కల్యాణ్‌రామ్ నిర్మాతగా కిక్-2 ? | Ravi Teja Kick 2 in Kalyan Ram production | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌రామ్ నిర్మాతగా కిక్-2 ?

Published Fri, Jan 3 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

కల్యాణ్‌రామ్ నిర్మాతగా  కిక్-2 ?

కల్యాణ్‌రామ్ నిర్మాతగా కిక్-2 ?

 ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించే ట్రెండ్ ఒకప్పుడుండేది. ఇప్పుడిప్పుడే మళ్లీ నిదానంగా ఆ ట్రెండ్ మొదలైంది. అలాగే... ఓ హీరో నిర్మాతగా, మరో హీరోతో సినిమా నిర్మించే ట్రెండ్ కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే... ఆ ట్రెండ్ లేదు. ఆ ట్రెండ్‌కి మళ్లీ జీవం పోసే పనిలో ఉన్నారు కల్యాణ్‌రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించి తానే నటిస్తూ ఇన్నాళ్లూ సినిమాలు తీశారాయన. ఇప్పుడు కాస్త ఢిఫరెంట్‌గా... తాను నిర్మాతగా మాత్రమే     కొనసాగుతూ రవితేజ హీరోగా     ఓ చిత్రాన్ని     నిర్మించనున్నారట.
 
     ‘అతనొక్కడే’ సినిమా ద్వారా తానే దర్శకునిగా పరిచయం చేసిన సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో కిక్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కల్యాణ్‌రామ్ నిర్మించబోతున్న చిత్రం ఆ ‘కిక్’కి కొనసాగింపని తెలిసింది. ‘కిక్-2’గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వినికిడి. ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement