ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారి ఉత్కంఠకు తెరదించుతూ బల్దియా ఎన్నికల నగారా మోగింది.. అతితక్కువ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఈవీఎంలు లేవు.. ఈ ఓటింగ్ కూడా లేదు. బ్యాలెట్‌తోనే ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. వార్డుల డీలిమిటేషన్ లేకపోవడం, గతంలో ఉన్న రిజర్వేషన్లనే ఈసారీ వర్తింపజేయడంతో మహిళలకు 75 సీట్లు లభిస్తున్నాయి. గత పాలక మండలిలోనూ జనరల్ స్థానాల్లో గెలిచి మొత్తం 79 మంది మహిళలు పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎస్టీలకు 2, ఎస్సీలకు 10, బీసీలకు 50, మహిళలకు(జనరల్) 44 సీట్లు ఉన్నాయి. ఇవిపోనూ మిగిలిన 44 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మొత్తం సీట్లలో సగం మహిళలకున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో టెన్షన్..
బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఒక వైపు అధికార పార్టీ సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులపై ఇంత వరకూ కసరత్తే మొదలు కాలేదు. వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్‌ల పరిధిలో అభ్యర్థుల కోసం పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ డివిజన్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. పేరుకు మాత్రం ఒక్కో డివిజన్ నుంచి 10 మంది వరకు టికెట్ ఆశిస్తున్నా.. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చదవండి: ‘బందోబస్తు’ సెల్ రెడీ!
కాదేదీ.. గుర్తుకు అనర్హం..
సాక్షి, సిటీబ్యూరో: ట్రెండ్ మారింది.. దానికి తగ్గట్లుగానే గుర్తులను కేటాయిస్తోంది ఎన్నికల సంఘం.. ప్రస్తుతం బాగా పాపులర్‌గా ఉన్న హెడ్‌ఫోన్, పెన్‌డ్రైవ్, రోబో తదితర 50 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీచేసే వారు వీటిల్లో తమకు నచ్చిన గుర్తును ఎంచుకోవచ్చు. వీటిలో ఎయిర్‌కండిషనర్, యాపిల్, గాజులు, బ్యాట్, విజిల్, టైర్లు, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్, సీసా, బకెట్, క్యారమ్‌బోర్డు, చెయిన్, కోటు, కొబ్బరితోట, మంచం, కప్పు–సాసర్, కటింగ్‌ప్లేయర్, ఎలక్ట్రిక్‌పోల్, ఎన్వలప్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గాజుగ్లాసు, ద్రాక్షపండ్లు, హెడ్‌ఫోన్, హాకీకర్ర–బంతి, బెండకాయలు, లెటర్‌బాక్స్, మూకుడు, ప్యాంటు, పెన్‌డ్రైవ్, పైనాపిల్, కుండ, ప్రెషర్‌కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రోబో, రంపం, కత్తెర, షటిల్‌కాక్, సితార్, సాక్స్, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, టేబుల్, టూత్‌బ్రష్, ట్రంపెట్. చదవండి: ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్ దూకుడు!
2009 ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు 8, ఎస్సీ మహిళలకు 4 వెరసీ ఎస్సీలకు మొత్తం 12 దక్కాయి. బీసీ జనరల్‌లో 33 సీట్లు ఉండగా, 2016లో అవి 25కు తగ్గాయి. బీసీ మహిళలకు మాత్రం 17 నుంచి 25కు పెరిగాయి. మహిళల జనరల్ స్థానాలు 28 నుంచి 44కు పెరిగాయి. 2009లో స్థూలంగా జనరల్‌లో 100, మహిళలకు 50 సీట్లు వెరసీ మొత్తం 150 కాగా, 2016లో రెండు విభాగాల్లో చెరో 75కు మారాయి. తిరిగి ఈసారి ఇదే పునరావృతం అవుతోంది.
ఓపెన్ కేటగిరీ(రిజర్వు కానివి)..
(5)మల్లాపూర్, 12)మన్సూరాబాద్, (13)హయత్‌నగర్, (14)బీఎన్‌రెడ్డి నగర్, (15)వనస్థలిపురం, (17)చంపాపేట, (18)లింగోజిగూడ, (21)కొత్తపేట, (22)చైతన్యపురి, (23)గడ్డిఅన్నారం, (27)అక్బర్‌బాగ్, (30)డబీర్‌పురా, (31)రెయిన్‌బజార్, (32)పత్తర్‌గట్టి, (36)లలితాబాగ్, (40)రియాసత్‌నగర్, (44)ఉప్పుగూడ, (45)జంగమ్మెట్, (50)బేగంబజార్, (59)మైలార్‌దేవ్‌పల్లి, (77)జాంబాగ్, (87)రామ్‌నగర్, (93)బంజారాహిల్స్, (94)షేక్‌పేట్, (95)జూబ్లీహిల్స్, (96)యూసుఫ్‌గూడ, (99)వెంగళ్‌రావునగర్, (102)రహ్మత్‌నగర్, (104)కొండాపూర్, (105)గచ్చిబౌలి, (106)శేరిలింగంపల్లి, (107)మాదాపూర్, (108)మియాపూర్, (114)కేపీహెచ్‌బీ కాలనీ, (117)మూసాపేట్, (118)ఫతేనగర్, (119)ఓల్డ్‌బోయిన్‌పల్లి, (120)బాలానగర్, (121)కూకట్‌పల్లి, (123)హైదర్‌నగర్, (124)ఆల్విన్‌కాలనీ, (129)సూరారం, (139)ఈస్ట్‌ఆనంద్‌బాగ్, (140)మల్కాజిగిరి.
వార్డు నెంబర్ల వారీగా జనరల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ వార్డులు
ఎస్టీ జనరల్: (46)ఫలక్‌నుమా
ఎస్సీ జనరల్: (1)కాప్రా, (4)మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, (62)జియాగూడ, (133)మచ్చబొల్లారం, (135)వెంకటాపురం బీసీ జనరల్: (3)చర్లపల్లి, (29)చావని, (39)సంతోష్‌నగర్, (43)చాంద్రాయణగుట్ట, (48)శాలిబండ, (51)గోషామహల్, (52)పురానాపూల్, (53)దూద్‌బౌలి, (54)జహనుమా, (55)రామ్‌నాస్‌పురా, (56)కిషన్‌బాగ్, (58)శాస్త్రిపురం, (64)దత్తాత్రేయనగర్, (65)కార్వాన్, (69)నానల్‌నగర్, (70)మెహదీపట్నం, (71)గుడిమల్కాపూర్, (83)అంబర్‌పేట,(88)భోలక్‌పూర్, (103)బోరబండ, (112)రామచంద్రాపురం, (113)పటాన్‌చెరువు, (125)గాజులరామారం,(126)జగద్గిరిగుట్ట, (127)రంగారెడ్డినగర్
మహిళల రిజర్వేషన్ వార్డులు..
వార్డు నంబర్ల వారీగా.. ఎస్టీ మహిళ: (16) హస్తినాపురం
ఎస్సీ మహిళ: (60)రాజేంద్రనగర్, (90) కవాడిగూడ, (142)అడ్డగుట్ట, (144) మెట్టుగూడ, (147)బన్సీలాల్‌పేట.
బీసీ మహిళ: (9)రామంతాపూర్, (26) ఓల్డ్ మలక్‌పేట్, (34)తలాబ్‌చంచలం, (35)గౌలిపురా, (37)కుర్మగూడ, (41) కంచన్‌బాగ్, (42)బార్కాస్, (47)నవాబ్‌సాహెబ్‌కుంట, (49)ఘాన్సీబజార్, (57)సులేమాన్‌నగర్, (61)అత్తాపూర్, (63)మంగళ్‌హాట్, (67)గోల్కొండ, (68)టోలిచౌకి, (72)ఆసిఫ్‌నగర్, (73)విజయనగర్‌కాలనీ, (74)అహ్మద్‌నగర్, (75)రెడ్‌హిల్స్, (76)మల్లేపల్లి, (82)గోల్నాక, (86)ముషీరాబాద్, (101)ఎర్రగడ్డ, (128)చింతల్, (146)బౌద్ధనగర్, (148)రాంగోపాల్‌పేట్.
మహిళ జనరల్.. (2)డాక్టర్ ఏఎస్‌రావునగర్, (6)నాచారం, (7)చిలుకానగర్, (8)హబ్సిగూడ, (10)ఉప్పల్, (11)నాగోల్, (19)సరూర్‌నగర్, (20)ఆర్‌కేపురం, (24)సైదాబాద్, (25)మూసారాంబాగ్, (28)ఆజంపురా, (33)మొఘల్‌పురా, (38)ఐఎస్ సదన్, (66)లంగర్‌హౌస్, (78)గన్‌ఫౌండ్రి, (79)హిమాయత్‌నగర్, (80)కాచిగూడ, (81)నల్లకుంట,(84)బాగ్‌అంబర్‌పేట, (85)అడిక్‌మెట్, (89)గాంధీనగర్, (91)ఖైరతాబాద్, (92)వెంకటేశ్వరకాలనీ, (97)సోమాజిగూడ, (98)అమీర్‌పేట్, (100)సనత్‌నగర్, (109)హఫీజ్‌పేట్, (110)చందానగర్, (111)భారతీనగర్, (115)బాలాజీనగర్, (116)అల్లాపూర్, (122) వివేకానందనగర్ కాలనీ, (130)సుభాష్‌నగర్, (131)కుత్బుల్లాపూర్, (132)జీడిమెట్ల, (134)అల్వాల్, (136)నేరేడ్‌మెట్, (137)వినాయకనగర్, (138)మౌలాలి, (141)గౌతంనగర్, (143)తార్నాక, (145)సీతాఫల్‌మండి, (149)బేగంపేట్, (150) మోండామార్కెట్.
గడువులోపే ఎన్నికలు..
బల్దియాలో పాలకమండలి గడువు పూర్తికాకముందే ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. గతంలో పాలకమండలి గడువు ముగిశాక, ఎన్నోఏళ్ల తర్వాత మాత్రమే తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆమధ్య కాలంలో స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 1970 నుంచి 1986 వరకు, అనంతరం 1991 నుంచి 2002 వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ పాలనే సాగింది. 2007లో పాలకమండలి గడువు ముగిశాక, అదే సంవత్సరం జీహెచ్‌ఎంసీగా అవతరించాక సైతం స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 2009 ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది. 2014లో పాలకమండలి గడువు ముగిశాక కూడా తిరిగి 2016 ఎన్నికలు జరిగేంత వరకు కూడా స్పెషలాఫీసర్ పాలనే నడిచింది. ఈసారి మాత్రం పాలకమండలి గడువుకు దాదాపు రెండున్నరనెలల ముందుగా ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment