అరవిందస్వామి, తమన్నా జంటగా.. | Get ready for Arvind Swamy-Tamanna's Thriller! | Sakshi
Sakshi News home page

అరవిందస్వామి, తమన్నా జంటగా..

Published Tue, Sep 6 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

అరవిందస్వామి, తమన్నా జంటగా..

అరవిందస్వామి, తమన్నా జంటగా..

అరవిందస్వామి, తమన్నా జంటగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'శతురంగ వేట్టై' అనే థ్రిల్లర్‌ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడి గ్యాంబ్లింగ్కు పాల్పడుతూ జీవించే ఓ వ్యక్తి కథే 'శతురంగ వేట్టై'.  త్రివిక్రమ్ 'అఆ'  సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రమణ్యం ఆ సినిమాలో హీరోగా నటించారు.

ఇప్పుడు అరవిందస్వామి, తమన్నాలు ప్రధాన పాత్రల్లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు.  ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ రియల్ ఇన్సిడెంట్ను తెరపై చూపించనున్నారట. 'తనీ ఒరువన్‌'  హిట్ తర్వాత అరవింద్‌ స్వామి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అరవిందస్వామికి జోడీగా తమన్నా నటిస్తుందనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమా విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement