నూడిల్స్, ఐస్‌క్రీమ్స్, టాఫీలు, ఫ్రూట్ బాస్కెట్, వాల్ నట్స్.. పేర్లు చదివితేనే నోరూరిపోతోందా? ఆహా ఏమి రుచి..అని మైమరిచిపోతున్నారా? ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ లంచ్ మెనూ కాదు.. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం ఆహార పదార్థాలను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చింది. స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాష్ట్రాల్లో చిన్న పార్టీలు ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌ని ఎన్నికల్లో గుర్తుగా ఎంచుకోవచ్చు. ఆ జాబితాలో ఐస్‌క్రీమ్, పచ్చిబఠాణీలు, నూడిల్స్, టాఫీలు, పైనాపిల్, వేరుశెనగ, బ్రెడ్, కేప్సికమ్, పండ్ల బుట్ట, ద్రాక్షలు, పచ్చి మిరపకాయ, బెండకాయలు, బిస్కెట్, వాల్‌నట్స్, పుచ్చకాయలు, థాలి ప్లేట్ ఉన్నాయి.
మహారాష్ట్రలో హైటెక్ గుర్తులు: మహారాష్ట్రలో మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా 198 ఫ్రీ సింబల్స్‌ను జాబితాలో చేర్చింది. ఇవన్నీ డిజిటల్ గుర్తులే. వీటిలో ల్యాప్‌టాప్, సీసీ టీవీ కెమెరా, పెన్ డ్రైవ్, హెడ్‌ఫోన్స్, కంప్యూటర్ మౌస్ వంటివి ఉన్నాయి. అన్ని తరాల వారిని ఆకర్షించేలా ఈ గుర్తుల్ని ఎంపిక చేశామని మహారాష్ట్రకు చెందిన ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇక వంటగదిలో వాడే వస్తువులు కూడా ఈ ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్, స్టౌ, ప్రెజర్ కుక్కర్, ఫ్రైయింగ్ ఫ్యాన్ వంటి గుర్తులు మహిళల్ని ఆకర్షించేలా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment