స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screentest | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Apr 27 2018 12:39 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

tollywood movies special screentest - Sakshi

► నాగార్జున నటించిన ‘రాజన్న’ సినిమా యాక్షన్‌ పార్ట్‌ డైరెక్ట్‌ చేసిన దర్శకుడు?
ఎ) బోయపాటి శ్రీను బి) ఎస్‌.ఎస్‌. రాజమౌళి సి) వీవీ వినాయక్‌ డి) హరీష్‌ శంకర్‌

► మహేశ్‌బాబు పలు సందర్భాల్లో ‘నాకు లైఫ్‌ మొత్తం ఒకే ఒక్కరంటే చాలా భయం’ అని చెప్పారు. ఆయన ఎవరికి భయపడుతుంటారు?
ఎ) రమేశ్‌ బాబు (అన్న)      బి) కృష్ణ (తండ్రి)   సి) మంజుల (అక్క)            డి) గల్లా జయదేÐŒ  (బావ)

► ఐఐయంలో గ్రాడ్యుయేట్‌ చేసిన నటుడిగా నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’  సినిమాలో నటించిన మరో నటుడు ఎవరో తెలుసా?
ఎ) అవసరాల శ్రీనివాస్‌  బి) తనీష్‌  సి) విజయ్‌ దేవరకొండ  డి) నిఖిల్‌

► రజనీకాంత్‌ నటించిన ఓ సినిమాకి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకం విడుదలైంది. అది ఏ  సినిమానో తెలుసా?
ఎ) బాషా బి) అరుణాచలం సి) నరసింహా డి) బాబా

► గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించిన తెలుగు హాస్యనటుడు ఎవరు?
ఎ) బ్రహ్మానందం బి) అలీ సి) కోటా శ్రీనివాసరావు డి) పద్మనాభం

► హాలీవుడ్‌ సినిమా ‘లైఫ్‌ ఆఫ్‌ పై’లో హీరో తల్లి పాత్రలో నటించిన హీరోయిన్‌ ఎవరు. ఆమె తెలుగు, తమిళ్, హిందీలోనూ ఫేమస్‌ హీరోయిన్‌. ఎవరామె?
ఎ) కంగనా రనౌత్‌ బి) టబు సి) మాధురీ దీక్షిత్‌ డి) మనీషా కోయిరాల

► అంతం, గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుందా?
ఎ) ఊర్మిళ మటోండ్కర్‌    బి) సాక్షి శివానంద్‌  సి) సోనాలి బింద్రే           డి) జియా ఖాన్‌

► డి.వి.వి. ప్రొడక్షన్స్‌లో మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో హీరోయిన్‌గా కియరా అద్వాని నటించారు. అదే బ్యానర్‌లో ఆమె మరోసారి నటిస్తున్నారు. ఈ సారి హీరో మారారు. ఎవరా హీరో?
ఎ) ఎన్టీఆర్‌ బి) రామ్‌ చరణ్‌ సి) ప్రభాస్‌ డి) అల్లు అర్జున్‌

► ఈ నలుగురిలో మలయాళ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? (చిన్న క్లూ: తెలుగు ‘ప్రేమమ్‌’లో ఆమె నటించారు)
ఎ) లావణ్యా త్రిపాఠి    బి) అనుపమా పరమేశ్వరన్‌  సి) షాలినీ పాండే      డి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌

► దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో  25 సినిమాలకు పనిచేసిన పాటల రచయితెవరో కనుక్కోండి?
ఎ) అనంత శ్రీరామ్‌ బి) భాస్కరభట్ల రవికుమార్‌ సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి

► ‘తేనె మనసులు’ సినిమాలో నటించిన బాలనటి తర్వాతి  కాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో చాలా పెద్ద హీరోయిన్‌ అయ్యింది. ఎవరో గుర్తు తెచ్చుకోండి ఓ సారి?
ఎ) సుహాసిని బి) శ్రీదేవి సి) జయసుధ డి) జయప్రద

► నటి రాశీఖన్నా ట్విట్టర్‌ ఐడీ ఏంటో కనుక్కోండి?
ఎ) దిస్‌ ఈజ్‌ రాశీ బి) మై నేమ్‌ ఈజ్‌ రాశీ   సి) రాశీఖన్నా  డి) యువర్స్‌ రాశీఖన్నా

► ‘ఏస్కో నా గుమా గుమా చాయ్‌ ’ అనే పాట నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ చిత్రంలోనిది. ఆ స్పెషల్‌ సాంగ్‌లో నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) తమన్నా బి) కాజల్‌ అగర్వాల్‌ సి) చార్మీ కౌర్‌ డి) త్రిష

► ‘ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే.. ప్రేమను వదులుకోవటం కాదు..’ అనే ౖyð లాగ్‌ శర్వానంద్‌ నటించిన ‘శతమానంభవతి’ లోనిది. ఆ సినిమా మాటల రచయితెవరు?
ఎ) పరుచూరి బ్రదర్స్‌ బి) సతీశ్‌ వేగేశ్న సి) అబ్బూరి రవి డి) బెజవాడ ప్రసన్న

► నాగార్జునతో రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు చేస్తున్న ఆఫీసర్‌ సినిమా వారిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమా?
ఎ) మూడో సినిమా బి) నాలుగో సినిమా సి) ఐదో సినిమా  డి) ఏడో సినిమా

► ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ‘కల్యాణి ప్రియదర్శన్‌’ ఏ నటి కుమార్తె?
ఎ) అంబికా బి) రాధ సి) లిజి డి) వాణీ విశ్వనాథ్‌

► 2017వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాలో ప్రతి నాయకుని పాత్రలో నటించిన హీరో ఎవరో చెప్పుకోండి?
ఎ) జగపతిబాబు   బి) శ్రీకాంత్‌ సి) జె.డి.చక్రవర్తి   డి) రాజేంద్రప్రసాద్‌

► సమంతలో మంచి నటి ఉందని గుర్తించి. హీరోయిన్‌గా స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) విక్రమ్‌.కె. కుమార్‌     బి) గౌతమ్‌ మీనన్‌ సి) వంశీ పైడిపల్లి          డి) దేవా కట్టా

► యస్వీ రంగారావు, ఎన్టీఆర్‌ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో తెలుసా?
ఎ) నర్తనశాల బి) భూకైలాస్‌ సి) దీపావళి  డి) ఇంద్రజిత్‌

► ఈ ఫొటోలోని చిన్నారి ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌. ఆమె ఎవరో కనుక్కోండి?
ఎ) భానుప్రియ  బి) శోభనసి) జయప్రద  డి) మీనా


మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి
11) ఎ 12) సి 13) సి 14) బి 15) బి 16) సి 17) బి18) బి19) డి20) బి


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement