సోమరులకే తెలివి ఎక్కువ!
వాషింగ్టన్: కష్టపడి పనిచేసే వారికన్నా సోమరులకే ఎక్కువ తెలివితేటలుంటాయని అమెరికాలోని ‘ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ వర్సిటీ’ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. సోమరులు ఎక్కువగా ఆలోచిస్తుండమే దీనికి కారణం. ఎక్కువ ఐక్యూ ఉన్నవాళ్లు ఏ విషయంలోనూ చికాకు పడరనీ, ఎక్కువగా ఆలోచిస్తుంటారని వారంటున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. జవాబుల్ని బట్టి ‘ఎక్కువ ఆలోచించేవారు, తక్కువ ఆలోచించేవారు’ అని విడదీశారు. వారి మణికట్టుకు ఒక పరికరం తగిలించి వారంపాటు వారి అన్ని శరీర కదలికలను గమనించారు. ఎక్కువగా ఆలోచన చేసేవారి శరీర కదలికలు తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి బద్ధకస్తులకే తెలివి ఎక్కువని నిర్ధారించారు.