కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ | Why CJI Opts Out Of Case Related To Poll Body Chief Appointment Full Details Here | Sakshi
Sakshi News home page

కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ

Published Tue, Dec 3 2024 4:12 PM | Last Updated on Tue, Dec 3 2024 5:01 PM

Why CJI Opts Out Of Case Related To Poll Body Chief Appointment Full Details Here

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించిన వివాదాల ప్యానెల్‌ కేసు విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వైదొలిగారు. సీజేఐ ఈ పిటిషన్‌ నుంచి తప్పుకోవడంతో.. ఇది మరో బెంచ్‌కు వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన విచారణ మొదలుకానుంది.

ఈ ప్యానెల్‌లో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం అనేది పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిప్రాయం అని ఆ టైంలో కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని ఆ సమయంలో స్పష్టం చేసింది. కానీ..

కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ఓ నిర్ణయం తీసుకుంది. సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని ప్రధాన మంత్రి ఈ ప్యానెల్‌కు కేటాయించారు. ఈ మేరకు సీఈసీ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాయి. ఈ పిటిషన్‌ను నాడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ బెంచ్‌లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ధర్మాసనం. 

అయితే.. సీఈసీ బిల్లు వివాదాన్ని పట్టించుకోకుండానే.. కేంద్రం ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమించింది. ఇక.. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సీజేఐగా ఉండడంతో ఈ కేసు నుంచి త్ప్పుకోవాల్సి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement