సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గుర్తుల విషయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఎన్నికల్లో గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది.
కాగా, తాజాగా ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్ అయ్యింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని సీఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని గుర్తించినట్టు సీఈసీ పేర్కొంది. ఇక, మునుగోడులో యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment