జయేంద్రగారు ఆ కల నేరవేర్చారు | Nandamuri Kalyan Ram Entry @ Naa Nuvve Audio Launch | Sakshi
Sakshi News home page

జయేంద్రగారు ఆ కల నేరవేర్చారు

Published Mon, May 7 2018 1:46 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Nandamuri Kalyan Ram Entry @ Naa Nuvve Audio Launch - Sakshi

కల్యాణ్‌రామ్, తమన్నా, మహేశ్, కిరణ్, పి.సి.శ్రీరామ్, జయేంద్ర, విజయ్‌

‘‘జయేంద్రగారు కథ చెబుతారు అని మహేశ్‌ చెప్పగానే, ఆయన ప్యూర్‌ లవ్‌స్టోరీలు చేస్తారు. మనం మాస్‌ సినిమాలు చేస్తాం. ఆయన నాకు స్క్రిప్ట్‌ చెప్పడమేంటీ? అనుకున్నాను. ‘మిస్‌ కమ్యూనికేషన్‌ అనుకుంటా. నేను నమ్మను’ అన్నాను. కాదు.. జయేంద్రగారు కథ చెబుతారట. పీసీ శ్రీరామ్‌ కెమెరామేన్‌గా చేస్తారనగానే షాక్‌ అయ్యాను. పీసీగారితో వర్క్‌ చేయడం కలగా మిగిలిపోతుంది అనుకున్నాను. జయేంద్రగారు ఆ కల నెరవేర్చారు’’ అని కల్యాణ్‌ రామ్‌ అన్నారు.

జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘నా నువ్వే’. కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై మహేశ్‌ కోనేరు సమర్పణలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మించారు. శరత్‌ సంగీత దర్శకుడు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ – ‘‘నా చేంజ్‌ ఓవర్‌కు జయేంద్ర, పీసీగారే కారణం. చాలా ఇబ్బంది పెట్టాను, ఎంతో ఓపికగా చేశారు.

పీసీగారి కెమెరాను ఫేస్‌ చేయాలంటే భయమేసింది. ఈ సినిమాకు శరత్‌గారే హీరో. మంచి మ్యూజికల్‌ లవ్‌ స్టోరీ. పాటలు చాలా బాగా ఇచ్చారు. ప్రొడ్యూసర్స్‌ చాలా ప్యాషనేట్‌. మేం ఏం అడిగితే అది ఇచ్చారు. హీరోయిన్‌గా తమన్నా కాకుండా ఎవ్వర్నీ ఈ సినిమాలో ఊహించుకోలేను. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కల్యాణ్‌గారు తన యాక్షన్, థ్రిల్లర్‌ జానర్‌ నుంచి బయటికొచ్చి రొమాంటిక్‌ సినిమా చేయడానికి నన్ను నమ్మినందుకు థ్యాంక్స్‌.

ప్రొడ్యూసర్స్‌ ప్యాషన్‌ వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది’’ అన్నారు జయేంద్ర. ‘‘ఇష్క్‌’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. కల్యాణ్, తమన్నా, ప్రొడ్యూసర్స్‌ అందరితో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇది జయేంద్ర బెస్ట్‌ సినిమా అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు పీసీ శ్రీరామ్‌ .‘‘నేను ఎక్కువ కష్టపడలేదు. అంతా  నా పార్టనర్‌ కిరణ్‌ చూసుకున్నారు.  పీసీ–జయేంద్రగారి కాంబినేషన్‌ మ్యాజికల్‌. అందరూ స్క్రీన్‌ మీద చూస్తారు. కల్యాణ్‌రామ్‌గారు ఈ సినిమా చేయడమేంటీ? అని ఆశ్చర్యపోయాను.

జయేంద్రగారు, పీసీ కలసి కల్యాణ్‌గారిని చూపించిన విధానంతో నా ఒపీనియన్‌ మార్చుకున్నాను. తమన్నా మరోసారి అందర్నీ ప్రేమలో పడేస్తారు. హానెస్ట్‌ ఫిల్మ్‌ చేయాలని కష్టపడ్డాం. నచ్చుతుందనే నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత విజయ్‌.‘‘జయేంద్రగారితో వర్క్‌ చేయడం హ్యాపీ. బ్యూటీఫుల్‌ మూమెంట్స్‌ను యాక్ట్‌ చేయడానికి మంచి స్క్రిప్ట్‌ ఇచ్చిన జయేంద్రగారికి థ్యాంక్స్‌. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్‌. కల్యాణ్‌ రామ్‌ మోస్ట్‌ సపోర్టీవ్‌ అండ్‌ డెడికేటెడ్‌ యాక్టర్‌’’ అన్నారు తమన్నా. ‘‘ఫస్ట్‌ టైమ్‌ ప్రొడక్షన్‌ అయినా మమ్మల్ని నమ్మినందుకు కల్యాణ్‌ రామ్‌గారికి థ్యాంక్స్‌. జయేంద్రగారు, పీసీగారు తమ మ్యాజిక్‌ చూపిస్తారు’’ అని అన్నారు మహేశ్‌ కోనేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement