lazy
-
రూ.50 వేల శాలరీ, కారు ఉన్న బాయ్‌ఫ్రెండ్ కావాలి.. హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ సోనాలి కులకర్ణి పెద్దగా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ సినిమాలతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆమెకు కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆధునిక భారతీయ మహిళలపై సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భారతీయ మహిళల గురించి మాట్లాడింది. ఈ రోజుల్లో బాగా సంపాదన, స్థిరపడిన వారినే భర్తగా కావాలని కోరుకుంటున్నారని తెలిపింది. సోనాలి మాట్లాడుతూ..'ఇండియాలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే. వారికి బాగా సంపాదించి, సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్ ఇంక్రిమెంటట్స్ వచ్చే భర్త కావాలి. ఈ మధ్యకాలంలో మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడటం మర్చిపోతున్నారు. తమ కోసం సంపాదించగలిగేలా మీ ఇళ్లలోని అమ్మాయిలను పెంచమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఇంట్లో కొత్త ఫ్రిజ్ కావాలి. అందులో సగం మీరు చెల్లించండి. మిగిలిన సగం నేను చెల్లిస్తానని ఒక్క అమ్మాయియైనా చెప్పగలరా?. పురుషులకు 18 ఏళ్లు రాగానే కుటుంబానికి ఆర్ధికంగా మద్దతుగా ఉండేందుకు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ 25 సంవత్సరాలు వచ్చిన మహిళలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్‌ను కావాల్సినవి కొనివ్వాలని బలవంతం చేస్తున్నారు.' అని ఇంటర్వ్యూలో మాట్లాడారు. (ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్) అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి.. అబ్బాయికి సొంతిల్లు ఉందా? 50 వేల పైనే శాలరీ, కారు ఉందా? అనేదే చూస్తున్నారు. అసలు అమ్మాయిలకి ఏమి కావాలి మంచి అబ్బాయిల? మంచి ఆఫర్లా? అని ప్రశ్నించారు. అమ్మాయి, అబ్బాయి కష్ట, సుఖాలను సమానంగా పంచుకోవాలి.. కానీ అమ్మాయిలు అది వదిలేసి మానవ హక్కులు అంటున్నారని కులకర్ణి విమర్శించింది. సోనాలి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమెనుప్రశంసిస్తుండగా.. చాలా మంది మహిళలు విమర్శిస్తున్నారు. కాగా.. దిల్ చాహ్తా హై, ప్యార్ తూనే క్యా కియా వంటి సినిమాల్లో సోనాలి నటించింది. I don't know who she is but hats off to her courage to speak the unspoken unpalatable truth! 👏#Equality pic.twitter.com/vB2zwZerul — Amit Srivastava 🕉️ (@AmiSri) March 15, 2023 -
సోమరులకే తెలివి ఎక్కువ!
వాషింగ్టన్: కష్టపడి పనిచేసే వారికన్నా సోమరులకే ఎక్కువ తెలివితేటలుంటాయని అమెరికాలోని ‘ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ వర్సిటీ’ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. సోమరులు ఎక్కువగా ఆలోచిస్తుండమే దీనికి కారణం. ఎక్కువ ఐక్యూ ఉన్నవాళ్లు ఏ విషయంలోనూ చికాకు పడరనీ, ఎక్కువగా ఆలోచిస్తుంటారని వారంటున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. జవాబుల్ని బట్టి ‘ఎక్కువ ఆలోచించేవారు, తక్కువ ఆలోచించేవారు’ అని విడదీశారు. వారి మణికట్టుకు ఒక పరికరం తగిలించి వారంపాటు వారి అన్ని శరీర కదలికలను గమనించారు. ఎక్కువగా ఆలోచన చేసేవారి శరీర కదలికలు తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి బద్ధకస్తులకే తెలివి ఎక్కువని నిర్ధారించారు. -
ఐడిల్‌నెస్‌తో ఐడియాలు!
హ్యూమర్ ప్లస్ సోమరితనం మంచి గుణం కాదంటూ చాలా మంది ఈసడిస్తుంటారు. భాషలకు అతీతంగా సోమరితనాన్ని తిడుతూ సామెతలు పుట్టించారు. సోమరిని మొద్దు అనీ, సోంబేరి అనీ రకరకాల ప్రాంతీయభాషల్లో తూలనాడారు. నిజానికి సోమరిగా ఉండటం వల్లనే మనిషి అనేక విధాల పురోగతి సాధించాడని కొందరి అభిప్రాయం. అసలు వ్యవసాయం అనే ప్రక్రియ పుట్టిందే బద్దకం వల్ల కావచ్చని స్థిమితంగా ఆలోచిస్తే తెలుస్తుంది. రోజూ వేటాడటం బద్దకం అనిపించిన ఆదిమానవుడు తన వృత్తికి ప్రత్యామ్నాయం కనిపెట్టాడని కాస్త బద్దకంగా పడుకొని యోచిస్తే తెలుస్తుంది. దీనికి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఉదాహరణకు రోజూ కూరొండుకోవడం కష్టమనిపించి మర్నాటికి నిల్వ ఉంచడం కోసమే ముందుగా పచ్చడి కనిపెట్టాడు. అందులో మరింత అడ్వాన్స్ అయిపోయి ఫ్రిజ్జును రూపొందించాడు. అందుకే మొట్టమొదట పచ్చడిని కనుగొన్నవారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలిగానీ.. ఆ కనిపెట్టిందెవరో వెతకడం కాస్త బద్దకమనిపించి మానేశారని కొందరు అంటుంటారు. అలసత్వానికి అలవాటు పడ్డ మనిషికి ‘నడక బహు కష్టం’ అనిపించింది. రెండు కాళ్ల మీద నిలబడి, అదేపనిగా నడవటం కష్టమనిపించింది. దాంతో సీట్ మీద కూర్చొని తొక్కే సైకిల్ కనిపెట్టాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. స్టీరింగ్ ముందు బద్దకంగా కూర్చున్నా సునాయాసంగా ముందుకు వెళ్లడం కోసం కారు కనిపెట్టాడు. బద్దకానికి లెసైన్స్ ఇవ్వడం కోసం కారును దర్జాకు చిహ్నం అని వదంతులు వ్యాప్తి చేశారు. ఈ బద్దకం అనే గుణమే లేకపోతే కార్లూ, విమానాలూ ఉండేవి కాదని కాళ్లు బార్లాజాపుకొని ఆలోచిస్తే, నిదానం మీద తెలుస్తుంది. ఇక ఇదే బద్దకం బాగా పెరిగిపోయి, వాహనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ‘ఆ... మళ్లీ ఎవడు స్టార్ట్ చేస్తాడులే’ అంటూ తన గుణాన్ని వాహనం ఇంజన్‌కూ నేర్పుతాడు. ఇలా ఇంజన్ చేత ఇంధనం ఖర్చు పెట్టిస్తాడు. కాలుష్యమైనా పెంచుతాడు కానీ కార్బ్యురెటర్ కాక తగ్గనివ్వడు. సాధారణంగా మగవాళ్లే సోమరితనానికి అలవాటు పడి ఉంటారు. ‘ఏవోయ్... కాస్త కాఫీ ఇవ్వు... ఆ పేపర్ ఇలా అందించు... కళ్లజోడు అందుకో... టీవీ ఆన్ చెయ్ / టీవీ ఆఫ్ చెయ్’ అంటూ వాళ్ల పార్ట్నర్కు పనులు పురమాయిస్తుంటారు. ఇలాంటి వ్యాలిడ్ రీజన్ వల్లనే సోమరి‘పోతు’ అనే మాట పుట్టింది. సోమరుల బుర్ర దెయ్యాలకు వర్క్‌షాప్ అంటుంటారు. ఆ సామెతను అపార్థం చేసుకుంటారు. కానీ ‘దెయ్యాలకు తగిన పని దొరుకుతుంది కదా, అవి సదరు మెదడును కార్యక్షేత్రం చేసుకొని పాపం కష్టించి పనిచేస్తున్నాయి కదా’ అని ఆలోచించరు. పైగా ‘బుర్రతిరుగుడు’ అని కూడా నిందించే అవకాశం ఉంది. కానీ అవి వచ్చి పనిచేయడం వల్లనే కదా... కొత్త కొత్త ఆలోచనలు పుట్టి, కొత్త కొత్త ఆవిష్కారాలు జరుగుతున్నాయి. అందుకే ఆ ఇంగ్లిష్ సామెత విషయంలో మనుషులందరూ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ మీటింగులు అవీ పెట్టడం, పునరాలోచించుకోవడం వంటివి తిరిగి మనకే శ్రమను పెంచే పనులు. అందుకే ఎవరికి వారు ఒకసారి ‘ఇటీజ్ ఐడియల్ టు బి ఐడిల్’ అని ఒకసారి తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. - రాంబాబు -
బద్ధకస్తుల వ్యాయామానికి డ్రగ్స్!
లండన్: ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నా, చాలామంది వివిధ సాకులతో వారి మాటలను పెడచెవిన పెడుతుంటారు. ఇలాంటి బద్ధకస్తుల కోసం 'మానసిక ఉత్ప్రేరకాలు' సూచిస్తున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఆధునిక సమాజంలో శారీరక శ్రమ తగ్గడం అనేక రుగ్మతలకు కారణమౌతోంది. దీంతో బద్ధకస్తులు, అధిక బరువుతో బాధపడుతున్నవారు వ్యాయామానికి తమను తాము సన్నద్ధం చేసుకోవడానికి స్వల్ప మోతాదులో మానసిక ఉత్ప్రేరకాలు ఉపయోగకరంగా ఉంటాయని కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటివరకు సాధారణంగా నికోటిన్‌కు బానిసలైన వారిలో పరివర్తన కోసం వైద్యులు ఈ తరహా సూచనలు చేస్తుంటారు. కానీ స్థూలకాయులు, బద్దకస్తుల కోసం కూడా మానసిక ఉత్ప్రేరకాలను సూచించడం తప్పుకాదంటున్నారు. ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో లేజీనెస్, స్థూలకాయం చాలా ముఖ్యమైనవనీ వీటిని తగ్గించడానికి మానసిక ఉత్ప్రేరకాలు వాడటం తప్పులేదని ఇది మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరణాల సంఖ్య రెట్టింపవుతుందని, దీనికి సైకో ఫార్మకలాజికల్ చికిత్సా విధానం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
వ్యాపార దక్షత
పిల్లల కథ రఘునాథపురంలో శీనయ్య అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే వాడి నానమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది. నానమ్మ గారాబం వలన శీనయ్య ఏ పనీ చేయకుండా పెరిగాడు. స్వతహాగా తెలివితేటలు ఉన్నా పనిచేయవలసిన అవసరం లేక సోమరిలా తయారయ్యాడు. ‘‘ఒరే శీనూ! నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇక పనిచేసే ఓపిక నాకు లేదు. కనుక నువ్వే ఏదన్నా పనిచేసి డబ్బు సంపాదించి తీసుకురాకపోతే ఇల్లు గడవడం కష్టం’’ అంది ముసలావిడ. ఎప్పుడూ అంత గట్టిగా మాటాడని నానమ్మ అలా అనేసరికి ఆలోచనలో పడ్డాడు శీనయ్య. నిజమే నానమ్మ పెద్దదైపోయింది. పాపం ఇంత కాలం అక్కడ ఇక్కడ పనిచేసి నెట్టుకొచ్చింది. ఇక లాభం లేదు, తనే ఏదో పనిచేసి డబ్బు సంపాదించాలి. కాని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఊరి మధ్యనున్న శివాలయం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాధువుతో శీనయ్య తన కుటుంబ పరిస్థితి వివరించి, ‘ఏం చేయాలో తెలియడం లేదు’ అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, జోలినించి ఓ పచ్చి మామిడికాయ తీసి శీనయ్య చేతిలో పెట్టాడు. ‘‘నాయనా! ఇది పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించు. అనతికాలంలోనే మంచి జరుగుతుంది’’ అని దీవించాడు. సాధువు ఇచ్చిన మామిడికాయతో ఇంటికి చేరి, జరిగినదంతా నానమ్మకు చెప్పి, కారం, ఉప్పు, రెండు డబ్బాలలో పోసుకుని, మామిడికాయతో ఊరి మధ్యనున్న కూడలి వద్దకు చేరుకున్నాడు. మామిడికాయను సన్నగా తరిగి, ఉప్పు, కారం చల్లి, ‘‘ముక్క పావలా’’ అంటూ గట్టిగా అరుస్తూ, అందరినీ ఆకర్షించాడు. ఒక అరగంటలోనే శీనయ్య దగ్గర మామిడికాయ ముక్కలన్నీ అయిపోయాయి. శీనయ్యకు అయిదు రూపాయలు వచ్చాయి. దానిలో మూడు రూపాయలకు పచ్చిసెనగలు తీసుకున్నాడు శీనయ్య, మిగతా రెండు రూపాయలతో ఇంటికి చేరుకున్నాడు. సెనగలు నానబెట్టి, ఊరు చివరనున్న మామిడి తోటకు పోయాడు శీనయ్య. తోటమాలితో బేరమాడి, తన దగ్గర ఉన్న రెండు రూపాయలకి, నాలుగు పెద్ద మామిడికాయలు కొన్నాడు. మరుసటిరోజు ఊరిలో గౌరమ్మ సంబరం. సెనగలను ఉడకబెట్టి, ఉప్పు, కారం చల్లి గుడి దగ్గర అమ్మాడు. ఈ సారి శీనయ్య చేతికి యాభై రూపాయలు వచ్చాయి. మొదటినించి ఓ మామిడి పండ్ల వ్యాపారి శీనయ్యను గమనిస్తున్నాడు. శీనయ్య దగ్గరకు వచ్చి ‘‘బాబూ! నా పేరు పరంధామయ్య. నేను ప్రతి వేసవిలో మామిడిపళ్ల వ్యాపారం చేస్తుంటాను. ఎప్పుడూ లాభాలు రాలేదు. నువ్వు వ్యాపారం బాగా చేస్తున్నావ్. నా వ్యాపారం ఇద్దరం చూసుకుందాం. పెట్టుబడి నాది, లాభాలు ఇద్దరివి’’ అన్నాడు పరంధామయ్య. ‘‘సరే నే చెప్పినట్టుగా చేస్తానంటే ఒప్పుకుంటాను’’ అన్నాడు శీనయ్య. ఒకేసారి లాభాలు ఆర్జించాలి అనే ఆశతో పరంధామయ్య మామిడిపళ్లను రేటు ఎక్కువ చెప్పడంతో పెద్దగా వ్యాపారం జరిగేది కాదు. ఇదంతా తెలుసుకున్న శీనయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఉదయం తోట నుండి పరంధామయ్య తెచ్చిన మామిడిపళ్లను చెరి సగం చేశాడు. రోజులానే పరంధామయ్యను తన వ్యాపారం తనను చేసుకోమన్నాడు. అతని దగ్గరగా మరో బండిమీద పరంధామయ్య కంటే తక్కువ ధరకే అని గట్టిగా అరుస్తూ, అన్నింటినీ అమ్మేశాడు. ఎవరూ చూడకుండా పరంధామయ్య బండి మీదున్న పళ్లను కూడా తన బండి మీదకు చేర్చి అమ్మేశాడు. నలిగిన మామిడిపళ్లను ఇంటికి తీసుకెళ్లి రసం తీసి ఒక చాపమీద పూసి తాండ్ర తయారీ మొదలుపెట్టాడు. ‘‘ఏ వ్యాపారానికైనా పోటీ ఉండాలి. అమ్మేవాడికి పట్టు విడుపు ఉండాలి. మనం చెప్పిన ధరకే అంటే అందరికీ ఆసక్తి ఉండదు. కొంత ధర పెంచి మరల తగ్గించి కొనేవారిని ఆకట్టుకోవాలి. అందులోనూ పండ్ల వ్యాపారం ఏ రోజుకారోజు ముగించకపోతే చాలా నష్టం వస్తుంది’’ అన్న శీనయ్య మాటలకు చాలా సంతోషించాడు పరంధామయ్య. శీనయ్య నానమ్మతో మాట్లాడి, తన కుమార్తె నాగమణిని ఇచ్చి పెండ్లి చేయడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా శీనయ్యకు అప్పగించాడు. ఆ రోజునుంచి శీనయ్య మంచి మెళకువలతో పండ్ల వ్యాపారం అభివృద్ధి చేసి, మంచి దక్షత గల వ్యాపారవేత్తగా ఎదిగాడు. - కూచిమంచి నాగేంద్ర -
కాస్త స్లో... కానీ బోలెడు ఉపయోగం!
ఇంట్లోనే ఉండేవాళ్లకు రెండు పూటలా వంట చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు రెండో పూట వంట చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అలసిపోవడం వల్ల బద్దకంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఆలస్యంగా రావలసి రావొచ్చు. అలాంటప్పుడు వంట చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటివారికి ఈ కుక్కర్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ‘క్రాక్పాట్ స్లో కుక్కర్’ అంటారు. వెల ఐదు వేల వరకూ ఉంది. అయితే కొన్ని ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్‌లో 3 వేల నుంచీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. క్రాక్పాట్ కుక్కర్ కరెంటుతో పని చేస్తుంది. ఇందులో ఫుడ్ మామూలుగా కంటే కాస్త మెల్లగా ఉడుకుతుంది. ఎక్కువ వేడిమీద వేగంగా ఉడికిపోవడం వల్ల ఆహార పదార్థాల్లోని కొన్ని విటమిన్లు ఆవిరైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మాడిపోతుంటాయి కూడా. అలా కాకుండా ఉండేందుకే ఈ స్లో కుక్కర్ రూపకల్పన జరిగింది. మెల్లగా ఉడుకుతుంది కాబట్టి, కుకర్ ఆన్‌చేసి బయట ఏదైనా పనివుంటే చేసుకుని రావొచ్చు. ఒకేసారి అన్నం, కూర వండుకునే సౌలభ్యం ఉంది కాబట్టి... సాయంత్రం వంట కోసం అవసరమైనవన్నీ కుక్కర్లో పెట్టి, ఏ టైముకి ఆన్ అవ్వాలో టైమ్ సెట్ చేసి పెడితే, ఆ టైముకి కుక్కర్ ఆన్ అవుతుంది. కరెంటు పోయినా, మళ్లీ రాగానే దానంతటదే ఆన్ అవుతుంది. ఉడి కాక ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది. ఒక్క మైనస్ ఏంటంటే... త్వరగా వండాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఉపయోగపడదు!