
ప్రముఖ బిలీయనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ సంస్థ స్పేస్‌ఎక్స్ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌షిప్ రాకెట్ గగనతలంలో పేలిపోయి ముక్కలు చెక్కలు అయ్యింది. ఈ రాకెట్‌కు సంబంధించి ఇది ఎనిమిదో ప్రయోగం కాగా.. ఆ శకలాలు ఫ్లోరిడా, బహమాస్‌లలో పడడం విశేషం.
చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం.. స్టార్‌షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ఉదయం టెక్సాస్ నుంచి స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్-8 స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. అయితే..స్పేస్‌లోకి ప్రవేశించిన వెంటనే అది పేలిపోయింది.
ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా.. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమాస్‌లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉల్కా పాతాన్ని తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Is that space X rocket disintegration #spacex pic.twitter.com/apEagPIqDB
— Talha Mirza (@tmirza777) March 6, 2025
“Never give up” Elon Musk
Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025
ఇదిలా ఉంటే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం జరగ్గా.. కరేబియన్ దీవులపైన రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. మొత్తంగా ఇప్పటిదాకా స్టార్‌షిప్ రాకెట్‌తో ఎనిమిది ప్రయోగాలు చేయగా.. మే 2021లో నిర్వహించిన ఎస్‌ఎన్ 15 టెస్ట్ ఫ్టైట్ ఒక్కటి మాత్రమే పాక్షికంగా సక్సెస్ అయ్యింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా స్టార్‌షిప్‌గా ప్రస్తుతానికి గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తు(403 అడుగులు)తో నాసా శాటర్న్-V రికార్డును బద్ధలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు రూ.830 కోట్ల రూపాయలను స్పేస్‌ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది. అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం దీనిని తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment