కళ్యాణ్‌ రామ్‌ ఎన్నికల ప్రచారం | Kalyan Rams Election Campaigning | Sakshi
Sakshi News home page

కళ్యాణ్‌ రామ్‌ ఎన్నికల ప్రచారం

Published Sat, Nov 4 2017 10:05 AM | Last Updated on Sat, Nov 4 2017 10:47 AM

Kalyan Rams Election Campaigning - Sakshi

జై లవ కుశ సినిమాతో నిర్మాతగా సూపర్‌ హిట్‌ కొట్టిన నందమూరి కళ్యాణ్‌ రామ్‌ త్వరలో హీరోగాను సక్సెస్‌ సాధించేందుకు రెడీ  అవుతున్నాడు. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతుంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈసినిమాకు  సంబధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కళ్యాణ్‌ రామ్‌ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించనున్నాడు. అందుకు సంబందించిన పోస్టర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ పోస్టర్‌లో రాజకీయనాయకుడిలా అభివాదం చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ పక్కన ‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్‌ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించ ప్రార్థన మీ కళ్యాణ్‌’ అని ఉంది. అంటే సినిమా టైటిల్‌ను జెస్టిపై చేస్తూ ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement