సాక్షి, ఢిల్లీ: ఎన్నికల సంఘం నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల్ని కొన్ని పార్టీలకు/కొందరికి ఈసీ కేటాయించడంపై మొదటి నుంచి బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని భావిస్తోంది.
అయితే తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. తర్వాత ఎందుకనో వ్యూహం మార్చుకుంది. సుప్రీంను ఆశ్రయించనున్న నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు నుంచి పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తొలగించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంలో వేయబోయే పిటిషన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థించనుంది.
కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎప్పటి నుంచో అభ్యర్థిస్తోంది. కానీ, ఈసీ ఆ అభ్యర్థనపై సరైన రీతిలో స్పందించడం లేదు. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. న్యాయస్థానాల్ని ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment