టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికి భారత సంతతికి చెందిన 13 ఏళ్ల జానకి ఈశ్వర్ అనే అమ్మాయి ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ రాక్‌బాండ్ గ్రూఫ్‌తో కలిసి పాట పాడుతూ తన మధుర గానంతో స్టేడియాన్ని హోరెత్తించింది.
ఆస్ట్రేలియన్ రాక్‌బాండ్‌లో ఒకటైన ఐస్ హౌస్ సాంగ్‌ను ట్రూప్ కంపోజ్ చేయగా.. జానకి ఈశ్వర్ ఎటువంటి బెరుకు లేకుండా పాడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జానకి ఈశ్వర్ తల్లిదండ్రులు అనూప్ దివకరణ్, దివ్వా రవీంద్రన్‌లు కేరళకు చెందినవారు.
అయితే 15 ఏళ్ల క్రితమే ఈ దంపతులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన జానకి ఈశ్వర్ ఆస్ట్రేలియన్ రాక్‌బాండ్‌లో తన పాటలతో అదరగొడుతుంది. ఇక వాయిస్ ఆస్ట్రేలియా పేరిట నిర్వహించిన ప్రోగ్రామ్ ద్వారా జానకి ఈశ్వర్ తొలిసారి వెలుగులోకి వచ్చింది.
ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు.
— The sports 360 (@Thesports3601) November 13, 2022
చదవండి: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment