ScreenTest
-
స్క్రీన్ టెస్ట్
► నాగార్జున నటించిన ‘రాజన్న’ సినిమా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) హరీష్ శంకర్ ► మహేశ్‌బాబు పలు సందర్భాల్లో ‘నాకు లైఫ్ మొత్తం ఒకే ఒక్కరంటే చాలా భయం’ అని చెప్పారు. ఆయన ఎవరికి భయపడుతుంటారు? ఎ) రమేశ్ బాబు (అన్న) బి) కృష్ణ (తండ్రి) సి) మంజుల (అక్క) డి) గల్లా జయదేÐŒ (బావ) ► ఐఐయంలో గ్రాడ్యుయేట్ చేసిన నటుడిగా నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన మరో నటుడు ఎవరో తెలుసా? ఎ) అవసరాల శ్రీనివాస్ బి) తనీష్ సి) విజయ్ దేవరకొండ డి) నిఖిల్ ► రజనీకాంత్ నటించిన ఓ సినిమాకి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకం విడుదలైంది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) బాషా బి) అరుణాచలం సి) నరసింహా డి) బాబా ► గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తెలుగు హాస్యనటుడు ఎవరు? ఎ) బ్రహ్మానందం బి) అలీ సి) కోటా శ్రీనివాసరావు డి) పద్మనాభం ► హాలీవుడ్ సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’లో హీరో తల్లి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు. ఆమె తెలుగు, తమిళ్, హిందీలోనూ ఫేమస్ హీరోయిన్. ఎవరామె? ఎ) కంగనా రనౌత్ బి) టబు సి) మాధురీ దీక్షిత్ డి) మనీషా కోయిరాల ► అంతం, గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) సాక్షి శివానంద్ సి) సోనాలి బింద్రే డి) జియా ఖాన్ ► డి.వి.వి. ప్రొడక్షన్స్‌లో మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్గా కియరా అద్వాని నటించారు. అదే బ్యానర్లో ఆమె మరోసారి నటిస్తున్నారు. ఈ సారి హీరో మారారు. ఎవరా హీరో? ఎ) ఎన్టీఆర్ బి) రామ్ చరణ్ సి) ప్రభాస్ డి) అల్లు అర్జున్ ► ఈ నలుగురిలో మలయాళ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? (చిన్న క్లూ: తెలుగు ‘ప్రేమమ్’లో ఆమె నటించారు) ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) షాలినీ పాండే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 25 సినిమాలకు పనిచేసిన పాటల రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) భాస్కరభట్ల రవికుమార్ సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి ► ‘తేనె మనసులు’ సినిమాలో నటించిన బాలనటి తర్వాతి కాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది. ఎవరో గుర్తు తెచ్చుకోండి ఓ సారి? ఎ) సుహాసిని బి) శ్రీదేవి సి) జయసుధ డి) జయప్రద ► నటి రాశీఖన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) దిస్ ఈజ్ రాశీ బి) మై నేమ్ ఈజ్ రాశీ సి) రాశీఖన్నా డి) యువర్స్ రాశీఖన్నా ► ‘ఏస్కో నా గుమా గుమా చాయ్ ’ అనే పాట నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ చిత్రంలోనిది. ఆ స్పెషల్ సాంగ్‌లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) చార్మీ కౌర్ డి) త్రిష ► ‘ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే.. ప్రేమను వదులుకోవటం కాదు..’ అనే ౖyð లాగ్ శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ లోనిది. ఆ సినిమా మాటల రచయితెవరు? ఎ) పరుచూరి బ్రదర్స్ బి) సతీశ్ వేగేశ్న సి) అబ్బూరి రవి డి) బెజవాడ ప్రసన్న ► నాగార్జునతో రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు చేస్తున్న ఆఫీసర్ సినిమా వారిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమా? ఎ) మూడో సినిమా బి) నాలుగో సినిమా సి) ఐదో సినిమా డి) ఏడో సినిమా ► ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ‘కల్యాణి ప్రియదర్శన్’ ఏ నటి కుమార్తె? ఎ) అంబికా బి) రాధ సి) లిజి డి) వాణీ విశ్వనాథ్ ► 2017వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాలో ప్రతి నాయకుని పాత్రలో నటించిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) జగపతిబాబు బి) శ్రీకాంత్ సి) జె.డి.చక్రవర్తి డి) రాజేంద్రప్రసాద్ ► సమంతలో మంచి నటి ఉందని గుర్తించి. హీరోయిన్గా స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) విక్రమ్.కె. కుమార్ బి) గౌతమ్ మీనన్ సి) వంశీ పైడిపల్లి డి) దేవా కట్టా ► యస్వీ రంగారావు, ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) నర్తనశాల బి) భూకైలాస్ సి) దీపావళి డి) ఇంద్రజిత్ ► ఈ ఫొటోలోని చిన్నారి ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్. ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) భానుప్రియ బి) శోభనసి) జయప్రద డి) మీనా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) సి 14) బి 15) బి 16) సి 17) బి18) బి19) డి20) బి నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్గా నటించిన నటి ఎవరు? ఎ) అమలా అక్కినేని బి) గౌతమి సి) సుహాసిని డి) శోభన ► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో? ఎవరా హీరో? ఎ) నాని బి) విజయ్‌కృష్ణ సి) నరేశ్ డి) విజయ్ దేవరకొండ ► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్ సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు ► ‘ప్రేమనగర్’ అనే చిత్రం ద్వారా తన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే) ఎ) బోయిన సుబ్బారావు బి) కె. విశ్వనాథ్ సి) కె.యస్. ప్రకాశరావు డి) వి.మధుసూదన్‌రావు ► ‘విన్నర్’ సినిమాకి యాంకర్ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్ నటించారు. ఎవరా యాంకర్? ఎ) రేష్మి గౌతమ్ బి) అనసూయ సి) ఝాన్సీ డి) శిల్పా చక్రవర్తి ► ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) రిచా గంగోపాధ్యాయ సి) హంసా నందిని డి) ముమైత్‌ఖాన్ ► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) రమ్యకృష్ణ బి) మీనా సి) నయనతార డి) టబు ► హీరో నాని ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి? ఎ) 3 బి) 2 సి) 4 డి) 1 ► యోగా గురువు ‘భరత్ ఠాగుర్’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ పేరేంటో చెప్పేయండి? ఎ) సంగీత బి) సిమ్రాన్ సి) స్నేహ డి) భూమిక ► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) తెలుగు ► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్ దేవ్గన్తో ‘హిమ్మత్వాలా’లో కూడా నటించింది? ఎ) రాశీ ఖన్నా బి) లావణ్య త్రిపాఠి సి) తమన్నా భాటియా డి) శ్రియ శరన్ ► హీరో నాగచైతన్య ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) ఐయామ్ చే బి) అక్కినేని చైతన్య సి) చే అండర్స్కోర్ అక్కినేని డి) దిస్ ఈజ్ చే ► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా? ఎ) దేవి ప్రసాద్ బి) పరశురామ్ సి) కోన వెంకట్ డి) తరుణ్ భాస్కర్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి? ఎ) సమంత బి) కీర్తీ సురేష్ సి) నిత్యామీనన్ డి) అనుష్క ► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి? ఎ) ఫ్యాషన్ డిజైనర్ బి) ఆర్ట్ డిపార్ట్మెంట్ సి) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డి) ఎడిటింగ్ ► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు? ఎ) వరికుప్పల యాదగిరి బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్ డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి ► ‘లైఫ్‌లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి? ఎ) యుద్ధం శరణం బి) బెజవాడ సి) ఆటోనగర్ సూర్య డి) సాహసం శ్వాసగా సాగిపో ► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్‌కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? ఎ) ఆనంద్ సాయి బి) రవీందర్ రెడ్డి సి) అశోక్ కుమార్ డి) బ్రహ్మ కడలి ► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) నాలుగు స్తంభాలాట బి) రెండు రెళ్ల ఆరు సి) సీతాకోక చిలుక డి) స్వరకల్పన ► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాగశౌర్య డి) ప్రభాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) ఎ 4) సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) ఎ 16) డి 17) డి 18) బి 19) సి 20) ఎ -
స్క్రీన్ టెస్ట్
► ఈ పంజాబి భామ అసలు పేరు ‘సుర్దీప్ కౌర్’, ఆమె స్క్రీన్ పేరేంటి? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తాప్సీ సి) కాజల్ అగర్వాల్ డి) చార్మీ ► యస్వీ రంగారావు నటుడు కాక ముందు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. ఏ డిపార్టుమెంట్లో (శాఖ) ఆయన పనిచేశారు? ఎ) ఆర్మీ బి) తపాల సి) ఫైర్ డి) ఎక్సైజ్ ► పరుచూరి బ్రదర్స్ రచయితగా పనిచేసిన తొలి చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? చిన్న క్లూ... ఆయన నటుడు కూడా? ఎ) నాగభూషణం బి) దేవదాసు.కనకాల సి) కె.బి.తిలక్ డి) నగేశ్ ► నటి స్నేహ నటించిన మొదటి తెలుగు సినిమా హీరో ఎవరు గుర్తు తెచ్చుకోండి? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రవితేజ డి) గోపిచంద్ ► ‘ప్రతిఘటన’ సినిమాకు దర్శకుడు టి.కృష్ణ మొదటగా అనుకొన్న హీరోయిన్ విజయశాంతి కాదు. అయితే మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎ) రాధిక బి) సుహాసిని సి) రాధ డి) శారద ► నటుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా చేయకముందు, క్రాంతికుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమా పేరేంటి? ఎ) రుద్రవీణ బి) శివుడు శివుడు శివుడు సి) విజేత డి) ఖైదీ ► మహేశ్ బాబు బాలనటుడిగా తన తండ్రి కృష్ణతో కలిసి ఎన్ని సినిమాలలో నటించాడో తెలుసా? ఎ) 3 బి) 4 సి) 2 డి) 5 ► కరుణాకరన్ దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో కనుక్కోండి? ఎ) మణిశర్మ బి) ఏ.ఆర్.రహమా సి) దేవాడి) దేవి శ్రీ ప్రసాద్ ► ఎన్టీఆర్ నటించిన ‘పాండవ వనవాసం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఎ) బి.యన్.రెడ్డి బి) ప్రత్యగాత్మ సి) కమలాకర కామేశ్వరరావు డి) కె.వి.రెడ్డి ► ఏ పాటనైనా తీయటానికి ముందు ఆ పాటను కనీసం వందసార్లు వింటానని చెప్పే దర్శకుడెవరు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ ► ‘శంకరాభరణం’ చిత్ర మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) జంధ్యాల బి) సిరివెన్నెల సి) యం.వి.యస్. హరనా«థ రావు డి) కృష్ణశాస్త్రి ► ‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్’ పాట రచయిత? ఎ) భాస్కరభట్ల బి) రామజోగయ్య శాస్త్రి సి) సాహితి డి) అనంత శ్రీరామ్ ► నటి త్రిష ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) త్రిష బి) త్రిషట్రాషెర్స్ సి) మీ త్రిష డి) నేమ్ ఈస్ త్రిష ► నటుడు నాగచైతన్య నటించిన ఒక సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ చిన్న పాత్రలో నటించారు. అది ఏ సినిమా కోసమో తెలుసా? ఎ) సాహసం శ్వాసగా సాగిపో బి) దడ సి) బెజవాడ డి) ఏ మాయ చేసావె ► ఎన్టీఆర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు మళ్లీ డాన్స్ చేసిన తమిళ టాప్ హీరో? ఎ) రజనీకాంత్ బి) కమలహాసన్ సి) శరత్ కుమార్ డి) విజయ్ ► ‘కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం’ – ఈ డైలాగ్ ఏ సినిమా లోనిది? ఎ) తీన్మార్ బి) అత్తారింటికి దారేది సి) గబ్బర్‌సింగ్ డి) జల్సా ► ‘ఆల్ ఐ వాంట్ ఈస్ ఎవ్విరి థింగ్ ’ అనే ఇంగ్లీష్ షార్టు ఫిలిమ్‌ను నిర్మించింది తెలుగు యాంకర్? ఆమె ఎవరు? ఎ) సుమ బి) అనసూయసి) ఝాన్సీ డి) శిల్పా ► చక్రవర్తి ఈ ఫొటోలో ముద్దుగా ఉన్న పాప ఇప్పుడు హీరో యిన్. ఎవరో గుర్తుపట్టగలరా? ఎ) అవికా గోర్ బి) ఉదయభాను సి) భావనడి) అంజలా ఝవేరి ► అభయ్‌రామ్ అనే పేరు ఓ స్టార్ నటుడు కుమారునిది. ఎవరా స్టార్? ఎ) కళ్యాణ్‌రామ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) యన్టీఆర్ ► సావిత్రి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిదో గుర్తు పట్టండి? ఎ) ఆత్మీయులు బి) మనసు మమత సి) అంతరంగాలుడి) చివరకు మిగిలేది మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) బి 4) డి 5) బి 6) బి 7) డి 8) సి 9) సి 10) బి 11) ఎ 12) బి 13) బి 14) డి 15) ఎ 16) ఎ 17) సి 18) ఎ 19) డి 20) డి -
స్క్రీన్ టెస్ట్
► సముద్ర దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నటించిన ‘విజయ దశమి’లో ‘దీపావళి దీపావళి...’ అనే డ్యూయెట్లో కల్యాణ్‌రామ్‌తో ఆడి పాడిన హీరోయిన్ గుర్తుందా? ఎ) హన్సిక బి) వేదిక సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి ► ‘సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు..’ అంటూ విజయశాంతితో స్టెప్పులేసిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) నాగార్జున ► ‘అలుక మానవా...’ అని నరకాసురుని స్తుతిస్తూ ‘దీపావళి’ సినిమాలో నారద పాత్ర పాట పాడుతుంది. ఆ నారద పాత్ర పోషించిన నటుడెవరు? ఎ) పద్మనాభం బి) హరనాథ్ సి) కాంతారావు డి) రాజనాల ► ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి’ అనే పాటలో ఆడి పాడిన నటుడెవరు? ఎ) శోభన్‌బాబు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శ్రీధర్ ► 2007లో వచ్చిన ‘దీపావళి’ అనే సినిమాలో సటించిన హీరో ఎవరు? ఎ) సురేశ్ బి) వరుణ్ సందేశ్ సి) సాయిరామ్ శంకర్ డి) వేణు తొట్టెంపూడి ► ‘స్వప్న ప్రియ స్వప్న’ అని సాగే దీపావళి పాటలో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) కె. రాఘవేంద్రరావుసి) ఎ. కోదండ రామిరెడ్డి డి) బి. గోపాల్ ► 1960లో వచ్చిన ‘దీపావళి’ సినిమాలో నరకాసురుని పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) కైకాల సత్యనారాయణ సి) సీయస్ఆర్ డి) ధూళిపాళ ► ‘నా నవ్వే దీపావళి నా పలుకే దీపాంజలి..’ అంటూ ‘నాయకుడు’ సినిమాలోని ఈ పాటలో ఏ హీరో కనిపిస్తారు? ఎ) రజనీకాంత్ బి) కమల్‌హాసన్ సి) అరవింద్‌స్వామి డి) మమ్ముట్టి ► దీపావళి అంటే సత్యభామ గుర్తొస్తుంది... ఈ పేరుతో కమల్‌హాసన్ చేసిన సినిమా ఏంటి? ఎ) సత్యభామ బి) భామనే సత్యభామనే సి) శ్రీకృష్ణ సత్ యడి) సత్యభామనే ► భానుమతితో కలిసి సుహాసిని నటించిన ఓ సినిమాలో ‘ఇన్నాళ్లకొచ్చింది దీపావళి..’ అనే పాట ఉంది. ఆ సినిమా పేరేంటి? ఎ) ముద్దుల కూతురు బి) ముద్దుల మనవరాలు సి) ముద్దుల కోడలు డి) ముద్దుల పాప ► దీపావళి అంటే వెలుతురు పండగ. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సి. నారాయణ రెడ్ డిబి) దాశరథి సి) వేటూరి డి) సిరివెన్నెల ► ‘ఇంటింటా దీపావళి ’అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారో తెలుసా? ఎ) మురళీమోహన్ బి) మోహన్ సి) చంద్రమోహన్ డి) మోహన్‌బాబు ► వెలుగుతున్న చిచ్చుబుడ్డి పక్కనే ఎగురుతున్న హీరోయిన్... కాళ్ల పట్టీల నుండి హీరోయిన్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. ఆ బ్యూటీ ఎవరు? ఎ) అమీషాపటేల్ బి) కీర్తిరెడ్ డిసి) రేణూ దేశాయ్ డి) భూమిక ► బ్రహ్మానందం సిగరెట్ అనుకుని నోట్లో సీమ టపాకాయ్ ముట్టించుకునే సినిమా పేరేంటి? ఎ) క్షేమంగా వెళ్లి లాభంగా రండి బి) సందడే సందడి సి) తిరుమల తిరుపతి వెంకటేశ డి) అందరూ దొంగలే ► ‘అల్లరి’ నరేశ్ తన సినిమా పేరును దీపావళి టపాసుతో పెట్టుకున్నారు? ఆ సినిమా పేరేంటి? ఎ) సీమ బాంబ్ బి) సీమ టపాకాయ్ సి) సీమ చక్రం డి) సీమ శాస్త్రి ► ఈ సినిమాలో మంచు లక్ష్మి లాయర్. బాంబ్‌లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఆటమ్ బాంబ్ బి) హైడ్రొజన్ చక్రం సి) లక్ష్మీరాకెట్ డి) లక్ష్మీబాంబ్ ► ‘ఇక్కడ నా చిచ్చుబుడ్డి మర్చిపోయాను ఎవరన్నా చూశారా..’ అనే డైలాగ్‌ని ఏ సినిమాలో జగపతిబాబు చెప్పారో గుర్తొచ్చిందా? ఎ) ఫ్యామిలీ బి) అందగాడు సి) ఫ్యామిలీ సర్కస్ డి) సర్కస్ ఫ్యామిలీ ► ‘దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ పొల్యూషన్..’ అని ఏ హీరోయిన్ని ఉద్దేశించి ‘జనతాగ్యారేజ్’ సినిమాలో యన్టీఆర్ అన్నారు? ఎ) నిత్యామీనన్ బి) సమంత సి) త్రిష డి) కాజల్ అగర్వాల్ ► ‘గోపాల గోపాల అలకేలరా... దీపాల వేళాయెఅగుపించరా’ అనే పాటఏ సినిమాలోనిది? ఎ) అత్తారింటికి దారేది బి) ఖలేజా సి) జులాయి డి) అ ఆ ► ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అనే పాటలో నటించిన దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండరామిరెడ్డి సి) కె. విశ్వనాథ్ డి) దాసరి నారాయణరావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) సి5) డి 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) బి 14) ఎ 15) బి 16) డి17) సి 18) ఎ 19) డి20) డి -
స్క్రీన్ టెస్ట్
► ‘ఒక్క అడుగు... ఒక్క అడుగు’ అంటూ గోడపై వైజాగ్ మ్యాప్‌ను ప్రభాస్ గట్టిగా కాలితో ఓ తన్ను తన్నితే... పక్కనున్న కోట శ్రీనివాసరావు గుండెలు అదురుతాయి. ఆ సినిమా ఏదో గుర్తొచ్చిందా? ఎ) ఛత్రపతి బి) రెబల్ సి) అడవి రాముడు సి) మున్నా ► అక్కినేని నాగార్జున, అతని మేనల్లుడు సుమంత్ ఓ సినిమాలో స్నేహితులుగా నటించారు. ఆ సినిమా టైటిల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం! ఎ) సత్యం బి) స్నేహమంటే ఇదేరా! సి) పెళ్లి సంబంధం డి) మహానంది 03 ప్రభుదేవా, రాఘవా లారెన్స్ ఇద్దరూ కొరియోగ్రాఫర్స్ కమ్ డైరెక్టర్స్. వీళ్లిద్దరి డైరెక్షన్‌లోనూ హీరోగా ఫుల్ లెంగ్త్ సినిమాలు చేసిన ఒక స్టార్ ఎవరు? ఎ) చిరంజీవి బి) నాగార్జున సి) ప్రభాస్ డి) సిద్ధార్థ్ 04 ‘భద్ర’ కథను దర్శకుడు బోయపాటి శ్రీను ముందు ఈ హీరోకే చెప్పారు. కథ నచ్చింది కానీ... నా వయసుకు మాస్ సినిమా అవుతుందేమోనని ‘దిల్’ రాజుకు బోయపాటిని రికమండ్ చేసిన హీరో? ఎ) అల్లు అర్జున్ బి) రామ్‌చరణ్ సి) రామ్ డి) నితిన్ 05 ‘శంకర్‌దాదా జిందాబాద్’లోని ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది? ఎ. మూడొస్తే ముద్దుల్ పెడతా.. . బి. ఎంతగొప్పైనా ఆ మేలిమి బంగారం... సి. ఏయ్ సై అంటే సెంటే పూస్తా... డి. వయసన్న మాట మా వంశంలో లేదు... 06 నాగచైతన్యకు రానా దగ్గుబాటి ఏమవుతాడు? ఎ) మేనత్త కొడుకు బి) మేనమామ కొడుకు సి) పిన్ని కొడుకు డి) బాబాయ్ కొడుకు 07 తమన్నా కంటే ముందు ‘ఊపిరి’ సినిమాలో ఈ హీరోయిన్‌కు ఛాన్స్ వచ్చింది. కానీ, ఏవో కారణాల వల్ల తప్పుకున్నారు! ఎ) కాజల్ అగర్వాల్ బి) పూజా హెగ్డేl సి) శ్రుతీహాసన్ డి) రకుల్‌ప్రీత్ సింగ్ 08 మాటల్లేవ్! మాట్లాడుకోవడాలు లేవ్! చిన్న కత్తితో విలన్లను కసా కసా పొడిచేయడమే. ‘ఇద్దరమ్మాయిలతో’ సిన్మాలో ఇంటర్వెల్ ఫైట్‌ను కంపోజ్ చేసిన స్టంట్ మాస్టర్ ఎవరో తెలుసా? ఎ) కెచ్చా బి) పీటర్ హెయిన్స్ సి) సెల్వ డి) ‘డ్రాగన్’ ప్రకాశ్ 09 చైల్డ్ ఆర్టిస్టుగా మహేశ్‌బాబు డ్యూయల్ రోల్లో నటించిన సినిమా ఏదో చెప్పుకోండి చూద్దాం? ఎ) అన్న–తమ్ముడు బి) కొడుకు దిద్దిన కాపురం సి) ముగ్గురు కొడుకులు డి) బాలచంద్రుడు 10 ‘విన్నర్’లోని ‘సూయ సూయ... అనసూయ’ ఐటమ్ సాంగులో యాంకర్ అనసూయ సూపర్ స్టెప్పులేశారు. అయితే... ఈ పాట పాడింది మరో ఫేమస్ యాంకర్. ఆమె ఎవరో తెలుసా? ఎ) సుమ బి) రష్మీ సి) ఉదయభాను డి) శ్రీముఖి 11 ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా? ఎ) భలే దొంగ బి) భలే తమ్ముడు సి) బంగారు బుల్లోడు డి) తల్లిదండ్రులు 12 ఇలియానా ‘ఐ లవ్యూ’ చెప్పిందని ఈ సినిమాలో బ్రహ్మానందం రచ్చ రచ్చ చేసేశారు! ఎ) జల్సా బి) సలీమ్ సి) కిక్ డి) జులాయి 13 ఓ ఐటమ్ సాంగులో పవన్‌కల్యాణ్ అతిథిగా కనిపించిన చిరంజీవి సిన్మా? ఎ) శంకర్‌దాదా ఎంబీబీఎస్ బి) శంకర్‌దాదా జిందాబాద్ సి) అందరివాడు డి) ఖైదీ నంబర్ 150 14 బీదర్‌లో ఇసక చల్లుతానంటూ మోటర్ సైకిల్స్ దొంగగా అలీ ఏ సినిమాలో నవ్వించారు? ఎ) చిరుత బి) సూపర్ సి) పోకిరి డి) ఇడియట్ 15 బీదర్‌లో ఇసక చల్లుతానంటూ మోటర్ సైకిల్స్ దొంగగా అలీ ఏ సినిమాలో నవ్వించారు? ఎ) చిరుత బి) సూపర్ సి) పోకిరి డి) ఇడియట్ 16 ఈమె డబ్బింగ్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై సమంతను ఊహించుకోవడం కష్టం! ఎ) సునీత బి) చిన్మయి సి) హరిత డి) శ్రావణ భార్గవి 17 ఈ హీరోయిన్ అసలు పేరు సౌమ్య! ఎ) శ్రుతీ హాసన్ బి) శ్రద్ధా దాస్ సి) సీరత్ కపూర్ డి) సౌందర్య 18 ‘సోలో’ ఫేమ్ నిషా అగర్వాల్ ఈ హీరోయిన్ చెల్లెలు? ఎ) కాజల్ అగర్వాల్ బి) ఆర్తీ అగర్వాల్ సి) అదితీ అగర్వాల్ డి) అనూ అగర్వాల్ 19 మందు బాటిల్. పక్కనే ఏయన్నార్. బ్రెయిన్‌కి పెద్దగా స్ట్రెయిన్ ఇవ్వకుండా ఈ స్టిల్ ఏ సిన్మాలోనిదో చెప్పేయండి! ఎ) ప్రేమాభిషేకం బి) దేవదాసు సి) ప్రేమనగర్ డి) డాక్టర్ చక్రవర్తి 20 ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసిన ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం! ఎ) కాజల్ అగర్వాల్ బి) తమన్నా సి) సమంత డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) బి 3) సి 4) ఎ 5) బి 6) బి 7) సి 8) ఎ 9) బి 10) ఎ 11) బి 12) సి 13) ఎ 14) డి 15) ఎ 16) బి 17) డి 18) ఎ 19) బి 20) సి