Naa Nuvve
-
సముద్ర గర్భంలో సాహసాలు
నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో కల్యాణ్ రామ్. అతనొక్కడే, పటాస్ లాంటి ఒకటి రెండు భారీ హిట్స్ ఉన్నా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఈ ఏడాది ఎమ్మెల్యే, నా నువ్వే లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ కొన్ని రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సముద్ర గర్భంలో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన డైవింగ్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో డూప్ లేకుండా కల్యాణ్ రామ్ ఈ సన్నివేశాలు నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నిదరే లేదే
ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన కల్యాణ్ రామ్ మూడో సినిమా కూడా రెడీ చేసే పనిలో పడ్డారు. దాని కోసం నిద్ర లేకుండా నైట్ అంతా పని చేస్తున్నారు. కెమెరామేన్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో షాలినీ పాండే, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మొత్తం నైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నివేథా తన పార్ట్ కంప్లీట్ చేశారట. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ నైట్ షెడ్యూల్ సాగనుందని సమాచారం. -
‘నా నువ్వే’ మూవీ రివ్యూ
టైటిల్ : నా నువ్వే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : కల్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్ సంగీతం : శరత్ దర్శకత్వం : జయేంద్ర నిర్మాత : మహేష్ ఎస్. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఇన్నాళ్లు అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తొలిసారిగా తన ఇమేజ్ను పక్కన పెట్టి పూర్తి క్లాస్ మూవీగా తెరకెక్కిన నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన నా నువ్వే అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి కల్యాణ్ రామ్ చేసిన ప్రయోగం ఏ మేరకు ఫలించింది..? కథ ; నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ. వరుణ్ (కల్యాణ్ రామ్) పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. మీరా (తమన్నా) డెస్టినీని విపరీతంగా నమ్మె అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్ లో వరుణ్ ఫొటో చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి (తనికెళ్ల భరణి) వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్ లో కనిపించి కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్ లుక్ లో మెప్పించాడు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ; కల్యాణ్ రామ్ లాంటి మాస్ హీరోతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించిన దర్శకుడు జయేంద్ర అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. డెస్టినీ చుట్టూ రాసుకున్న కథలో ఎమోషన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. విడిపోయిన హీరో హీరోయిన్లు ఎలా కలుస్తారన్న క్యూరియాసిటీ కలిగించినా.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే స్థాయి ఎమోషనల్ సీన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లకు కామెడీ కూడా కీలకం. అయితే దర్శకుడు ఎక్కడా కామెడీ మీద దృష్టి పెట్టలేదు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రియదర్శి లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. శరత్ సంగీతమందించిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. యాడ్ ఫిలిం మేకర్ అయిన జయేంద్ర పాటలను యాడ్ ఫిలింస్ లా గ్రాఫిక్స్ నేపథ్యంలో ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఉన్నా.. ఆయన మ్యాజిక్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి క్లాస్ సినిమా కావటంతో ఓ సెక్షన్ ఆడియన్స్ ను అలరించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ప్లస్ పాయింట్స్ : తమన్నా గ్లామర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ లవ్ స్టోరిలో ఉండాల్సిన ఫీల్ కనిపించకపోవటం ఎంటర్టైన్మెంట్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మా ఆవిడ, అబ్బాయికి నచ్చాను
‘‘కమర్షియల్ హీరోకు ఫిజికల్‌గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. రొమాంటిక్ హీరోకి మైండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. దేని కష్టం దానిలో ఉంది. రెండూ రెండే. కాకపోతే.. హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ పంచుకున్న సంగతులు... ► కమర్షియల్ సినిమాల్లో హీరో బాడీలాంగ్వేజ్ స్పీడ్‌గా ఉంటుంది. ‘నా నువ్వే’లాంటి రొమాం టిక్ సినిమాలు చేసేటప్పుడు కొంచెం సెటిల్డ్‌గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కు వ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ► నా పాత్ర కోసం ఎవర్నీ ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. జయేంద్రగారి మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. క్యారెక్టర్‌తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైమ్ పట్టింది. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ‘నా నువ్వే’ లాంటి రొమాంటిక్ సినిమా చేయడం నాకు ఫస్ట్ టైమ్. ‘గీతాంజలి’ సినిమా చూసినప్పటి నుంచి పీసీ శ్రీరామ్‌గారితో పని చేయాలనుకునేవాణ్ణి. ‘నా నువ్వే’తో నా కల నెరవేరింది. ► అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. నా పాత్రలో కాస్త స్వార్థం కూడా ఉంటుంది. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘నా నువ్వే’ లాంటి సినిమా చేసుంటే బాగుండేది. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది. ► తమన్నాతో పని చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్‌లో టైమ్‌కు ఉంటుంది. టోటల్ సీన్‌ను సింగిల్ షాట్లో తీయడం జయేంద్రగారికి అలవాటు. మొత్తం సీన్ అయ్యాకే కట్ చెబుతారు. అందుకే తమన్నా, నేను షూటింగ్‌కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. కిరణ్, విజయ్, మహేశ్ ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ► ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకోలేదు. నా మైండ్ సెట్ ప్రకారం చేస్తుంటా. ఓ సినిమా చేస్తున్నప్పుడు మరో కథ నచ్చితే చేసేస్తా. ప్రస్తుతం కేవీ గుహన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. ఏదో ఒక ఫ్రేమ్‌కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాదినేని దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ ఉంటుంది. గుణ్ణం గంగరాజుగారు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తారు. వచ్చే ఏడాది తారక్‌తో కూడా ఓ సినిమా ఉంటుంది. -
బాగా నటించాడ్రా అంటే చాలు
‘‘కల్యాణ్ అన్నను చూస్తుంటే మూడేళ్ల కిందట నేను పడిన టెన్షన్ ఆయనలో కనిపిస్తోంది. నేను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు.. ముఖ్యంగా ఆ గెటప్ ఛేంజ్ చేసినప్పుడు.. అప్పటి వరకూ నేను చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనిపించింది. ప్రతి నటుడూ స్టీరియో టైప్ పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికే కాదు.. అభిమానులు, ప్రేక్షకులకూ సంతృప్తి ఉండదు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఓ నటుడిగా సినిమా హిట్ అయిందా? లేదా? అన్నదానికంటే ‘బాగా నటించాడ్రా’.. అనే చప్పట్లే ఎంతో ముఖ్యం. కొత్తగా ట్రై చేసినప్పుడు ఈ టెన్షన్లు సర్వసాధారణం. కానీ మీరు (కల్యాణ్‌రామ్) టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ప్రేక్షక దేవుళ్లది, మన అభిమానులది చాలా పెద్ద హృదయం. జెన్యూన్‌గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్ద పీట వేయడం ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్తేమీ కాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ కూడా తప్పకుండా నిలుస్తుందని నా నమ్మకం. మీరు పడిన కష్టం, టెన్షన్ వృథా పోదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత గంట మాట్లాడతానని అన్న చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ యాక్టర్‌కి అవసరం. జయేంద్ర సార్‌కి చాలా గట్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఓ ఛాలెంజ్‌లా భావించి చేశారాయన. షరెత్గారి కెరీర్లో ‘నా నువ్వే’ బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అనంత శ్రీరామ్‌గారు చక్కటి సాహిత్యం అందించారు. ఈ సినిమా నిర్మాతలు విజయ్‌గారు, కిరణ్‌గారు, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇలాంటి ఓ ప్రయత్నం చేసేటప్పుడు చాలా దమ్ముండాలి. రిజల్ట్ గురించి మాట్లాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం అందరి కెరీర్లో.. ముఖ్యంగా మా కల్యాణ్ అన్న కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చేయాలి. మరిన్ని ప్రయోగాలు చేసే ఎంకరేజ్మెంట్ ఈ సినిమా అన్నకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. జయేంద్ర మాట్లాడుతూ– ‘‘నిర్మాతలకి లాస్ ఏంజెల్స్‌లో ‘నా నువ్వే’ కథ చెప్పాను. వెంటనే సినిమా చేద్దామన్నారు. కల్యాణ్‌రామ్‌గారు నాపై నమ్మకంతో ఒకే సిట్టింగ్‌లో కథ ఓకే చేశారు. ఇప్పటి వరకూ ఆయన యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది రొమాన్స్ జానర్లో ఉంటుంది. 14న సినిమా చూశాక ప్రేక్షకులు కల్యాణ్‌రామ్‌ని ‘వాట్ ఏ లవర్ బోయ్’ అంటారు. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో తమన్నా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లున్నాయి. ఒకటి కల్యాణ్ మేకోవర్, రెండోది తమన్నా పాత్ర. ఇది పూర్తి రొమాంటిక్ ఫిల్మ్ కాదు. యువతరంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. సమర్పకులు మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ఎక్స్ట్రా స్పెషల్ అని చాలాసార్లు చెప్పా. సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో కొత్త కల్యాణ్‌రామ్‌గారు కనిపిస్తారు. మాస్ హీరోగా ఇప్పటికే మార్క్ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌కి మరింత దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా నువ్వే’ చిత్రం పాటలు చాలా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు షరెత్ సార్‌కి థ్యాంక్యూ. ‘నా నువ్వే’ థీమ్ సాంగ్ ఇప్పటికీ రోజుకి పదిసార్లు వింటూ ఉంటాను. జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. అప్పుడు ఆయన్ని ఒక్కటే ప్రశ్న అడిగా. ఈ రోల్‌కి నేను ఎలా సరిపోతారని మీరు భావిస్తున్నారు? అని. నా కెరీర్లో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశా. ఎక్కువమంది అటువంటి చిత్రాలతోనే నన్ను కలుస్తున్నారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫిల్మ్. నేనెప్పుడూ ఇలాంటి చిత్రం చేయలేదు. అప్పుడు ఆయన నాతో అన్నారు. ‘ఓ రొమాంటిక్ హీరోతో రొమాంటిక్ సినిమా చేయొచ్చు. దట్స్ సింపుల్ అండ్ ఈజీ. కానీ ప్రేక్షకులకు ఏం కొత్తగా ఉంటుంది? కానీ, ఇప్పటి వరకూ మీరు చేయని ఈ రోల్ చేసి ప్రేక్షకులకు నచ్చితే అది నాకు పెద్ద సక్సెస్’ అన్నారు. నాపై ఆయన నమ్మకం చూసి ఈ సినిమా చేశా. నా వద్దకి ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడంతో పాటు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరోయిన్ని తీసుకొచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చాలా ఏళ్లుగా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్లీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా విడుదలయ్యాక గంట సేపు మాట్లాడతా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్ టోటల్‌గా ఛేంజోవర్ అయ్యాడు. నేను కూడా ఇలా ఓ సినిమాకి చేయాలనుకున్నా. ఆ దేవుడు, మా తాతగారు (ఎన్టీఆర్) విని, నాకు ఈ సినిమా ఇచ్చారని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్రనిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు షరెత్, పాటల రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు నాగవంశీ, పీడీవీ ప్రసాద్, విజయ్ చిల్లా తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్’లో క్యారెక్టర్‌పై కల్యాణ్ రామ్ క్లారిటీ
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను బాలయ్య స్వయంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ బయోపిక్‌ను తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రాజెక్ట్నుంచి తప్పుకోవటం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు గా ప్రకటించారు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కల్యాన్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఈ గురువారం రిలీజ్‌కు రెడీ అవుతున్న నా నువ్వే సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కల్యాణ్ రామ్.. ఎన్టీఆర్ బయోపిక్ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. గతంలో తేజ ఎన్టీఆర్ సినిమాలో ఓ పాత్ర చేయాలని కోరారని.. కానీ ఏ పాత్ర అన్నది చెప్పలేదని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ లో కల్యాన్ రామ్ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. -
హృదయాన్ని హత్తుకునేలా...
కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్‌లో చూపించే చిత్రం ‘నా నువ్వే’. ఇద్దరూ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’’ అన్నారు చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర రూపొందించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘జయేంద్రగారు అద్భుతమైన ఫీల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పీసీ శ్రీరామ్‌గారు ప్రతీ ఫ్రేమ్‌ను ఎక్స్ట్రాడినరీగా చూపించారు. శరత్ సంగీతానికి మంచి స్పందని లభిస్తోంది’’ అని అన్నారు. -
జూన్ 14న ‘నా నువ్వే’
నందమూరి కళ్యాణ్‌రామ్ తొలిసారిగా చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మొదటిసారిగా జతకొట్టిన ఈ జోడి.. చాలా బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేది ఫిక్స్ అయింది. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నా నువ్వే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా అందాలు, కళ్యాణ్‌రామ్ లుక్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేయగా...జయేంద్ర దర్శకత్వం వహించారు. -
‘నా నువ్వే’ మరింత ఆలస్యం..!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో తమన్నా హీరోయిన్ గా నటించారు. చాలా రోజులు క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో విడుదల వాయిదా పడింది. దీంతో సినిమాను వారం రోజులు ఆలస్యంగా జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం నా నువ్వే రిలీజ్ మరింత ఆలస్యం కానుందట. జూన్ 8న లేదా.. 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని కారణంగానే విడుదల ఆలస్యమవుతుందని తెలుస్తోంది. -
వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒకే రోజు
కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలన్నీ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ చిత్రాలేవి బరిలో లేకపోవటంతో జూన్ 1న వాయిదా పడిన సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ హీరో నాగార్జున కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 25నే రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో జూన్ 1కి వాయిదా వేశారు. అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం నా నువ్వే. కల్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా మే 25నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా జూన్ 1కి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమా కూడా ఎన్నో వాయిదాల తరువాత జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ వింతవ్యాధితో బాధపడుతున్న యువకుడిగా కనిపించనున్నాడు. జూన్ 1న రిలీజ్ అవుతున్న మరో ఆసక్తికర చిత్రం అభిమన్యుడు. విశాల్, అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయాల్సి ఉన్నా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేశారు. తమిళ నాట మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
కల్యాణ్ రామ్ కొత్త సినిమా వాయిదా..?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు రవితేజ నేటటిక్కెట్టు రిలీజ్ అవుతుండటంతో పాటు సమ్మర్లో రిలీజ్ అయిన పలు చిత్రాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటంతో నా నువ్వేను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. వారం ఆలస్యంగా జూన్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది
‘ఏ బోండాం. ఖాళీగానే ఉన్నావు కదా? ఇంకో వన్ మినిట్ తనని వెళ్లకుండా ఆపుంటే నీ సొమ్మేం పోయేది.. ఏంటే లవ్వా? చేస్తే తప్పేంటి?... ఇదేం ట్విస్ట్ బావా.. జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది... నా ప్రేమ, నా బాధ అందరికీ వినపడుతుంది. నీకు వినిపించటం లేదా?’ వంటి డైలాగులు ‘నా నువ్వే’ సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి. కల్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.జయేంద్ర మాట్లాడుతూ –‘‘ఎగ్జయిటింగ్ ఫిల్మ్ ఇది. కల్యాణ్‌రామ్ గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. తమన్నా లాంగ్ కెరీర్లో ఇందులో చాలా కొత్తగా కనపడుతుంది. సినిమా చూసే ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘లవబుల్, రొమాంటిక్ మూవీ ఇది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సెన్సార్ ప్రాసెస్ స్టార్టయ్యింది. 25న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘నా నువ్వే’ టీమ్‌తో యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాం’’ అన్నారు కిరణ్ ముప్పవరపు. -
‘లవ్వా.. చేస్తే తప్పేంటి’
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ గతంలో ఎన్నాడూ కనిపించనంత సాఫ్ట్ అండ్ రొమాంటిక్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. షరత్ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో మంచి రెస్సాన్స్ వస్తోంది. -
కళ్యాణ్‌రామ్ `నా నువ్వే' ట్రైలర్ రిలీజ్
-
‘నా నువ్వే’ రన్ టైం ఫిక్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రన్ టైం షార్ట్ అండ్ క్రిస్ప్‌గా ఉండనుంది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో భారీ నిడివితో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య, మహానటి ఇలా అన్ని సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో రిలీజ్ అయ్యాయి. అయితే నా నువ్వే నిడివి మాత్రం రెండు గంటల లోపే ఉండనుంది. కేవలం 118 నిమిషాల రన్‌టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షరత్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఇటీవల రిలీజ్ చేశారు. సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఎన్టీఆర్ అందుకే రాలేదు..!
కొంతకాలంగా నందమూరి హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమా వేడుకల్లో మరొకరు పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఏ ఒక్క వేడుకలో ఈ ఇద్దరు కలిసి కనిపించకపోయినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఇటీవల కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరువాత కల్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్‌లో ఇద్దరు కలిసి కనిపించటంతో రూమర్లకు చెక్ పడింది. తాజాగా కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీంతో మరోసారి రూమర్లకు ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన ఎన్టీఆర్ టీం వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైజాగ్‌లో హరికృష్ణ సన్నిహితుల పెళ్లి వేడుకకు హాజరు కావాల్సి ఉండటంతో ఎన్టీఆర్ ‘నా నువ్వే’ ఆడియో వేడుకకు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. -
జయేంద్రగారు ఆ కల నేరవేర్చారు
‘‘జయేంద్రగారు కథ చెబుతారు అని మహేశ్ చెప్పగానే, ఆయన ప్యూర్ లవ్‌స్టోరీలు చేస్తారు. మనం మాస్ సినిమాలు చేస్తాం. ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పడమేంటీ? అనుకున్నాను. ‘మిస్ కమ్యూనికేషన్ అనుకుంటా. నేను నమ్మను’ అన్నాను. కాదు.. జయేంద్రగారు కథ చెబుతారట. పీసీ శ్రీరామ్ కెమెరామేన్‌గా చేస్తారనగానే షాక్ అయ్యాను. పీసీగారితో వర్క్ చేయడం కలగా మిగిలిపోతుంది అనుకున్నాను. జయేంద్రగారు ఆ కల నెరవేర్చారు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘నా నువ్వే’. కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించారు. శరత్ సంగీత దర్శకుడు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘నా చేంజ్ ఓవర్‌కు జయేంద్ర, పీసీగారే కారణం. చాలా ఇబ్బంది పెట్టాను, ఎంతో ఓపికగా చేశారు. పీసీగారి కెమెరాను ఫేస్ చేయాలంటే భయమేసింది. ఈ సినిమాకు శరత్‌గారే హీరో. మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. పాటలు చాలా బాగా ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్. మేం ఏం అడిగితే అది ఇచ్చారు. హీరోయిన్గా తమన్నా కాకుండా ఎవ్వర్నీ ఈ సినిమాలో ఊహించుకోలేను. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కల్యాణ్‌గారు తన యాక్షన్, థ్రిల్లర్ జానర్ నుంచి బయటికొచ్చి రొమాంటిక్ సినిమా చేయడానికి నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్ ప్యాషన్ వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది’’ అన్నారు జయేంద్ర. ‘‘ఇష్క్’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. కల్యాణ్, తమన్నా, ప్రొడ్యూసర్స్ అందరితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది జయేంద్ర బెస్ట్ సినిమా అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు పీసీ శ్రీరామ్ .‘‘నేను ఎక్కువ కష్టపడలేదు. అంతా నా పార్టనర్ కిరణ్ చూసుకున్నారు. పీసీ–జయేంద్రగారి కాంబినేషన్ మ్యాజికల్. అందరూ స్క్రీన్ మీద చూస్తారు. కల్యాణ్‌రామ్‌గారు ఈ సినిమా చేయడమేంటీ? అని ఆశ్చర్యపోయాను. జయేంద్రగారు, పీసీ కలసి కల్యాణ్‌గారిని చూపించిన విధానంతో నా ఒపీనియన్ మార్చుకున్నాను. తమన్నా మరోసారి అందర్నీ ప్రేమలో పడేస్తారు. హానెస్ట్ ఫిల్మ్ చేయాలని కష్టపడ్డాం. నచ్చుతుందనే నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత విజయ్.‘‘జయేంద్రగారితో వర్క్ చేయడం హ్యాపీ. బ్యూటీఫుల్ మూమెంట్స్‌ను యాక్ట్ చేయడానికి మంచి స్క్రిప్ట్ ఇచ్చిన జయేంద్రగారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. కల్యాణ్ రామ్ మోస్ట్ సపోర్టీవ్ అండ్ డెడికేటెడ్ యాక్టర్’’ అన్నారు తమన్నా. ‘‘ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ అయినా మమ్మల్ని నమ్మినందుకు కల్యాణ్ రామ్‌గారికి థ్యాంక్స్. జయేంద్రగారు, పీసీగారు తమ మ్యాజిక్ చూపిస్తారు’’ అని అన్నారు మహేశ్ కోనేరు. -
ఘనంగా నానువ్వే ఆడియో రిలీజ్