స్క్రీన్‌ టెస్ట్‌ | Heroine vedhika with Kalyanram in a duet called 'Diwali Diwali ...' in 'Vijaya Dashami' | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Oct 17 2017 2:40 AM | Last Updated on Tue, Oct 17 2017 2:40 AM

Heroine vedhika with Kalyanram in a duet called 'Diwali Diwali ...' in 'Vijaya Dashami'

► సముద్ర దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ నటించిన ‘విజయ దశమి’లో ‘దీపావళి దీపావళి...’ అనే డ్యూయెట్‌లో కల్యాణ్‌రామ్‌తో ఆడి పాడిన హీరోయిన్‌ గుర్తుందా?
ఎ) హన్సిక  బి) వేదిక  సి) కాజల్‌ అగర్వాల్‌  డి) ప్రియమణి

► ‘సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు..’ అంటూ విజయశాంతితో స్టెప్పులేసిన హీరో ఎవరో చెప్పుకోండి?
ఎ) చిరంజీవి   బి) బాలకృష్ణ  సి) వెంకటేశ్‌    డి) నాగార్జున

► ‘అలుక మానవా...’ అని నరకాసురుని స్తుతిస్తూ ‘దీపావళి’ సినిమాలో నారద పాత్ర పాట పాడుతుంది. ఆ నారద పాత్ర పోషించిన నటుడెవరు?
ఎ) పద్మనాభం బి) హరనాథ్‌    సి) కాంతారావు      డి) రాజనాల

► ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి’ అనే పాటలో ఆడి పాడిన నటుడెవరు?
ఎ) శోభన్‌బాబు    బి) కృష్ణ      సి) అక్కినేని నాగేశ్వరరావు      డి) శ్రీధర్‌

► 2007లో వచ్చిన  ‘దీపావళి’ అనే సినిమాలో సటించిన హీరో ఎవరు?
ఎ) సురేశ్‌        బి) వరుణ్‌ సందేశ్‌  సి) సాయిరామ్‌ శంకర్‌          డి) వేణు తొట్టెంపూడి

► ‘స్వప్న ప్రియ స్వప్న’ అని సాగే దీపావళి పాటలో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా దర్శకుడెవరు?
ఎ) ముత్యాల సుబ్బయ్య      బి) కె. రాఘవేంద్రరావుసి) ఎ. కోదండ రామిరెడ్డి   డి) బి. గోపాల్‌

► 1960లో వచ్చిన ‘దీపావళి’ సినిమాలో నరకాసురుని పాత్రను పోషించిన నటుడెవరు?
ఎ) యస్వీ రంగారావు      బి) కైకాల సత్యనారాయణ  సి) సీయస్‌ఆర్‌        డి) ధూళిపాళ

► ‘నా నవ్వే దీపావళి నా పలుకే దీపాంజలి..’  అంటూ ‘నాయకుడు’ సినిమాలోని ఈ పాటలో ఏ హీరో కనిపిస్తారు?
ఎ) రజనీకాంత్‌    బి) కమల్‌హాసన్‌     సి) అరవింద్‌స్వామి       డి) మమ్ముట్టి

► దీపావళి అంటే సత్యభామ గుర్తొస్తుంది... ఈ పేరుతో కమల్‌హాసన్‌ చేసిన సినిమా ఏంటి?
ఎ) సత్యభామ       బి) భామనే సత్యభామనే        సి) శ్రీకృష్ణ సత్         యడి) సత్యభామనే

► భానుమతితో కలిసి సుహాసిని నటించిన ఓ సినిమాలో ‘ఇన్నాళ్లకొచ్చింది దీపావళి..’ అనే పాట ఉంది. ఆ సినిమా పేరేంటి?
ఎ) ముద్దుల కూతురు        బి) ముద్దుల మనవరాలు        సి) ముద్దుల కోడలు        డి) ముద్దుల పాప

► దీపావళి అంటే వెలుతురు పండగ. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) సి. నారాయణ రెడ్         డిబి) దాశరథి  సి) వేటూరి         డి) సిరివెన్నెల

► ‘ఇంటింటా దీపావళి ’అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారో తెలుసా?
ఎ) మురళీమోహన్‌       బి) మోహన్‌  సి) చంద్రమోహన్‌     డి) మోహన్‌బాబు

► వెలుగుతున్న చిచ్చుబుడ్డి పక్కనే ఎగురుతున్న హీరోయిన్‌... కాళ్ల పట్టీల నుండి హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ మొదలవుతుంది. ఆ బ్యూటీ ఎవరు?
ఎ) అమీషాపటేల్‌ బి) కీర్తిరెడ్     డిసి) రేణూ దేశాయ్‌    డి) భూమిక

► బ్రహ్మానందం సిగరెట్‌ అనుకుని నోట్లో సీమ టపాకాయ్‌ ముట్టించుకునే సినిమా పేరేంటి?
ఎ) క్షేమంగా వెళ్లి లాభంగా రండి          బి) సందడే సందడి        సి) తిరుమల తిరుపతి వెంకటేశ           డి) అందరూ దొంగలే

► ‘అల్లరి’ నరేశ్‌ తన సినిమా పేరును దీపావళి టపాసుతో పెట్టుకున్నారు? ఆ సినిమా పేరేంటి?
ఎ) సీమ బాంబ్‌      బి) సీమ టపాకాయ్‌          సి) సీమ చక్రం         డి) సీమ శాస్త్రి

► ఈ సినిమాలో మంచు లక్ష్మి లాయర్‌. బాంబ్‌లాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఎ) ఆటమ్‌ బాంబ్‌        బి) హైడ్రొజన్‌ చక్రం   సి) లక్ష్మీరాకెట్‌  డి) లక్ష్మీబాంబ్‌

► ‘ఇక్కడ నా చిచ్చుబుడ్డి మర్చిపోయాను ఎవరన్నా చూశారా..’ అనే డైలాగ్‌ని ఏ సినిమాలో జగపతిబాబు చెప్పారో గుర్తొచ్చిందా?
ఎ) ఫ్యామిలీ  బి) అందగాడు  సి) ఫ్యామిలీ సర్కస్‌  డి) సర్కస్‌ ఫ్యామిలీ

► ‘దీపావళి అంటే ఫెస్టివల్‌ ఆఫ్‌ లైట్స్‌.. నాట్‌ ఏ ఫెస్టివల్‌ ఆఫ్‌ సౌండ్‌ అండ్‌ పొల్యూషన్‌..’  అని ఏ హీరోయిన్‌ని ఉద్దేశించి ‘జనతాగ్యారేజ్‌’ సినిమాలో యన్టీఆర్‌ అన్నారు?
ఎ) నిత్యామీనన్‌        బి) సమంత సి) త్రిష          డి) కాజల్‌ అగర్వాల్‌

► ‘గోపాల గోపాల అలకేలరా... దీపాల వేళాయెఅగుపించరా’ అనే పాటఏ సినిమాలోనిది?
ఎ) అత్తారింటికి దారేది  బి) ఖలేజా  సి) జులాయి         డి) అ ఆ

► ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అనే పాటలో నటించిన దర్శకుడెవరు?
ఎ) కోడి రామకృష్ణ  బి) ఎ. కోదండరామిరెడ్డి    సి) కె. విశ్వనాథ్‌               డి) దాసరి నారాయణరావు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...  మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి  2) ఎ  3) సి  4) సి5) డి  6) బి  7) ఎ  8) బి  9) బి 10) బి  11) ఎ  12) సి  13) బి 14) ఎ  15) బి  16) డి17) సి  18) ఎ  19) డి20) డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement