షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘నా నువ్వే’ | Kalyan Ram Naa Nuvve Shooting Wraps Up | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 3:42 PM | Last Updated on Sun, Apr 8 2018 3:42 PM

Kalyan Ram Naa Nuvve Shooting Wraps Up - Sakshi

‘నా నువ్వే’ సినిమాలో కల్యాణ్ రామ్‌, తమన్నా

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. ఇటీవల ఎంఎల్‌ఏగా ఆకట్టుకున్న నా నువ్వేలో క్లాస్‌ లుక్‌లో అలరించనున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెజెండరీ టెక్నీషియన్‌ పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస‍్పాన్స్‌ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement