wrist
-
కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ తన చేతి మణికట్టుపై కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఇలా కొరడాతో కొట్టించుకున్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఎలాంటి చెడు జరగకుండా అమ్మ కాపాడుతుందని విశ్వసిస్తారు. భూపేశ్ బఘేల్ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. అందుకు సబంధించిన వీడియోని చత్తీస్‌గఢ్ సీఎం ట్వీట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu — Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022 (చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...) -
మీరు చిన్నారులను ఎత్తుకుంటున్నారా...జర జాగ్రత్త
పిల్లలను ఆడించాలని ఎవరికి ఉండదు? అందునా నెలల పిల్లలనుంచి రెండేళ్లలోపు చిన్నారులు తేలిగ్గా ఉంటారు కాబట్టి వాళ్లను గాల్లోకి ఎగరేసినట్టుగా ఎత్తుతుంటారు తల్లులు. ఇలా చేసే సమయంలో కొందరికి ఓ చిత్రమైన సమస్య వస్తుంటుంది. దానిపేరే ‘బేబీ రిస్ట్’! బొటన వేలూ, చూపుడువేలు మధ్యన పిల్లలను ఎత్తుకుని ఎగరేసినట్లుగా చేసే సమయంలో అక్కడ పడే ఒత్తిడి వల్ల మణికట్టు దగ్గరి టెండన్లు దెబ్బతిని విపరీతంగా నొప్పి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. కాస్త విశ్రాంతితో తేలిగ్గానే తగ్గేతాత్కాలిక సమస్య ఇది. నొప్పి మరీ ఎక్కువైతే తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌తో వైద్యులు చికిత్స అందిస్తారు. చాలా అరుదుగా శస్త్రచికిత్స అవసరం పడే సందర్భాలూ ఉంటాయి. చదవండి: కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ! -
కిమ్‌కి శస్త్ర చికిత్స జరిగిందా ?
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ కుడి చెయ్యి మణికట్టుపై సూదితో పొడిచినట్టు ఉన్న గుర్తులు కనిపిస్తున్నా యి కదా ! ఆ గుర్తులు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జ రుగుతోంది. 20 రోజుల పాటు కనిపించకుండా పోయిన కిమ్ మే 1న ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోల్లో కిమ్ చేతిపై కనిపించే గుర్తులు చూసి ఆయన గుండెకి శస్త్రచికిత్స జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు కిమ్ ఏప్రిల్ 11న ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో చేతిపై అలాంటి గుర్తులేవీ కనిపించలేదు. గుండెలో రంధ్రాలను పూడ్చడానికి స్టంట్ అమర్చడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతి ద్వారా కూడా శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు వాదిస్తూ ఉంటే మరికొందరు గుండెకి స్టంట్ వెయ్యడానికి చేసే ఇంట్రావీనస్ ప్రక్రియకి అలాంటి గురుతులు పడవని అంటున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైనా పరీక్షలు జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే, కిమ్‌కు సర్జరీ జరిగిందంటూ వస్తున్న వార్తల్ని దక్షిణ కొరియా కొట్టి పారేసింది. కిమ్‌కి ఎలాంటి శస్త్రచికిత్స కానీ, వైద్య పరీక్షలు కానీ జరగలేదని స్పష్టం చేశారు. -
అర్ధరాత్రి వరకు మొబైల్ చూస్తున్నాడని.. కిరాతకం!
సాక్షి, హైదరాబాద్ : మొబైల్ ఫోన్‌కు బానిసగా మారి.. అర్ధరాత్రి వరకు మొబైల్లో సినిమాలు చూస్తున్న కొడుకుపై ఆగ్రహించి ఓ తండ్రి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కొడుకు నిద్రిస్తుండగా.. అతని చేతిని మణికట్టు వరకు నరికేశాడు. ఈ షాకింగ్ ఘటన పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వాదే ముస్తాఫా బస్తీకి చెందిన మహమ్మద్ ఖయ్యూం ఖురేషీ (45) ఎలక్ట్రిషియన్. అతని కుమారుడు మహమ్మద్ ఖాలేద్ ఖురేషి (18) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇటీవల స్మార్ట్‌ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్లో అస్తమానం సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాడు. దీనిని గమనించిన తండ్రి ఖయ్యూ నిత్యం మొబైల్ ఫోన్ చూడటం మంచి అలవాటు కాదని, దీనివల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలు ఉంటాయని కొడుకును హెచ్చరించాడు. అయినా తండ్రి మాటను ఖాలేద్ లెక్కచేయలేదు. దీంతో రెండురోజుల కిందట తండ్రీ-కొడుకుల మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రికి ఎదురుతిరిగిన ఖాలేద్.. కోపంలో అతని చేయి కొరికి పారిపోయాడు. అనంతరం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ మొబైల్ఫోన్లో సినిమాలు చూడటం ప్రారంభించాడు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం కొడుకు నిద్రిస్తుండగా అతని మణికట్టును తండ్రి కత్తితో నరికేశాడు. బాధితుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
సోమరులకే తెలివి ఎక్కువ!
వాషింగ్టన్: కష్టపడి పనిచేసే వారికన్నా సోమరులకే ఎక్కువ తెలివితేటలుంటాయని అమెరికాలోని ‘ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ వర్సిటీ’ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. సోమరులు ఎక్కువగా ఆలోచిస్తుండమే దీనికి కారణం. ఎక్కువ ఐక్యూ ఉన్నవాళ్లు ఏ విషయంలోనూ చికాకు పడరనీ, ఎక్కువగా ఆలోచిస్తుంటారని వారంటున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. జవాబుల్ని బట్టి ‘ఎక్కువ ఆలోచించేవారు, తక్కువ ఆలోచించేవారు’ అని విడదీశారు. వారి మణికట్టుకు ఒక పరికరం తగిలించి వారంపాటు వారి అన్ని శరీర కదలికలను గమనించారు. ఎక్కువగా ఆలోచన చేసేవారి శరీర కదలికలు తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి బద్ధకస్తులకే తెలివి ఎక్కువని నిర్ధారించారు. -
తెగిన ఎడమ చేతిని కుడికాలికి కుట్టి...
బీజింగ్: సృష్టికి ప్రతిసృష్టి చేసే వైద్యులు దేవుడితో సమానమంటారు. ఒక ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కార్మికుడి చేతిని వైద్యులు రక్షించి ఈ మాటను మరోసారి రుజువు చేశారు. చైనాలోని జో అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా ప్రమాదానికి లోనయ్యాడు. అతడి ఎడమ చేయి మిషన్‌లో పడి తెగిపడింది. అతికించడానికి వీల్లేకుండా చర్మం అంతా పిప్పి పిప్పి అయిపోయింది. దీంతో ఆ భాగంలోని నరాలు, టిష్యూలను రక్షించడానికి జోకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు పూనుకున్నారు . మైక్రో బయాలజీ విభాగం అధిపతి డా.టాంగ్ జుయు నేతృత్వంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. వివరాల్లోకి వెడితే ...చైనాలోని ఒక ఫ్యాక్టరిలో స్పిన్నింగ్ బ్లేడ్ మిషన్‌లో పడి జో ఎడమ చేయి మణికట్టు పై భాగమంతా పూర్తిగా నలిగి పోయింది. గాయాల నుంచి అతను కోలుకునే దాకా తెగిపడిన అవయవభాగాన్ని అతని కుడికాలుకి జత చేసి ఆ భాగాన్ని సజీవంగా నిలపగలిగారు. ఒకనెల తర్వాత దాదాపు 10 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు విజయవంతంగా జో చేతిని అతికించారు. అతడు ఇప్పుడిప్పుడే చేతివేళ్లను మెల్లిగా కదిలిస్తున్నాడని, పూర్తిగా స్వాధీనంలోకి రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్మికుడి ఎడమ చేయి వేళ్లు, మిగిలిన కణాలకు రక్త ప్రసరణ జరిగి అది సజీవంగా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకున్నామని డాక్లర్లు తెలిపారు. సాధారణంగా తెగిపడిన వేళ్లు, చేయి తదితర భాగాలకు సుమారు పది గంటల్లోపు తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరించాల్సిం ఉంటుందని పేర్కొన్నారు. అయితే జో కోలుకునేసరికి సమయం పడుతుందనీ, అందుకే మిగిలిన భాగాన్ని ఇలా కాపాడాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించిన పుర్రెను అమర్చి చైనా వైద్యులు చరిత్ర సృష్టించారు.