Car symbol
-
సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్!
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల సంఘం నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల్ని కొన్ని పార్టీలకు/కొందరికి ఈసీ కేటాయించడంపై మొదటి నుంచి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని భావిస్తోంది. అయితే తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. తర్వాత ఎందుకనో వ్యూహం మార్చుకుంది. సుప్రీంను ఆశ్రయించనున్న నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు నుంచి పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తొలగించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంలో వేయబోయే పిటిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థించనుంది. కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో అభ్యర్థిస్తోంది. కానీ, ఈసీ ఆ అభ్యర్థనపై సరైన రీతిలో స్పందించడం లేదు. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. న్యాయస్థానాల్ని ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు అర్థమవుతోంది. -
కారును పోలిన గుర్తులు కేటాయించొద్దు.. ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కారును పోలిన రోడ్డు రోలర్‌లాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. దీనిపైటిషన్పై ఢిల్లీ న్యాయస్థానం నేడు (గురువారం) విచారణ చేపట్టనుంది. కాగా కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతి రోలర్, రోడ్‌రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, దీని వల్ల బీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. అయితే బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చదవండి: ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే -
సీఈసీకి రీడిజైన్ ‘కారు’ గుర్తు: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన ‘కారు’లోగోను సమర్పించింది. టీఆర్ఎస్కు కేటాయించిన ఎన్నికల చిహ్నం ‘కారు’బ్యాలెట్ పేపర్‌పై సరిగా కనిపించడం లేదని గతేడాది డిసెంబర్ 27న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘కారు’గుర్తును రీడిజైన్ చేసి సమర్పించాలని సూచించింది. ఓటర్లకు సులువుగా ‘కారు’గుర్తు కనిపించేలా రీడిజైన్ చేసి సీఈసీకి సమర్పించినట్లు ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చేసిన ఇతర వినతులను పట్టించుకోలేదని తాజాగా సీఈసీకి రాసిన లేఖలో వినోద్ పేర్కొన్నారు. ట్రక్కు, రైతుతో కూడిన ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టె, కెమెరా వంటి ఎన్నికల గుర్తులు టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన ‘కారు’గుర్తును పోలి ఉన్నాయని, అందువల్ల వీటిని ఎవరికీ కేటాయించకుండా ఉండేందుకు వీలుగా తొలగించాలని చేసిన వినతిపై సీఈసీ స్పందించలేదని ప్రస్తావించారు. ‘కారు’ను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడం వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందని వివరిం చారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు విషయాన్ని గమనించాలని కోరారు. ఆ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులకు, అదే పేరుతో ఉన్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తూ ఉద్దేశపూర్వక నష్టకారక చర్యలకు దిగుతోందని వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ప్రయత్నాలు జరిగే పరిస్థితి ఉందని, అందువల్ల ట్రక్కు గుర్తును తొలగించాలని కోరారు. -
దడ పుట్టిస్తున్నారు..
పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారిన స్వతంత్రులు పోటీలో ఈసారి మరింత ఎక్కువ మంది ఓట్లు చీలుతాయేమోనని ఆందోళన గుర్తులతో ఓటర్లకు పరేషన్ స్వతంత్రులతో పరేషాన్ మోపైంది. ఎంత బుజ్జగించినా వారు బరి నుంచి తప్పుకోకపోవడంతో ఓట్లు చీలుతాయేమోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెల కొంది. ప్రధానంగా టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండే బస్సు, ఆటో రిక్షా గుర్తులొచ్చే స్వతంత్రులు తమ ఓట్లకు గండి కొడుతారని మదనపడుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఇది నిజమేనని భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలుపొందిన నేతలకు స్వతంత్రులు చీల్చిన ఓట్లే కలిసొచ్చాయి.ఇప్పుడు కూడా ఆయా సెగ్మెంట్లలో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడం ప్రధాన పార్టీల నేతల్లో దిగులుకు కారణమైంది. 153 మందిలో 53 మంది స్వతంత్రులు జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 153 మంది పోటీ చేస్తుండగా... వీరిలో 53 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా రు. ఇక రెండు ఎంపీ స్థానాల్లో 29 మంది బరిలో నిలవగా 13 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. అత్యధికంగా మహబూబాబాద్ పార్లమెంట్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడం విశేషం. అసెంబ్లీ స్థానాలు జనగామ, నర్సంపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, ములుగు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. గుర్తులతోనే ఇబ్బంది ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రమాదం వాటిల్లుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల స్వతంత్రులకు వేలల్లో ఓట్లు పడడం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారణమవుతోంది. బస్సు, ఆటో రిక్షా వంటి గుర్తులు పోల్చుకోలేని నిరక్షరాస్యులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే వేయాల్సిన ఓట్లను ఈ గుర్తులపై వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రతీసారి స్వతంత్రులను బుజ్జగించి పోటీ నుంచే తప్పించే ప్రయత్నాలు చేస్తున్నా వారిలో కొందరు ససేమిరా అంటున్నారు. ఈసారి కూడా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 53 మంది స్వతంత్రులు పోటీలో ఉండడం.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వివరాలు... నియోజకవర్గం గెలిచినఅభ్యర్థి మెజార్టీ స్వతంత్రులకు వచ్చిన ఓట్లు జనగామ 236 9,210 స్టేషన్ ఘన్పూర్ 11,210 11,234 పాలకుర్తి 2,663 9,782 డోర్నకల్ 4,623 4,140 మహబూబాబాద్ 15,367 10,654 నర్సంపేట 8,623 6,094 పరకాల 12,800 10,315 వరంగల్ పశ్చిమ 6,684 6,397 వరంగల్ తూర్పు 7,255 7,344 వర్ధన్నపేట 6,584 10,487 భూపాలపల్లి 11,972 12,576 ములుగు 18,775 17,876