సమ సమాజ్ పార్టీలో...!!
యస్... కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ ‘సమ సమాజ్’కి ఎన్టీఆర్ జై కొట్టారు. జై కొట్టడం ఏంటి? అందులో చేరి ప్రజల వద్దకు వెళ్లారు. తమ పార్టీకి, తమ అభ్యర్థులకు ఓటేయమని ప్రజల్ని అడుగుతున్నారు. ఆల్రెడీ పూణేలో పార్టీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. పూణెలో ఎందుకు ప్రచారం చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? ఎందుకంటే... ‘జై లవకుశ’ సినిమా సెట్ ఒకటి వేసిందక్కడే మరి! యస్... ఎన్టీఆర్ చేరింది రియల్ పార్టీలో కాదు, రీల్ పార్టీలో.
ఆయన హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరు ‘జై’, సమ సమాజ్ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పూణెలో ‘జై’ పాత్రధారిపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క వీకెండ్స్‌లో ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ కూడా పూణేలోనే ఉంది.