ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన కల్యాణ్ రామ్ మూడో సినిమా కూడా రెడీ చేసే పనిలో పడ్డారు. దాని కోసం నిద్ర లేకుండా నైట్ అంతా పని చేస్తున్నారు. కెమెరామేన్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇందులో షాలినీ పాండే, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మొత్తం నైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో నివేథా తన పార్ట్ కంప్లీట్ చేశారట. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ నైట్ షెడ్యూల్ సాగనుందని సమాచారం.
నిదరే లేదే
Published Wed, Jun 20 2018 12:24 AM | Last Updated on Wed, Aug 29 2018 2:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment