
చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు రాణిస్తున్నారు. కొందరు నటీనటులుగా మెప్పిస్తే.. మరికొందరు నిర్మాణ బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు మాస్‌మహారాజ్ రవితేజ( Ravi Teja) ముద్దుల కూతురు మోక్షద(Mokshadha) ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి కొద్దిరోజుల క్రితమే సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె తెరమీద నటించేందుకు రావడం లేదని, తెర వెనుక కీలకంగా పోషించే పాత్రలో ఉండనున్నారని వారి సన్నిహితులు చెబుతున్న మాట.
సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటోందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో(Anand Deverakonda) ఒక సినిమాను సితార ఎంటర్ టైన్‌మెంట్స్(Sithara Entertainments) ప్లాన్ చేస్తుంది.

ఈ సినిమాకు రవితేజ కూతురు మోక్షద ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోందట. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. ఒక ప్రత్యేకమైన కథాంశంతో కూడిన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. మొదట అందరూ మోక్షద గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ లేదా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, ఆమె నిర్మాతగా భవిష్యత్‌లో కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది.
నిర్మాతలుగా సత్తా చాటుతున్న హీరోల కూమార్తెలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య మ్యాడ్ వంటి చిత్రాలను నిర్మించి రాణిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాతో నిర్మాతగా నిహారిక కొణిదెల సత్తా చాటింది. సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి- అనిల్ రావిపూడితో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆపై బాలకృష్ణ- బోయపాటి శ్రీను కొత్త సినిమా BB4కు నందమూరి తేజస్విని నిర్మాతగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరి సరసన రవితేజ ముద్దులు కూతురు మోక్షిద కూడా చేరనుంది.