T20 World Cup 2022: India-Pakistan Will Face Finals If-2 Teams Win Their Semis Matches - Sakshi
Sakshi News home page

T20 WC 2022: అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌!

Published Sun, Nov 6 2022 5:31 PM | Last Updated on Sun, Nov 6 2022 9:31 PM

T20 WC 2022: IND-PAK Will Face Finals If-2 Teams Win Their Semis Matches - Sakshi

టి20 ప్రపంచకప్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్‌ అనూహ్యంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సంచలన విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టగా.. కచ్చితంగా సెమీస్‌కు వెళుతుందనుకున్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తయ్యి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా గ్రూప్‌-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. 

అయితే టీమిండియా, పాకిస్తాన్‌లు సెమీఫైనల్‌కు వెళ్లడంపై ఇరుదేశాల అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడితే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మాములుగానే ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటేనే ఫుల్‌ జోష్‌ ఉంటుంది. అలాంటిది ఈ రెండు జట్లు ఒక మెగాటోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయంటే ఎంత హైవోల్టేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 తొలి ఎడిషన్‌ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా చాంపియన్‌గా అవతరించింది.

అయితే సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో, పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాయి. దీంతో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను దెబ్బతీయడం టీమిండియాకు సవాల్‌ అయితే.. భీకరమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే పాకిస్తాన్‌ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే న్యూజిలాండ్‌కు నాకౌట్‌ ఫోబియా ఉండడం పాక్‌కు కలిసిరానుంది. అప్పటివరకు దుమ్మురేపే న్యూజిలాండ్‌ నాకౌట్‌ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది.

 ఇప్పటికే 2015, 2019, 2021 ప్రపంచకప్‌ టోర్నీ‍ల్లో వరుసగా ఫైనల్స్‌లోనే ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం రోజురోజుకు బలంగా తయారవుతూ వస్తుంది. ఒకటో నెంబర్‌ నుంచి పదో నెంబర్‌ దాకా బ్యాటింగ్‌ ఆడగల సత్తా ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించాలంటే టీమిండియా తన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఏమో అన్ని కలిసొస్తే టీమిండియా, పాక్‌లు ఫైనల్లో తలపడితే చూడాలని సగటు అభిమాని బలంగానే కోరుకుంటున్నాడు.

చదవండి: థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement