ఉన్నం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ నాయకుడు. ఉన్నం చిన వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. జనరల్ మహిళ కావడంతో తన సతీమణిని రంగంలోకి దింపి గెలుపుకోసం పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల బరిలో బాబాయి, అబ్బాయి
త్రిపురారం : త్రిపురారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం సొంత బాబాయి, అబ్బాయి పోటీపడుతున్నారు. ఇంటి పేరుతో పాటు వారి పేర్లు కూడా ఒక్కటే కావడం విశే షం. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరు న్న అనుముల శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. త్రిపురారం సొసైటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరు సొంత బా బాయి, కుమారుడు వరస అవుతారు. వీరితో పాటు చల్లబట్ల వెంకట్రామ్‌రెడ్డి స్వ తంత్య్ర అభ్యర్థిగా, మరో ముగ్గురు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. కాగా సొంత బాబాయి, అబ్బాయి ఎన్నికల బరిలో నిలవడంతో ఎవ రు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment