నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం? | Kriti Kharbanda Got Engaged With Pulkit Samrat | Sakshi
Sakshi News home page

Kriti Kharbanda: బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లికి రెడీ?

Jan 30 2024 1:15 PM | Updated on Jan 30 2024 2:51 PM

Kriti Kharbanda Engagement With Pulkit Samrat - Sakshi

ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరోలతో కలిసి మూవీస్ చేసింది. మంచి పేరు సంపాదించింది. ఇకపోతే గత నాలుగేళ్లుగా ఓ నటుడితో డేటింగ్ చేస్తోంది. వీళ్ల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు. కాకపోతే చాలా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఈమెకు పెళ్లెప్పుడు?

దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోనే తీన్‌మార్, అలా మొదలైంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది. చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది. గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీలోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఇదే టైంలో బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితమే రూమర్స్ వచ్చాయి. అయితే డేటింగ్ నిజమే అని క్లారిటీ ఇచ్చేలా కలిసి చాలా చోట్ల కృతి-పులకిత్ జంటగా కనిపించారు. మరి వీళ్ల పెళ్లెప్పుడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లకు ఎండ్ కార్డ్ వేస్తూ నిశ్చితార్థం చేసేసుకున్నారు.

అయితే కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిన విషయం బయటపడింది. అలానే వీళ్ల పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని అంటున్నారు. పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement