
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ కుడి చెయ్యి మణికట్టుపై సూదితో పొడిచినట్టు ఉన్న గుర్తులు కనిపిస్తున్నా యి కదా ! ఆ గుర్తులు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జ రుగుతోంది. 20 రోజుల పాటు కనిపించకుండా పోయిన కిమ్ మే 1న ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోల్లో కిమ్ చేతిపై కనిపించే గుర్తులు చూసి ఆయన గుండెకి శస్త్రచికిత్స జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు కిమ్ ఏప్రిల్ 11న ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో చేతిపై అలాంటి గుర్తులేవీ కనిపించలేదు.
గుండెలో రంధ్రాలను పూడ్చడానికి స్టంట్ అమర్చడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతి ద్వారా కూడా శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు వాదిస్తూ ఉంటే మరికొందరు గుండెకి స్టంట్ వెయ్యడానికి చేసే ఇంట్రావీనస్ ప్రక్రియకి అలాంటి గురుతులు పడవని అంటున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైనా పరీక్షలు జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే, కిమ్‌కు సర్జరీ జరిగిందంటూ వస్తున్న వార్తల్ని దక్షిణ కొరియా కొట్టి పారేసింది. కిమ్‌కి ఎలాంటి శస్త్రచికిత్స కానీ, వైద్య పరీక్షలు కానీ జరగలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment