చిత్రకారుడు రుద్ర రాజేశంకు సీఎం సూచన
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు
ప్రతిబింబించాలని స్పష్టీకరణ
జూన్ 2న ఆవిష్కరణకు అవకాశాలు అంతంత మాత్రమే
రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’రెడీ
సాక్షి, హైదరాబాద్: రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర అధికారిక చిహ్నం రూపకల్పనపై చ ర్చించారు. రాజేశం రూపొందించిన పలు నమూనాలను పరి శీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు.
గత బీఆర్‌ఎస్ సర్కారు ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర అధికార చిహ్నంలో చారి్మనార్‌తో పాటు కాకతీయ కళాతోరణం గుర్తు లు ఉండగా, వాటిని రాచరిక ఆనవాళ్లుగా పరిగణించి, కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త అధికారిక చిహ్నంతో పాటు రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి ని ర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త అధికారిక చిహ్నం రూపకల్పన కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో దీనిని ఆవిష్కరించే అవకాశాలు అంతగా లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర గేయం ఆవిష్కరణకు ఏర్పాట్లు
‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం, జూన్ 2న నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా దానిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందెశ్రీ రాసిన ఈ గేయాన్ని ఎలాంటి మార్పులు లేకుండా రాష్ట్ర గేయంగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. అయితే 13 నిమిషాల నిడివి కలిగిన ఈ గేయాన్ని అంతర్జాతీయ అతిథులు పాల్గొనే కార్యక్రమాల్లో పాడడానికి వీలుగా సంక్షిప్తీకరించి మరో వెర్షన్‌ను సైతం రూపొందించాలని సీఎం గతంలో అందెశ్రీకి సూచించారు.
నేడు సోనియాకు ఆహ్వానం
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సోనియాను ముఖ్యమంత్రి కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పలకనున్నారు. సోమవారం కేరళ వెళ్లిన సీఎం అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చన సోనియాగాం«దీని జూన్ 2న జరిగే వేడుకలకు ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment