T20 World Cup 2022 India Vs Pakistan Match Live Score Updates And Highlights - Sakshi
Sakshi News home page

T20 WC IND Vs PAK Live Updates: కోహ్లి వీరోచిత పోరాటం.. పాక్‌పై భారత్‌ విజయం

Published Sun, Oct 23 2022 1:01 PM | Last Updated on Tue, Oct 25 2022 6:26 PM

T20 WC 2022: India Vs Pakistan Match Live Updates-Highlights - Sakshi

కోహ్లి వీరోచిత పోరాటం.. పాక్‌పై భారత్‌ విజయం
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు హార్దిక్‌ పాండ్యా(37 బంతుల్లో 40) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో రౌఫ్‌, నవాజ్‌ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

అర్ధసెంచరీతో చెలరేగిన కోహ్లి
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అర్ధసెంచరీతో చెలరేగాడు. 61 పరుగులతో కోహ్లి క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 129/4

16 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 106/4
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత విజయానికి 24 బంతుల్లో 54 పరుగులు కావాలి.

12 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 74/4
12 ఓవర్‌ వేసిన మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఏకంగా 20 పరుగులు రాబట్టారు. 12 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 74/4, క్రీజులో కోహ్లి(22), హార్దిక్‌(26) పరుగులతో ఉన్నారు.

11 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 54/4
11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(15), హార్దిక్‌ పాం‍డ్యా(13) పరుగులతో ఉన్నారు

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
31 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి హార్దిక్‌ వచ్చాడు.

కష్టాల్లో టీమిండియా.. 26 పరుగులకే మూడు వికెట్లు
26 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. హారిస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌ ఔట్‌
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. హారిస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. నాలుగు ఓవర్లు భారత్‌ స్కోర్‌: 14/2

భారత్‌కు బిగ్‌ షాక్‌.. రాహుల్‌ ఔట్‌
160 పరుగుల లక్ష్యంతో బరిలోకిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 4 పరుగులు చేసిన రాహుల్‌.. నసీం షా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

రాణించిన భారత బౌలర్లు.. టార్గెట్‌ 160 పరుగులు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా తలా మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశారు. వీరితో పాటు భువనేశ్వర్‌, షమీ చెరో వికెట్‌ సాధించి పర్వాలేదనిపించారు. ఇక పాక్‌ బ్యాటర్లలో షాన్‌ మసూద్‌(52), ఇఫ్తికర్‌ ఆహ్మద్‌(51) పరుగులతో రాణించారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
120 పరుగులు వద్ద పాకిస్తాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ఆసిఫ్‌ అలీ.. ఆర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌..
115 పరుగులు వద్ద పాకిస్తాన్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన నవాజ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. హార్ధిక్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
పాకిస్తాన్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 2 పరుగులు చేసిన హైదర్‌ అలీ.. హార్ధిక్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు పాకిస్తాన్‌ స్కోర్‌: 98/5

నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌.. షాదాబ్‌ ఔట్‌
షాదాబ్‌ ఖాన్‌ రూపంలో పాకిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన షాదాబ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌...
91 పరుగులు వద్ద పాకిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయంది. 51 పరుగులు చేసిన ఇఫ్తికర్‌ మహ్మద్‌.. షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 

10 ఓవర్లకు పాకిస్తాన్‌ స్కోర్‌: 60/2
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో షాన్‌ మసూద్‌(29), ఇఫ్తికర్‌ మహ్మద్‌(20) పరుగులతో ఉన్నారు. 

రిజ్వాన్‌ (4) ఔట్‌.. అర్ష్‌దీప్‌కు రెండో వికెట్‌
►టీమిండియా బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చెలరేగుతున్నాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మహ్మద్‌ రిజ్వన్‌ను ఔట్‌ చేశాడు. 4వ ఓవర్‌ చివరి బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.

బాబర్‌ ఆజం గోల్డెన్‌ డక్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
►పాకిస్తాన్‌ కెప్టెప్‌ బాబర్‌ ఆజం గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో బాబర్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. క్లియర్‌ ఔట్‌ అని తెలుస్తున్నప్పటికి పాక్‌ అనవసరంగా రివ్యూ కోరింది. రిప్లేలో లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు క్లియర్‌గా కనిపించింది. దీంతో ఒక్క పరుగు వద్ద పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం పాక్‌ 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి ఆరు పరుగులు చేసింది. 

టాస్‌ గెలిచిన టీమిండియా
►టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 గ్రూఫ్‌-2లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఏంచుకుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు మరోసారి భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలని పాకిస్తాన్‌ చూస్తుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడుగురు బ్యాటర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతుంది. ఊహించినట్లుగానే రిషబ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు పాకిస్తాన్‌ కూడా ఫఖర్‌ జమాన్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో షాన్‌ మసూద్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్‌: బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీమ్ షా

ఇరుజట్ల బలాబలాలు గమనిస్తే.. టీమిండియాలో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌లతో టాపార్డర్‌ పటిష్టంగా కనిపిస్తుండగా.. దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌లతో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తుంది. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌, ఇక స్పిన్నర్లలో అశ్విన్‌, చహల్‌లు ఉండగా.. పేస్‌ బౌలింగ్‌ విషయానికి వస్తే షమీ, భువీ, అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌లో బలంగానే కనిపిస్తుంది.

మరోవైపు పాకిస్తాన్‌ కూడా పేపర్‌పై బలంగానే ఉంది. ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజంలకు తోడుగా.. షాన్‌ మసూద్‌, ఆసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌లతో పటిష్టంగా కనిపిస్తుంది. పాక్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిదిపై అందరి కళ్లు నెలకొన్నాయి. అఫ్రిదితో పాటు మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షాలు మంచి బౌలింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్నారు.

►టి20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్, పాకిస్తాన్‌ జట్లు ముఖాముఖిగా ఆరుసార్లు తలపడ్డాయి. ఐదుసార్లు భారత్‌ గెలుపొందగా, ఒకసారి పాకిస్తాన్‌ను విజయం వరించింది.

►ఎంసీజీ మైదానంలో ఇప్పటివరకు 15 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్‌ చేసిన జట్లు తొమ్మిదిసార్లు గెలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు నాలుగుసార్లు నెగ్గాయి. మరో మ్యాచ్‌ రద్దయింది. గతంలో ఈ వేదికపై భారత్‌ ఆడిన      రెండు టి20 మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా... పాకిస్తాన్‌ ఆడిన ఒక మ్యాచ్‌లో ఓడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement