సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు(ఉచిత గుర్తులు) విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బీఆర్‌ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్‌ఎస్ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించారు. ఇక, ఎన్నికల్లో ఈ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యారు. ఒక రకంగా బీఆర్‌ఎస్ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment