
సియోల్: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తమ దేశ సైనిక బలంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు మిస్సైల్స్‌ను పరీక్షించిన కిమ్.. తాజాగా అత్యాధునిక డ్రోన్ల పని తీరును పర్యవేక్షించారు. ఏఐ సాంకేతికతతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా తయారు చేసినట్టు అక్కడి అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి.
అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల డ్రోన్ల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా కృత్రిమ మేధస్సు (AI)తో తయారుచేసిన అత్యాధునిక డ్రోన్ల పరీక్షను ఆయన పర్యవేక్షించారు. భూమిపై, సముద్రంలో వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ల పరీక్షను కిమ్ పర్యవేక్షించినట్లు నార్త్ కొరియా మీడియా వెల్లడించింది. ఈ సందర్బంగా కిమ్ మాట్లాడుతూ..‘ఆయుధాల ఆధునికీకరణలో మానవరహితమైనవి, కృత్రిమ మేధస్సు సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ‘అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది’ అని కిమ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.
Kim Jong Un Tests AI-Equipped Drones
North Korean leader Kim Jong Un personally observed tests of new reconnaissance and kamikaze drones equipped with artificial intelligence, according to state media KCNA.#NorthKorea #KimJongUn #AI #Drones #MilitaryTech pic.twitter.com/Bh6lFP0031— Cyrus (@Cyrus_In_The_X) March 27, 2025