దేశంలో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్‌డోజర్ చిహ్నాన్ని తొలగించింది. అయితే దీని వెనుక గల నిర్దిష్ట కారణాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ ఒక ప్రత్యేక వర్గానికి గుర్తింపుగా మారిందనే భావన అందరిలో ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే దానిని తొలగించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాస్మోటిక్స్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా పలు వస్తువులను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు.
ఈ జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇందులో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్‌లు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ముత్యాల హారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవాటిని జోడించారు. ఎన్నికల చిహ్నాల జాబితాలో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఆపిల్, ఫ్రూట్ బాస్కెట్, బిస్కెట్లు, బ్రెడ్, కేక్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఐస్‌క్రీం, జాక్‌ఫ్రూట్, లేడీఫింగర్, నూడుల్స్, వేరుశెనగ, బఠానీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో వాల్‌నట్, పుచ్చకాయను కూడా చేర్చారు.
అలాగే బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్‌లు కూడా ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. కొన్ని ఎన్నికల చిహ్నాలు వాడుకలో లేకుండా పోయాయి. వీటిలో హ్యాండ్ మిల్లు, డోలీ, టైప్‌రైటర్, మంచం, బావి, టార్చ్, స్లేట్, టెలిఫోన్, రోకలి, బ్లాక్ బోర్డు, చిమ్నీ, పెన్ నిబ్, గ్రామోఫోన్, లెటర్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి.
ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఆధునిక పరికరాల జాబితాలో ఎయిర్ కండీషనర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, కాలిక్యులేటర్, సీసీ కెమెరా, డ్రిల్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, పెన్ డ్రైవ్, బ్రెడ్ టోస్టర్, రిమోట్, స్పానర్, స్టెప్లర్, స్టెతస్కోప్, ఎక్స్‌టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్‌ఫోన్‌లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ మొదలైనవి ఉన్నాయి.
వీటికి తోడు ఎన్నికల చిహ్నాలలో అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్‌కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైనవి కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment