కల్యాణ్‌రామ్‌తో కొత్త లుక్‌లో... | Kalyan Ram to romance with Tamanna in Jayendra new film | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌రామ్‌తో కొత్త లుక్‌లో...

Published Sun, Aug 27 2017 12:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

కల్యాణ్‌రామ్‌తో కొత్త లుక్‌లో...

కల్యాణ్‌రామ్‌తో కొత్త లుక్‌లో...

‘బాహుబలి–2’ తర్వాత తెలుగులో పలు అవకాశాలొచ్చినా తమన్నా అంగీకరించలేదు. జస్ట్‌... గాళ్‌ నెక్ట్స్‌ డోర్, బబ్లీ గ్లామరస్‌ రోల్స్‌ కాకుండా కొత్తగా, నటనకు అవకాశమున్న క్యారెక్టర్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానని ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడు అటువంటి అవకాశమే వచ్చినట్టుంది. వెంటనే ఓకే చెప్పేశారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ‘180’ ఫేమ్‌ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మిస్తున్న ఈ సిన్మాలో హీరోయిన్‌గా ముందు ఐశ్వర్యలక్ష్మిని ఎంపిక చేశారు. ఏమైందో ఏమో ఇప్పుడామె స్థానంలో తమన్నా వచ్చి చేరారు. ‘‘యస్‌... కల్యాణ్‌రామ్‌కు జోడీగా తమన్నాను ఎంపిక చేశాం. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్త లుక్‌లో కనిపిస్తారు. సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ మొదలవుతుంది. సెప్టెంబర్‌ నెలాఖరుకు 50 శాతం టాకీ పూర్తవుతుంది’’ అని చిత్రసమర్పకుడు మహేశ్‌ కోనేరు తెలిపారు. ఈ సినిమాకు తమన్నా కోటీ అరవై లక్షలు పారితోషికం అందుకుంటున్నట్లు సమా చారం!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement