జూన్‌ 14న ‘నా నువ్వే’ | Kalyan Ram Naa Nuvve Movie Will Release On 14th June | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 3:29 PM | Last Updated on Sat, May 26 2018 3:35 PM

Kalyan Ram Naa Nuvve Movie Will Release On 14th June - Sakshi

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తొలిసారిగా చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘నా నువ్వే’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటిసారిగా జతకొట్టిన ఈ జోడి.. చాలా బాగుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేది ఫిక్స్‌ అయింది. జూన్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నా నువ్వే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా అందాలు, కళ్యాణ్‌రామ్‌ లుక్స్‌ ఈ సినిమాకు స్పెషల్‌ అ‍ట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేయగా...జయేంద్ర దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement