టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. దీంతో అంతా కోహ్లి మాయాలో పడిపోయారు. కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు... పాక్‌పై మరోసారి విజయం సాధించిదంటూ గెలుపు సంబరాలు వగైరా లాంటి వాటిలో మునిగిపోయారు టీమిండియా అభిమానులు.
అయితే ఇదే మ్యాచ్‌లో టీమిండియా వికెట్ పడిన ప్రతీసారి పాక్ ఆటగాళ్లు పలుమార్లు తమ చేతితో గుర్తులు పెడుతూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది కాబట్టి ఈ ఫోటోలు అంతగా పాపులర్ కాలేకపోయాయి. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మాత్రం పాక్ ఆటగాళ్లు చేతితో చేసిన గుర్తులపై పెద్ద చర్చ జరిగి ఉండేది. అయితే మ్యాచ్ ముగిసిన రెండు రోజులకు పాక్ ఆటగాళ్ల చేతి గుర్తుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వాస్తవానికి ఒక మ్యాచ్‌లో ఏ బౌలర్ అయినా వికెట్ తీస్తే తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పాక్ బౌలర్లు వికెట్ తీసిన ప్రతీసారి ఒకే రకమైన సెలబ్రేషన్ చెయ్యడం ఆసక్తికరంగా మార్చింది. ఇంతకీ పాక్ ఆటగాళ్లు తమ చేతితో చూపెట్టిన గుర్తులకు అర్థం ఏమిటి.. అలా ఎందుకు చేశారనేది తెలుసుకుందాం.
పాక్ బౌలర్లు పెట్టిన గుర్తులకు అర్థమేమిటంటే..
►సాధారణంగా మనం దేన్నైనా గురి చూసి కొట్టడానికి రాయిని ఉపయోగిస్తాం. అలాగే పాక్ బౌలర్లందరూ కూడా వికెట్ టు వికెట్ బంతులు వెయ్యాలి, ఫీల్డర్లు కూడా డైరెక్ట్ గా వికెట్లకే బాల్ విసరాలి అన్న ప్లాన్ తో మైదానంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అందుకే వికెట్ పడ్డ ప్రతీసారి తమ ప్లాన్ ప్రకారంమే ఆ గుర్తును పైకి చూపారని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
►సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్న జట్టు పాకిస్థాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. షాహీన్ షా అఫ్రీది, హారీస్ రౌఫ్ లాంటి బౌలర్లు మెరుపు వేగంతో బంతులు విసరడంలో సిద్దహస్తులు. అలాంటి బంతులు విసరాలి అనే వ్యూహంతోనే బరిలోకి దిగినట్లు అర్దం అవుతోంది. వారు అనుకున్నట్లే మెుదట్లో మెరుపు బంతులతో టాపార్డర్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. దాంతో వారి వ్యూహం ఫలిస్తోంది అనే సంకేతాన్ని ఈ గుర్తు ద్వారా తెలియజేశారు.
►హాలీవుడ్ స్టార్ ‘ది రాక్’ ప్రధాన పాత్రలో.. డీసీ కామిక్స్ నుంచి వచ్చిన భారీ చిత్రం ‘బ్లాక్ ఆడం’(Black Adam). పాక్ ప్లేయర్లు పెట్టిన డైమండ్ గుర్తుకు ఈ సినిమాలో అద్భుత శక్తులకు మధ్య సంబంధం ఉంది. అద్భత శక్తులను మెరుపులతో చూపడం మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏదో ఒక అద్భుత శక్తి తమకు సహకరిస్తుంది అన్న నమ్మకంతోనే వారు ఈ విధంగా చేతివేళ్లు పెట్టి ఉంటారు అనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ గుర్తులకు సంబంధించి ఎలాంటి సమాచారన్ని పాక్ ప్లేయర్లు బయటపెట్టలేదు.
Everything is fine but what’s with these signs vro? Whole team be doing it 😭👀 pic.twitter.com/t8o5hAvJg3
— 🕊 (@HeyitsRabea) October 24, 2022
చదవండి: T20 WC 2022: 2011లో ఇలాగే.. నమ్మలేం కానీ నిజమైతే బాగుండు!
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు వర్షం ముప్పు.. ఇదే జరిగితే సఫారీల ఖేల్ ఖతం..!
Comments
Please login to add a commentAdd a comment