Rock Band
-
ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికి భారత సంతతికి చెందిన 13 ఏళ్ల జానకి ఈశ్వర్ అనే అమ్మాయి ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ రాక్‌బాండ్ గ్రూఫ్తో కలిసి పాట పాడుతూ తన మధుర గానంతో స్టేడియాన్ని హోరెత్తించింది. ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో ఒకటైన ఐస్ హౌస్ సాంగ్‌ను ట్రూప్ కంపోజ్ చేయగా.. జానకి ఈశ్వర్ ఎటువంటి బెరుకు లేకుండా పాడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జానకి ఈశ్వర్ తల్లిదండ్రులు అనూప్ దివకరణ్, దివ్వా రవీంద్రన్‌లు కేరళకు చెందినవారు. అయితే 15 ఏళ్ల క్రితమే ఈ దంపతులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన జానకి ఈశ్వర్ ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో తన పాటలతో అదరగొడుతుంది. ఇక వాయిస్ ఆస్ట్రేలియా పేరిట నిర్వహించిన ప్రోగ్రామ్ ద్వారా జానకి ఈశ్వర్ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/u9pqffBQmp — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా -
మన పాట.. మస్త్
‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట..’ పాటను ఓ అల్ట్రామోడ్రన్ క్లబ్/పార్టీ ప్లేస్‌లో వినడం సాధ్యమా? ‘రావయ్యా ముద్దుల మావా.. నీకు రాసిస్తా రాయలసీమా’ పాటను కాలేజ్ ఈవెంట్స్‌లోనో, కాఫీ హౌస్‌లోనో ఊహించగలమా? ‘ఇదిఅరబిక్ కడలందం, ప్రియా ప్రియా చంపొద్దే’ తదితర పాటలు ఇంకెక్కడైనా వినొచ్చేమో, ఆశించొచ్చేమో... కానీ లాంజ్‌లు, గ్యాలరీల్లో కాదు కదా! ఇలాంటి అంచనాలను తలకిందులు చేస్తూ తెలుగు సినిమా పాటల్ని మోడ్రన్ వేదికలపైవినిపిస్తుందో బ్యాండ్. సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఏ క్లబ్‌కి వెళ్లినా, ఏ కల్చరల్ హబ్‌కి వెళ్లినా, కాఫీషాప్‌కి వెళ్లినా... తెలుగు పాటలు వినిపించడం కష్టమే. ఎవరో పాత తరానికి, తలపండిన పండితులకు తప్ప.. కాలేజీ వేడుకల్లో, పార్టీ ప్లేస్‌లలో, డ్యాన్స్ ఫ్లోర్లలో నవతరానికి మన పాట చాలా దూరంగా ఉందనిపిస్తున్న పరిస్థితుల్లో... ఇప్పుడిప్పుడే నగరంలో తెలుగు రాక్ సౌండ్ వినిపిస్తోంది. సాధారణంగా సిటీలో ఆర్ట్, మ్యూజిక్‌కి పేరొందిన గ్యాలరీ కెఫె లాంటి చోట్ల బ్యాండ్స్ అందించే ఇంగ్లిష్, వెస్ట్రన్ మ్యూజిక్ కోసం జనం ఎదురు చూస్తారు. చురాలియా హై, గులాబీ ఆంఖే తదితర డీజే మిక్స్ చేసిన బాలీవుడ్ పాటలే సందడి చేస్తాయి. అయితే ఇప్పుడు 788 అవెన్యూ, హైలైఫ్, టబ్యుల్లా రాసా లాంటి పార్టీ ప్లేస్‌లలో కూడా తెలుగు సరాగాలు వీనుల విందు చేస్తున్నాయి. ఆధునికులకు నచ్చే రీతిలో మన భాషలో సందడి చేసే మ్యూజిక్ బ్యాండ్స్ సిటీలో కాప్రిసియో, జామర్స్, నిరావల్, థియరీ తదితర ఉన్నాయి. వీటిలో తొలి తెలుగు ఫ్యూజన్ బ్యాండ్‌గా కాప్రిసియో పేరొందింది. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ కొన్ని పాటల్ని కలిపి కుట్టి, వెరైటీగా అందించే మెడ్లీలకు పాపులర్ అయింది. పాటల బాటలో... ఈ బ్యాండ్‌లోని సింగర్ ఏక్నాథ్ కిరణ్ పాడుతా తీయగా, రేడియో సిటీ సూపర్ సింగర్స్, బీట్స్ ఆఫ్ బీటెక్ తదితర కాంటెస్ట్‌ల ద్వారా పేరొందాడు. ఏడేళ్ల వయసులోనే తబలా సాధన ప్రారంభించి 60 నిమిషాల్లో 30 వాయిద్యాలను ప్లే చేసి లిమ్కాబుక్స్లో చోటు దక్కించుకున్న పెర్క్యుషనిస్ట్ సాయితేజ... షార్ట్‌ఫిల్మ్ మ్యూజిక్ కంపోజర్‌గా అవార్డు అందుకున్న పాకలపాటి శ్రవణ్.. హిప్హాప్ మ్యూజిక్ ప్రేమికుడిగా, బేస్ గిటారిస్ట్‌గా పేరొందిన శామ్... వీరందరూ సంగీతంతో పాటు తెలుగుపై ఇష్టంతో చేతులు కలిపారు. పాటల బాటలో బ్యాండ్‌గా ఏర్పడ్డారు. ‘మేమంతా క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందినవాళ్లమే. అందరికీ సంగీతం ఉమ్మడి అభిరుచి. విభిన్న రకాల పాటల మేళవింపుతో ఒక వినసొంపైన సంగీతాన్ని అందించాలనే ఆలోచనతో ఈ బ్యాండ్ ప్రారంభించాం’ అంటూ వీరు గుర్తు చేసుకున్నారు. తెలుగుకే డిమాండ్... ‘మేం కూడా అన్ని బ్యాండ్స్లాగే పాడడంతో ప్రారంభించాం. స్టోన్ వాటర్స్ లాంటి చోట్ల బాలీవుడ్ వినిపించేవాళ్లం. అయితే మధ్యమధ్యలో తెలుగును వినిపించడం మొదలెట్టాం. ఆ సమయంలో అతిథుల నుంచి మరిన్ని తెలుగు పాటల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. దాంతో బాలీవుడ్–టాలీవుడ్ సగం పాడేవాళ్లం. ఇప్పుడు పూర్తి తెలుగు ఫ్యూజన్ బ్యాండ్‌గా పేరొందాం’ అంటూ వివరించిందీ బృందం. ప్రాంతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న మమ్మల్ని... తెలుగుకే పరిమితం కావాలని కోరుతూ మూన్‌షైన్ ప్రాజెక్ట్ పీపుల్ ఇందులో సహకరించారు. ఈ బ్యాండ్స్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో టాలీవుడ్ సింగర్స్ సైతం ఇటువైపు వస్తున్నారు. నేపథ్య గాయకుడిగా దాదాపు 100 పాటలు పాడిన సింగర్ దినకర్ కల్వల ఈ బ్యాండ్‌తో గొంతు కలపనున్నారు. మోత మోగించాలని... విఖ్యాత సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌ల పాటలు వింటూ పెరిగిన వీరు... త్వరలో తమ సొంత ట్రాక్స్‌తో ఆల్బమ్ విడుదల చేయాలనుకుంటున్నామన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పాటల్ని తీసుకెళ్లాలనేది మా ఆలోచన. మోడ్రన్ వేదికలపై మరింతగా తెలుగు మోత మోగించాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. తమ అభిమాన బ్యాండ్ అగమ్ కాగా, తైక్కుండామ్ బ్రిడ్జ్, మసాలా కాఫీ వంటి బ్యాండ్స్ కూడా ఇష్టమేనన్నారు. తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన తామేమీ ఆంగ్ల ట్రాక్స్‌కి వ్యతిరేకం కాదనీ... జాన్ మేయర్, కోల్డ్ ప్లే వంటివారి పాటల్ని బాగా ఇష్టపడతామని, వాటిలోని మంచి ఫ్లేవర్‌ని మన పాటల్లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుంటామని వివరించారు. -
సిటి స్కూళ్లలో రాక్ బ్యాండ్ ట్రెండ్
సిటీలో రాక్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. పాశ్చాత్య సంగీత అభిరుచితో పాటు ఆ వాయిద్యాలను పలికించడంలో నిష్ణాతులైన కొందరు టీమ్‌గా బ్యాండ్స్ ఏర్పాటు చేయడంతో మొదలై తర్వాత కార్పొరేట్ కంపెనీలు, కళాశాలలకు అనుబంధమైన ఈ ట్రెండ్ ఇప్పుడు స్కూళ్లకూ వచ్చేసింది. సిటీలోని ఇంటర్నేషనల్ స్కూల్స్ బాయ్స్ రాక్తో ఉర్రూతలూగిస్తుంటే... దేశంలో ప్రప్రథమ ఆల్ గర్‌్ల్స బ్యాండ్‌తో మరో స్కూల్ కి‘రాక్’ పుట్టిస్తోంది. – ఎస్.సత్యబాబు చి‘రాక్’... నగరంలో రాక్ మ్యూజిక్ అంటే 90 శాతానికి పైగా పురుషులకే సొంతం. ఇక బ్యాండ్స్ ఏర్పాటు విషయానికి వస్తే వాటిలో అమ్మాయిలను వెతకాలంటే భూతద్దం పట్టుకొని మరీ చూడాల్సిందే. అలాంటిది సిటీలో తొలిసారిగా ఆల్ గర్‌్ల్స బ్యాండ్ వెలుగులోకి వచ్చింది. అందులోనూ అందరూ టీనేజ్ అమ్మాయిలే. సిటీలో ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒకటైన ‘చిరెక్’కు చెందిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఈ బ్యాండ్‌కి శ్రీకారం చుట్టింది. ‘చిరెక్ గర్ల్స్ బ్యాండ్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ రాక్ సంగీత బృందంలో ఎం.తరుణి(బేస్ గిటార్), తృప్తి జోషి(గిటార్), ప్రకృతి మహేశ్వరి(గానం), స్మృతి జోషి(డ్రమ్స్), మీరా మారియా పెరియెరా(గిటార్), సంజనా యాదగిరి (గిటార్) ఉన్నారు. వీరంతా అటు చదువులో, ఇటు సంగీతంలోనూ రాణిస్తున్నారని.. వీరి ఉత్సాహం చూసే తాము ఈ బ్యాండ్‌కు రూపకల్పన చేశామని స్కూల్ మ్యూజిక్, డ్యాన్స్ విభాగం హెచ్ఓడీ బి.డేవిడ్ ప్రభాకర్ చెప్పారు. చిరెక్ గర్‌్ల్స బ్యాండ్(సీబీఎస్ఈ) పేరుతో మరో గర్‌్ల్స బ్యాండ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఈ రెండు బృందాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. టీనేజ్ బ్యాండ్స్... సక్సెస్ ట్రెండ్స్ విదేశాల్లో టీనేజ్ బ్యాండ్స్ కొత్త కాదు. అయితే మన దేశంలో ఇటీవల స్కూల్ దశలోనే రాక్ చేరువవుతోంది. గిటార్, కీబోర్డ్... తదితర సంగీత పరికరాలపై టీనేజర్లలో పెరుగుతున్న ఇష్టమే దీనికి కారణం. వీటిని పలికించడంలో కాస్తంత నైపుణ్యం వచ్చాక తొలి దశలోనే వ్యక్తిగతంగా ప్రతిభా ప్రదర్శనకు పూనుకోవడం కంటే... తమ సహ విద్యార్థులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రదర్శనలివ్వడం మేలని డేవిడ్ ప్రభాకర్ చెబుతున్నారు. మరికొందరితో కలిసి రాక్ ప్రదర్శనలివ్వడంతో కమ్యూనికేషన్, కో–ఆర్డినేషన్ స్కిల్స్, క్రమశిక్షణ అలవడతాయన్నారు. అందుకే రాక్ బ్యాండ్స్ ట్రెండ్స్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీదే బ్యాండ్ ఏర్పాటు చేయడం వల్ల సముచిత రీతిలో, సామాజిక ప్రయోజనకరమైన సంగీత ప్రదర్శనలకు వీలు కలుగుతుందని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని నగరంలో రాక్ కల్చర్‌కు ఊపునిచ్చిన వారిలో ఒకరైన అంజానీ అన్నారు. మూడు నెలల కృషి... రాక్ మ్యూజిక్ పురుషులకే పరిమితమైన రంగం కాదు. ఈ ఉద్దేశంతోనే మూడు నెలల కృషి అనంతరం ఈ బ్యాండ్ ఏర్పాటు చేశాం. పాశ్చాత్య సంగీత పరికరాలు పలికించడంలో చక్కని నైపుణ్యమున్న అమ్మాయిలను ప్రోత్సహించేందుకు రాక్ బ్యాండ్స్ ఉపయోగపడతాయి. సహ సంగీత కళాకారులు అందరూ అమ్మాయిలే ఉండడంతో వీరు మరింత స్వేచ్ఛగా మ్యూజిక్ ప్లే చేయగలుగుతారు. ఇప్పటికే ‘ప్లేయింగ్ ఫర్ ఛేంజ్’ పేరుతో పలు ప్రదర్శనలిచ్చిన ఈ బృందం ఈ ఏడాది చివర్లో జరిగే భారీ ఫండ్ రైజింగ్ ఈవెంట్లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. – డేవిడ్ ప్రభాకర్, పాశ్చాత్య సంగీత శిక్షకులు -
రాక్‌బ్యాండ్
సాఫ్ట్వేర్ నిపుణులు సల్సాకు సలాం చేశారు. యాప్స్ ట్రెండ్ సెట్ చేసే టెకీలు... రాక్‌బ్యాండ్ బజాయించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ఫ్యాక్ట్‌సెట్ యాన్యువల్ డే ఐటీ ఉద్యోగుల మల్టీ టాలెంట్‌కి ఐడెంటిటీగా నిలిచింది. ఈ డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్... సాంగ్స్, డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్... ఇలా విభిన్న రకాల ‘షో’లకు వేదికైంది. హుదూద్ తుఫాను బాధితులకు చేయూత అనే మానవతా కోణాన్ని నేపథ్యంగా తీసుకుని సాగిన ఈ షోలో బాలీవుడ్ సింగర్లు సందీప్ హల్దిపుర్,అంబిలి మీనన్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.