
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో తమన్నా హీరోయిన్ గా నటించారు. చాలా రోజులు క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో విడుదల వాయిదా పడింది.
దీంతో సినిమాను వారం రోజులు ఆలస్యంగా జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం నా నువ్వే రిలీజ్ మరింత ఆలస్యం కానుందట. జూన్ 8న లేదా.. 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని కారణంగానే విడుదల ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment