'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే? | Tollywood Director Sandeep Raj Engagement Photos Viral In Social Media | Sakshi
Sakshi News home page

Saneep raj: నటితో 'కలర్ ఫోటో' దర్శకుడి ఎంగేజ్‌మెంట్‌!

Nov 11 2024 9:04 PM | Updated on Nov 12 2024 11:41 AM

Tollywood Director Sandeep Raj Engagement Pics Viral In Social Media

ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. త్వరలోనే మరో దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీంతో ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు.

కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.

వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement