స్క్రీన్‌ టెస్ట్‌ | Screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Jun 20 2017 2:06 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

స్క్రీన్‌ టెస్ట్‌ - Sakshi

స్క్రీన్‌ టెస్ట్‌

‘ఒక్క అడుగు... ఒక్క అడుగు’ అంటూ గోడపై వైజాగ్‌ మ్యాప్‌ను ప్రభాస్‌ గట్టిగా కాలితో ఓ తన్ను తన్నితే... పక్కనున్న కోట శ్రీనివాసరావు గుండెలు అదురుతాయి. ఆ సినిమా ఏదో గుర్తొచ్చిందా?
    ఎ) ఛత్రపతి     బి) రెబల్‌
    సి) అడవి రాముడు    సి) మున్నా

అక్కినేని నాగార్జున, అతని మేనల్లుడు సుమంత్‌ ఓ సినిమాలో స్నేహితులుగా నటించారు. ఆ సినిమా టైటిల్‌ ఏంటో చెప్పుకోండి చూద్దాం!
    ఎ) సత్యం     బి) స్నేహమంటే ఇదేరా!
    సి) పెళ్లి సంబంధం     డి) మహానంది

03    ప్రభుదేవా, రాఘవా లారెన్స్‌ ఇద్దరూ కొరియోగ్రాఫర్స్‌ కమ్‌ డైరెక్టర్స్‌. వీళ్లిద్దరి డైరెక్షన్‌లోనూ హీరోగా ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలు చేసిన ఒక స్టార్‌ ఎవరు?
    ఎ) చిరంజీవి     బి) నాగార్జున
    సి) ప్రభాస్‌     డి) సిద్ధార్థ్‌

04    ‘భద్ర’ కథను దర్శకుడు బోయపాటి శ్రీను ముందు ఈ హీరోకే చెప్పారు. కథ నచ్చింది కానీ... నా వయసుకు మాస్‌ సినిమా అవుతుందేమోనని ‘దిల్‌’ రాజుకు బోయపాటిని రికమండ్‌ చేసిన హీరో?
    ఎ) అల్లు అర్జున్‌     బి) రామ్‌చరణ్‌
    సి) రామ్‌     డి) నితిన్‌

 

05    ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లోని ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ.    మూడొస్తే ముద్దుల్‌ పెడతా..                                  .  బి.    ఎంతగొప్పైనా ఆ మేలిమి బంగారం...
సి.    ఏయ్‌ సై అంటే సెంటే పూస్తా...                                   డి.    వయసన్న మాట మా వంశంలో లేదు...

06    నాగచైతన్యకు రానా దగ్గుబాటి ఏమవుతాడు?
    ఎ) మేనత్త కొడుకు     బి) మేనమామ కొడుకు
    సి) పిన్ని కొడుకు     డి) బాబాయ్‌ కొడుకు

07    తమన్నా కంటే ముందు ‘ఊపిరి’ సినిమాలో ఈ హీరోయిన్‌కు ఛాన్స్‌ వచ్చింది. కానీ, ఏవో కారణాల వల్ల తప్పుకున్నారు!
    ఎ) కాజల్‌ అగర్వాల్‌     బి) పూజా హెగ్డేl
    సి) శ్రుతీహాసన్‌     డి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌

08    మాటల్లేవ్‌! మాట్లాడుకోవడాలు లేవ్‌! చిన్న కత్తితో విలన్లను కసా కసా పొడిచేయడమే. ‘ఇద్దరమ్మాయిలతో’ సిన్మాలో ఇంటర్వెల్‌ ఫైట్‌ను కంపోజ్‌ చేసిన స్టంట్‌ మాస్టర్‌ ఎవరో తెలుసా?
    ఎ) కెచ్చా     బి) పీటర్‌ హెయిన్స్‌
    సి) సెల్వ     డి) ‘డ్రాగన్‌’ ప్రకాశ్‌

09    చైల్డ్‌ ఆర్టిస్టుగా మహేశ్‌బాబు డ్యూయల్‌ రోల్‌లో నటించిన సినిమా ఏదో చెప్పుకోండి చూద్దాం?
    ఎ) అన్న–తమ్ముడు                   బి) కొడుకు దిద్దిన కాపురం
    సి) ముగ్గురు కొడుకులు              డి) బాలచంద్రుడు

10    ‘విన్నర్‌’లోని ‘సూయ సూయ... అనసూయ’ ఐటమ్‌ సాంగులో యాంకర్‌ అనసూయ సూపర్‌ స్టెప్పులేశారు. అయితే... ఈ పాట పాడింది మరో ఫేమస్‌ యాంకర్‌. ఆమె ఎవరో తెలుసా?
    ఎ) సుమ     బి) రష్మీ
    సి) ఉదయభాను     డి) శ్రీముఖి

11    ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా?
    ఎ) భలే దొంగ     బి) భలే తమ్ముడు
    సి) బంగారు బుల్లోడు     డి) తల్లిదండ్రులు

12    ఇలియానా ‘ఐ లవ్యూ’ చెప్పిందని ఈ సినిమాలో బ్రహ్మానందం రచ్చ రచ్చ చేసేశారు!
    ఎ) జల్సా     బి) సలీమ్‌
    సి) కిక్‌     డి) జులాయి

13    ఓ ఐటమ్‌ సాంగులో పవన్‌కల్యాణ్‌ అతిథిగా కనిపించిన చిరంజీవి సిన్మా?
    ఎ) శంకర్‌దాదా ఎంబీబీఎస్‌     బి) శంకర్‌దాదా జిందాబాద్‌
    సి) అందరివాడు    డి) ఖైదీ నంబర్‌ 150

14    బీదర్‌లో ఇసక చల్లుతానంటూ మోటర్‌ సైకిల్స్‌ దొంగగా అలీ ఏ సినిమాలో నవ్వించారు?
    ఎ) చిరుత     బి) సూపర్‌    సి) పోకిరి    డి) ఇడియట్‌

15    బీదర్‌లో ఇసక చల్లుతానంటూ మోటర్‌ సైకిల్స్‌ దొంగగా అలీ ఏ సినిమాలో నవ్వించారు?
    ఎ) చిరుత     బి) సూపర్‌    సి) పోకిరి    డి) ఇడియట్‌

16    ఈమె డబ్బింగ్‌ లేకుండా సిల్వర్‌ స్క్రీన్‌పై సమంతను ఊహించుకోవడం కష్టం!
    ఎ) సునీత     బి) చిన్మయి
    సి) హరిత     డి) శ్రావణ భార్గవి

17    ఈ హీరోయిన్‌ అసలు పేరు సౌమ్య!
    ఎ) శ్రుతీ హాసన్‌     బి) శ్రద్ధా దాస్‌
    సి) సీరత్‌ కపూర్‌     డి) సౌందర్య

18    ‘సోలో’ ఫేమ్‌ నిషా అగర్వాల్‌ ఈ హీరోయిన్‌ చెల్లెలు?
    ఎ) కాజల్‌ అగర్వాల్‌     బి) ఆర్తీ అగర్వాల్‌
    సి) అదితీ అగర్వాల్‌     డి) అనూ అగర్వాల్‌

19    మందు బాటిల్‌. పక్కనే ఏయన్నార్‌. బ్రెయిన్‌కి పెద్దగా స్ట్రెయిన్‌ ఇవ్వకుండా ఈ స్టిల్‌ ఏ సిన్మాలోనిదో చెప్పేయండి!
    ఎ) ప్రేమాభిషేకం     బి) దేవదాసు
    సి) ప్రేమనగర్‌     డి) డాక్టర్‌ చక్రవర్తి

20    ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌. తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసిన ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం!
    ఎ) కాజల్‌ అగర్వాల్‌     బి) తమన్నా
    సి) సమంత     డి) శ్రియ

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...
మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...
మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు:
1) ఎ 2) బి 3) సి 4) ఎ 5) బి
6) బి 7) సి 8) ఎ 9) బి
10) ఎ 11) బి 12) సి
13) ఎ 14) డి 15) ఎ
16) బి 17) డి 18) ఎ
19) బి 20) సి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement