series
-
మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
#Shalini Passi లేటెస్ట్ సిరీస్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా సెన్సేషన్ (ఫోటోలు)
-
India vs Sri Lanka: భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 27 ఏళ్ల తర్వాత (ఫోటోలు)
-
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
అలనాటి అందాల కింగ్ ఆఫ్ రోడ్... ఫోటోలు చూస్తే ఫిదా
-
WI vs IND 3rd ODI: విండీస్‌పై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
10 Best KTM Bikes: టాప్ 10 బెస్ట్ కేటీఎమ్ మోటార్ సైకిల్స్
-
భారత మహిళలకు చేజారిన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 33 నాటౌట్) మరో ఎండ్‌లో ఉండగా...చివరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్ 1–1తో ‘డ్రా’ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా నిలిచింది. చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
బీ న్యూ స్టోర్లలో రియల్మీ 11ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్‌లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ, బీనౌ, క్లెవర్పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్‌తో పాటు రియల్మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్‌లు పాల్గొన్నారు. -
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
భారత్ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్ 43వ ఓవర్ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త తడబడినా, రాహుల్ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్ గెలుపును అందుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సిరాజ్, కుల్దీప్లు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టిపడేశారు. దాంతో కనీస స్కోరు కూడా సాధించలేక శ్రీలంక చేతులెత్తేసింది. కోల్‌కతా: టి20 మ్యాచ్‌లోనే 228 పరుగులు నమోదై వారం కూడా కాలేదు. అదే వన్డేలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. శ్రీలంక కనాకష్టంగా స్కోరు చేయగా, దానిని ఛేదించేందుకు భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. మొదట శ్రీలంక 39.4 ఓవర్లలోనే 215 పరుగుల వద్ద ఆలౌటైంది. నువనిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్, సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. సిరీస్ 2–0తో భారత్ గెలుచుకోగా, చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది. భుజం గాయంతో దూరమైన చహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్‌లోకి వచ్చాడు. రాణించిన నువనిదు అవిష్క ఫెర్నాండో (20; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అరంగేట్రం చేసిన నువనిదు ఫెర్నాండో పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. తన ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అవిష్కను సిరాజ్ మరుసటి ఓవర్లో బౌల్డ్ చేశాడు. తర్వాత కుశాల్, నువనిదు ఓవర్‌కు 6 పైచిలుకు రన్‌రేట్‌తో జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చారు. అంతలోనే కుశాల్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)ను కుల్దీప్ ఎల్బీగా పంపడంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత స్పిన్, పేస్‌ల వైవిధ్యం లంకను కుదురుకోనివ్వలేదు. ధనంజయ (0)ను అక్షర్ డకౌట్ చేయగా, అసలంక (15), కెపె్టన్ షనక (2)లను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. హసరంగ (21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటికి ఉమ్రాన్ బ్రేకులేయగా, లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే (34 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో లంక కష్టంగా 200 పరుగులు దాటింది. హార్దిక్ సహకారం లక్ష్యం చిన్నదే అయినా గెలుపు సులువుగా ఏమీ రాలేదు. గత మ్యాచ్ ‘టాప్ 3’ రోహిత్ (17; 2 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 21; 5 ఫోర్లు), కోహ్లి (4) తొలి పది ఓవర్లలోపే అవుటైతే గానీ పిచ్ సత్తా తెలియలేదు. 62 పరుగులకే వీళ్లంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్స్ ముగ్గురే... అయ్యర్, రాహుల్, పాండ్యా! కానీ లక్ష్యదూరం మాత్రం 154 పరుగులు. కీలక దశలో శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. అయితే రాహుల్, హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించింది. 161 స్కోరు వద్ద పాండ్యా అవుటైనా... రాహుల్ కడదాకా నిలబడ్డాడు. అక్షర్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్; 2 ఫోర్లు)లతో కలిసి జట్టును గెలిపించాడు. 93 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (బి) సిరాజ్ 20; నువనిదు రనౌట్ 50; మెండిస్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 34; ధనంజయ (బి) అక్షర్ 0; అసలంక (సి) అండ్ (బి) కుల్దీప్ 15; షనక (బి) కుల్దీప్ 2; హసరంగ (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 21; దునిత్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 32; కరుణరత్నే (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 17; రజిత నాటౌట్ 17; లహిరు (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–29, 2–102, 3–103, 4–118, 5–125, 6–126, 7–152, 8–177, 9–215, 10–215. బౌలింగ్: షమీ 7–0–43–0, సిరాజ్ 5.4–0–30–3, పాండ్యా 5–0–26–0, ఉమ్రాన్ 7–0–48–2, కుల్దీప్ 10–0–51–3, అక్షర్ 5–0–16–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మెండిస్ (బి) కరుణరత్నే 17; గిల్ (సి) అవిష్క (బి) లహిరు 21; కోహ్లి (బి) లహిరు 4; అయ్యర్ (ఎల్బీ) (బి) రజిత 28; రాహుల్ నాటౌట్ 64; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 36; అక్షర్ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–33, 2–41, 3–62, 4–86, 5–161, 6–191. బౌలింగ్: కసున్ రజిత 9–0–46–1, లహిరు 9.2–0–64–2, కరుణరత్నే 8–0–51–2, హసరంగ 10–0–28–0, దునిత్ 2–0–12–0, షనక 2–0–6–0, ధనంజయ 3–0–9–1. చదవండి: IND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. -
శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్‌కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్‌బెంచ్‌లో లీక్ అయ్యాయి. మల్టీ-కోర్ టెస్ట్‌లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్సెట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్ప్లే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా. -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు
Robert Pattinson Batman Movie Runs Nearly 3 Hours: ప్రపంచవ్యాప్తంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. హాలీవుడ్లో సూపర్ హీరోస్ మూవీస్ సహజమే. మిగతా సూపర్ హీరోస్‌కు పవర్స్ అనుకోకుండా జరిగే పలు సంఘటనల ద్వారా వస్తాయి. కానీ బ్యాట్ మ్యాన్ మాత్రం తనకు తాను సొంతగా సూపర్ హీరోల మారతాడు. అది ఎలానో 2005లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బ్యాట్‌మ్యాన్ సిరీస్ కొత్త చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్: ది బ్యాట్ అండ్ ది క్యాట్' ట్రైలర్ విడుదలైంది. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ హీరోగా 'ట్విలైట్' మూవీ ఫేమ్ రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిడివి ఈ సిరీస్‌లోని మిగతా చిత్రాలకంటే ఎక్కువగా ఉండనుందట. ఈ సిరీస్‌లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' రన్‌టైం 2 గంటల 20 నిమిషాలు, 'ది డార్క్‌నైట్' నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది. వీటి తర్వాత 2012లో వచ్చిన 'ది డార్క్‌నైట్ రైజెస్' మూవీ రన్‌టైం 2 గంటల 45 నిమిషాలు ఉంది. కాగా ప్రస్తుతం రానున్న 'ది బ్యాట్ అండ్ ది క్యాట్' చిత్ర నిడివి సుమారు 2 గంటల 55 నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు 3 గంటలు. (చదవండి: నా కొడుకు హృతిక్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్) హాలీవుడ్లో విడుదలైన సూపర్ హీరో చిత్రాలు 'జాక్ స్నైడర్ జస్టీస్ లీగ్' రన్‌టైం 4 గంటల 2 నిమిషాలు, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' నిడివి 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద రన్‌టైం ఉన్న సినిమా ఇదేనని సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు విడుదలైన రెండు ట్రైలర్స్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. సిరీస్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్
-
వెబ్ సిరీస్: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ
లాంగ్వేజ్ : హిందీ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) ఎపిసోడ్స్ : మొత్తం 9 ఎపిసోడ్స్ (ఒక్కొక్కటి 40 నిమిషాలపైనే) ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో కాస్టింగ్ : మనోజ్ వాజ్‌పాయి, సమంత అక్కినేని, షరీబ్ హష్మీ, షహబ్ అలీ, దర్శన్ కుమార్, అశ్లేష థాకూర్, మైమ్ గోపీ, దేవదర్శిని, అలగమ్ పెరుమాల్ తదితరులు క్రియేటర్స్ : డీకే & రాజ్ సొసైటీలో అసాంఘిక శక్తులు అలజడుల కోసం ప్రయత్నించడం.. సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో సాధారణ వ్యక్తి ముసుగులో ఆ కుట్రలను అడ్డుకుని, ఆ అసాంఘిక శక్తుల్ని మట్టుపెట్టడం ఇప్పటివరకు మన సినిమాల్లో చూస్తున్నదే. అయితే దానికి వెబ్ సిరీస్‌గా మలిచి.. డీకే అండ్ రాజ్‌లు చేసిన ప్రయత్నమే ఫ్యామిలీమ్యాన్. లోకల్ జేమ్స్ బాండ్ ట్యాగ్ లైన్‌తో ఫ్యామిలీమ్యాన్ ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో.. రెండో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కీ రోల్ పోషిస్తుండడంతో సౌత్‌లోనూ ఈ అమెజాన్ ప్రైమ్ సిరీస్ పట్ల ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.ఈ తరుణంలో తొలుత కేవలం హిందీ భాషలోనే ఫ్యామిలీమ్యాన్ 2 ను రిలీజ్ చేసి వ్యూయర్స్‌ని నిరుత్సాహపరిచింది అమెజాన్ ప్రైమ్. అయినప్పటికీ రెండో సీజన్ ఏమేర ఆకట్టుకుందో చూద్దాం. కథ.. ఉత్తర శ్రీలంకలో కొన్నేళ్ల క్రితం.. తమిళ రెబల్స్ శిబిరంపై అక్కడి ఆర్మీ దాడి చేయడం, కీలక నేతల పారిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. కట్ చేస్తే.. ఆలస్యంగా ఆఫీస్‌కు వెళ్లి బాస్‌తో క్లాస్‌లు పీకించుకునే ఐటీ జాబ్‌లో చేరతాడు శ్రీకాంత్ తివారి. అయితే, గతంలో టాస్క్ (థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్)లో సీనియర్ ఏజెంట్ అయిన శ్రీకాంత్ ఆ జాబ్‌ను ఆస్వాదించలేకపోతాడు. ఇక టాస్క్‌లో తన కొలీగ్, ఆప్తుడు అయిన జేకే తల్పాడే ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద చెన్నై వెళ్తాడు. అప్పటిదాకా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న శ్రీలంక తమిళ రెబల్స్ ఓ భారీ కుట్రకు పాల్పడుతున్నారని తల్పాడేకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్‌తో చెప్పడం, అదే టైంలో ఇంట్లో గొడవ కారణంగా శ్రీకాంత్ టాస్క్‌లో చేరడం చకచకా జరుగుతాయి. మరోవైపు తమిళ రెబల్ కమాండర్ రాజ్యలక్ష్మి శేఖరన్ అలియాస్ రాజీ తాను అనుకున్న పనిని సీక్రెట్‌గా చేసుకుంటూ పోతుంటుంది. ఈ క్రమంలో ఆమె ఉనికిని పసిగట్టిన పోలీసులు, టాస్క్ టీం ఆమెను బంధిస్తారు. అయితే మెరుపుదాడితో ఆమెను రెబల్స్ విడిపించుకునే ప్రయత్నంలో రాజీ గాయపడుతుంది. మరోవైపు శ్రీకాంత్ కూతురిని ఓ కుర్రాడి సాయంతో ట్రాప్ చేసి.. కిడ్నాప్ చేసి రెబల్స్ తాము అనుకుంటున్న పని చేసుకుపోవాలనుకుంటారు. చివరికి శ్రీకాంత్ తన కూతురిని కాపాడుకోగలుగుతాడా? తమిళ రెబల్స్-రాజీ కుట్రను శ్రీకాంత్ టీం ఎలా అడ్డుకుంటుంది? అనేది కథ. విశ్లేషణ శ్రీకాంత్ పున పరిచయం, ఫ్యామిలీ డ్రామాతో తొలి రెండు ఎపిసోడ్స్ నిదానంగా నడుస్తాయి. రెండో ఎపిసోడ్ తర్వాతి నుంచి అసలు కథ మొదలవుతుంది. నాలుగో ఎపిసోడ్ చివరి నుంచి కథ పరుగులు పెడుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది. తమిళ రెబల్స్ కుట్రలకు ప్లాన్, ట్రేస్ చేయడం, మధ్యలో లీడర్ క్యారెక్టర్ ఫ్యామిలీకి ఇబ్బందులు, ఆ కుట్రలు శ్రీకాంత్ టీం భగ్నం చేయడం, చివరికి రిస్క్ చేసి శత్రువుల్ని మట్టుపెట్టడం.. ఇలా కథలో అంశాలున్నాయి. అయితే ఇవేవీ స్పై తరహా కథల్లోలాగా థ్రిల్ చేయకపోయినప్పటికీ.. వ్యూయర్స్‌ను ఎంగేజ్ మాత్రం చేస్తాయి. నటనపరంగా.. ఏజెంట్ శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి ఆకట్టుకుంటాడు. కుటుంబం కోసం, దేశం కోసం.. నలిగిపోయే పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా మిలింద్ చనిపోయాక భార్యతో ఫొన్లో మాట్లాడుతూ ఏడ్చేసే సీన్ హైలైట్. ఇక సమంతది ప్రతినాయిక పాత్రే. అయినప్పటికీ సామూహిక అత్యాచారానికి గురై, తమ్ముడ్ని కోల్పోయిన బాధితురాలిగా, జాతి గౌరవం కోసం పోరాడే రెబల్ కమాండర్‌గా రాజీ క్యారెక్టర్ అలరిస్తుంది. డేరింగ్ అండ్ బోల్డ్ పాత్రలో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీగా సమంత నటన కొత్తగా అనిపించినా.. గుర్తుండిపోతుంది. ఇక శ్రీకాంత్ కుడిభుజంగా జేకే రోల్లో షరీబ్ నటన మెప్పిస్తుంది. కిందటి సీజన్ మాదిరే ఇద్దరి మధ్య పంచ్‌లు పేలాయి. శ్రీకాంత్ కూతురి రోల్లో అశ్లేష థాకూర్ మెప్పించింది. నటి దేవదర్శికి, షరీబ్కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫర్వాలేదు. ప్రియమణి, శరద్ ఖేల్కర్ ఫర్వాలేదనిపించారు. కోలీవుడ్ తారాగణం రవీంద్ర విజయ్, మైమ్ గోపి, అజగమ్ పెరుమాళ్ తమదైన నటనతో మెప్పించారు. టెక్నీషియన్స్ పనితనం.. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 హంగులు లేకున్నా ఆకట్టుకోవడానికి కారణం బ్రిసన్ అందించిన సినిమాటోగ్రఫ్రీ. ఈ కథలో చాలా సీన్లను(క్లైమాక్స్‌తో సహా) సింగిల్ టేక్‌లో షూట్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక సచిన్ జిగార్, కేతన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్ పార్ట్‌లో శ్రీకాంత్ టీం, రాజీ టీం మధ్య సహజమైన యాక్షన్ సన్నివేశాలు.. రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. కథలో భాగమైన ‘ఫ్యామిలీ’ డ్రామా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇందులో తక్కువే ఉందని చెప్పొచ్చు. ఇక దేశ భక్తి, పంచ్ డైలాగులతో పాటు కథ, కథనాలు, తమిళ సీక్వెన్స్‌ను మేళవించి తొలిసీజన్ మాదిరిగానే ఫ్యామిలీమ్యాన్ 2ను ఆసక్తిిగా తీర్చిదిద్దారు రాజ్ అండ్ డీకే. -
వన్స్‌మోర్ వార్నర్.. ‘బుట్టబొమ్మ’
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రారంభమైన ఈ వన్డే సిరిస్‌కు తొలిసారి ఆడియెన్స్‌ని అనుమతించారు. సిడ్నీ, కాన్బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి వన్స్‌మోర్ వార్నర్ బుట్టబొమ్మ అంటూ కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. లాక్డౌన్ సమయంలో అన్ని టోర్నిలు నిలిచిపోవడంతో క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో టిక్‌టాక్‌లు చేస్తూ వార్నర్ కుటుంబం అభిమానులకు దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్‌బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్‌కు చేరువయ్యారు వార్నర్. ఈ నేపథ్యంలో నేడు మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ‘వన్స్‌మోర్ వార్నర్.. బుట్టబొమ్మ’ అంటూ అరిచారు. (చదవండి: జంపా.. ఆర్సీబీ గుర్తొచ్చిందా?) ఇక ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
సినిమానే సిరీస్‌గా.!
హిందీ సినిమా ‘తైష్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రయోగాత్మకంగా... ఈ సినిమా ఒకే రోజు సినిమాగా, సిరీస్‌గా విడుదలవుతుందట. పులకిత్ సామ్రాట్, జిమ్ షరాబ్, క్రితీ కర్భంధా ముఖ్య పాత్రల్లో దర్శకుడు బీజోయ్ నంబియార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘తైష్’. అక్టోబర్ 29న జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ‘తైష్’ రెండున్నర గంటల సినిమాలా, 6 ఎపిసోడ్ల మినీ సిరీస్‌లో అందుబాటులో ఉంటుందట. ఈ నిర్ణయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ –‘‘గతంలో సినిమాగా రూపొందించిన సిరీస్‌గా ఎడిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా చిత్రాన్ని థియేటర్ కోసం తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యాక టెస్ట్ స్క్రీనింగ్ (అతికొద్ది మందికి సినిమా ప్రదర్శించి ఫలితాన్ని సమీక్షించుకోవడం) నిర్వహించాం. సినిమా బావుంది. ఇందులో పాత్రల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది అని కొందరు అనడంతో సిరీస్ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను అలానే ఉంచి, సిరీస్‌గా ఎలా మలచగలం అని ఆలోచించి దానికి అనుగుణంగా ఎడిటింగ్ చేశాం. ఏది కావాలనుకున్నవాళ్లు అది ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. -
కివీస్ ఇక బిజీ బిజీ
ఆక్లాండ్: ఇన్నాళ్లూ కరోనా వల్ల సొంతగడ్డపై క్రికెట్ టోర్నీలకు దూరమైన న్యూజిలాండ్‌లో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం కానుంది. నవంబర్‌లో వెస్టిండీస్ సిరీస్ మొదలు... వరుసగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో బిజీ బిజీగా క్రికెట్ ఆడనుంది. మంగళవారం దీనికి సంబంధించిన షెడ్యూలును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందుగా కరీబియన్, పాకిస్తాన్‌లు పర్యటించేందుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని, ఆ తర్వాత ఆసీస్, బంగ్లా సిరీస్‌లకు లభిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వెల్లడించారు. తొలుత విండీస్‌తో నవంబర్ 27, 29, 30 తేదీల్లో మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 3–7, 11–15 వరకు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ఇది ముగిసిన వెంటనే పాక్‌తో 18 నుంచి మొదలయ్యే మూడు టి20ల సిరీస్‌లో పాల్గొంటుంది. అనం తరం రెండు టెస్టుల సిరీస్ డిసెంబర్ 26 నుంచి జరుగుతుంది. ఫిబ్రవరిలో ఆసీస్‌తో, మార్చిలో బంగ్లాదేశ్‌లో ముఖాముఖి సిరీస్‌లు ఉంటాయి. -
ఇక ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’
లండన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, చాపెల్–హ్యడ్లీ ట్రోఫీ, వార్న్–మురళీధరన్ ట్రోఫీ తరహాలో ఇప్పుడు మరో సిరీస్‌ను ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వ్యవహరించనున్నారు. వెస్టిండీస్– ఇంగ్లండ్ జట్ల మధ్య ఇకపై జరిగే టెస్టు సిరీస్‌లను ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’ పేరుతో వ్యవహరిస్తారు. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు స్టార్లను తగిన విధంగా గౌరవించుకునేంందుకు ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్టిండీస్–ఇంగ్లండ్ మధ్య జరిగే తర్వాతి టెస్టు సిరీస్ నుంచి ఈ ట్రోఫీ పేరును ఉపయోగిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే సిరీస్‌ను ఇప్పటి వరకు ‘విజ్డన్ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు. ‘క్రికెట్ బైబిల్’గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత మ్యాగజైన్ ‘విజ్డన్’ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1963లో ఇరు జట్ల బోర్డులు కలిపి పెట్టిన పేరు ఇన్నేళ్లు కొనసాగింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు ‘విజ్డన్ ట్రోఫీ’లో చివరిది కానుంది. -
విజయంపై విండీస్ గురి
అనూహ్య పరిస్థితుల్లో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించే అద్భుత అవకాశం వెస్టిండీస్ ముందు నిలిచింది. నాలుగో రోజు చివరి గంట ముందువరకు సాఫీగా ఇన్నింగ్స్ సాగిస్తూ పైచేయి సాధించినట్లు కనిపించిన ఇంగ్లండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ‘డ్రా’కే ఎక్కువ అవకాశాలు కనిపించిన మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు చెలరేగి ఆటను మలుపు తిప్పారు. మ్యాచ్ చివరి రోజు ఆదివారం విండీస్ ఎంత లక్ష్యాన్ని ఛేదించగలదనేది ఆసక్తికరం. సౌతాంప్టన్: శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో ఇంగ్లండ్ స్కోరు 249/3. కానీ విండీస్ బౌలర్ల విజృంభణతో అంతా మారిపోయింది. 30 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ప్రత్యర్థికి విజయావకాశాన్ని అందించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (127 బంతుల్లో 76; 8 ఫోర్లు), డామ్ సిబ్లీ (164 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 46; 6 ఫోర్లు), రోరీ బర్న్స్ (104 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఆర్చర్ (5 బ్యాటింగ్), వుడ్ (1 బ్యాటింగ్) ఉన్నారు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ 3 వికెట్లు పడగొట్టగా... జోసెఫ్, ఛేజ్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు మిగిలిన 2 ఇంగ్లండ్ వికెట్లను తొందరగా తీసి 200లోపు లక్ష్యం ఉంటే విండీస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీలక భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ స్కోరులో ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ చెప్పుకోదగ్గ స్కోరుతో తమ వంతు పాత్ర పోషించారు. నాలుగో రోజు ఆటను కొనసాగిస్తూ ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. ఈ క్రమంలో వీరిద్దరి కొన్ని చక్కటి షాట్లు ఆడారు. లంచ్‌కు కొద్ది సేపు ముందు ఎట్టకేలకు బర్న్స్‌ను అవుట్ చేసి ఛేజ్ ఈ భాగస్వామ్యానికి తెర దించాడు.తొలి సెషన్లో 30 ఓవర్లలో ఇంగ్లండ్ 64 పరుగులు చేసింది. రెండో సెషన్లో 161 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి సిబ్లీ వెనుదిరగ్గా... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి డెన్లీ (29) అవుటయ్యాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ 30 ఓవర్లలో 89 పరుగులు చేయగా, విండీస్ 2 వికెట్లు పడగొట్టగలిగింది. టీ విరామం తర్వాత క్రాలీతో కలిసి కెప్టెన్ స్టోక్స్ ధాటిగా ఆడాడు. 80 బంతుల్లో క్రాలీ అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోగా... 19వ బంతికి తొలి పరుగు తీసిన స్టోక్స్ ఆ తర్వాత జోరు పెంచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. అయితే కొత్త బంతితో విండీస్ దెబ్బ కొట్టింది. వరుస ఓవర్లలో స్టోక్స్, క్రాలీలను అవుట్ చేసి పైచేయి సాధించింది. ఆ వెంటనే బట్లర్ (9) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం బెస్ (3), పోప్ (12) లను అవుట్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 12.3 ఓవర్ల వ్యవధిలో అంతా మారిపోయింది. -
బంగ్లాదేశ్, పాకిస్తాన్ సిరీస్ రద్దు
కరాచీ: కరోనా (కోవిడ్–19) దెబ్బకు వచ్చే నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే, టెస్టు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య ఏకైక వన్డే ఏప్రిల్ 1న జరగాల్సి ఉండగా... ఫిబ్రవరిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు కొనసాగింపుగా రెండో టెస్టు ఏప్రిల్ 5 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అవి ఎప్పుడు జరుగుతాయనే విషయంపై సమాచారం లేదు. మార్చి 24 నుంచి జరగాల్సిన పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ పాకిస్తాన్ కప్ వన్డే టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఇప్పటికే కుదింపుతో సాగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్రికెట్ టోర్నీకి మరో షాక్ తగిలింది. కరోనా భయంతో ఈ లీగ్‌ను వదిలిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), డేవిడ్ వీస్ (ఆస్ట్రేలియా), సెక్కుగె ప్రసన్న (శ్రీలంక) కూడా చేరారు. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ రద్దు
సిడ్నీ: ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి రెండు వన్డేలతోపాటు మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను కూడా అర్ధంతరంగా రద్దు చేసింది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. మోచేతులను తాకించుకుంటూ అభినందించుకున్నారు. -
‘తొలి అడుగు టీమిండియా సిరీస్‌తోనే’
చెస్టర్ లీ స్ట్రీట్ : మొన్నటివరకు ఎవరికీ తెలియని నికోలస్ పూరన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో హీరో అయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో కరేబియన్ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. నికోలస్ పట్టువదలని విక్రమార్కుడిలా శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించినంత పనిచేశాడు. అయితే చివర్లో లంక బౌలర్లు రాణించడంతో ప్రపంచకప్‌లో విండీస్ వరుసగా ఆరో ఓటమి చవిచూసింది. అయితే నికోలస్ ఒంటరి పోరాటానికి విండీస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెటిజన్లు ఇప్పుడే అతడిని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారాతో పోల్చుతున్నారు. కాగా, ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో కరేబియన్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారని భావించినా అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే గెలుపుకంటే ఓటమితో ఎన్నో నేర్చుకుంటామని శతక వీరుడు నికోలస్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగబోయే సిరీస్‌లో తమ ప్రతాపాన్ని చూపుతామని నికోలస్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను ఆ సిరీస్‌లో పునరావృతం చేయబోమని, విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. (చదవండి: 8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!) ‘ప్రపంచకప్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక) గెలుపు చివరంచున బోల్తా పడ్డాము. ప్రస్తుతం జట్టులో చాలా మంది యువకులమే ఉన్నాము. ఈ టోర్నీతో చాలా నేర్చుకున్నాము. ఇక నా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడే నన్ను ఒకరితో(బ్రయాన్ లారా) పోల్చడం తగదు. టీమిండియాతో త్వరలో జరగబోయే సిరీస్‌పై దృష్టి పెడతాం. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను టీమిండియా సిరీస్‌లో పునరావృతం చేయబోము. విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం. దానికి తొలి అడుగు ఈ సిరీస్‌తోనే మొదలెడతాం’అంటూ నికోలస్ వ్యాఖ్యానించాడు. -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్: స్ప్లిట్ స్క్రీన్
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో వై సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గత వారం చైనాలో లాంచ్ చేసిన ‘వివో వై 83’ ని శుక్రవారం ఇండియన్ మార్కెట్లో ప్రారంభించింది. ఇక్కడి మార్కెట్లో దీని ధరను రూ. 14,990గా నిర్ణయించింది. ఇది దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివోఆన్లైన్ సైట్లలో లభిస్తుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభ్యం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్క్రీన్లపై మూడువేళ్లతో కిందికి స్లైడ్ చేస్తే ఈ ఫీచర్ (డబుల్ స్క్రీన్) సులభంగా యాక్టివేట్ అవుతుందని వివో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జెరోమ్ చెన్ తెలిపారు. వివో వై 83 స్పెసిఫికేషన్లు 6.22అంగుళాల హెచ్డీ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ టెక్ హీలియో పీ 20 ఎస్ఓసీ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 13ఎంపీ హై డెఫినిషన్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ -
దిగ్గజ నటుడి తప్పిదం
సాక్షి, సినిమా : సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఆచీ తూచీ చేయకపోతే.. ట్రోలింగ్ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. సరిగ్గా హాలీవుడ్ దిగ్గజం సిల్వెస్టర్ స్టాలోన్(71)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 చిత్రానికి సంబంధించి ఈ మధ్య వరుసగా లుక్కులతో పోస్టర్లను వదులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో చిత్రంలో మరో పాత్రధారి బాబీ డియోల్ ఫోటోను షేర్ చేసి టాలెంటెడ్ హీరో సల్మాన్‌కు ఖాన్‌కు బెస్ట్ విషెస్ అంటూ సందేశం ఉంచాడు. అంతే ఇక ట్రోలింగ్ బాబులు వాళ్ల పనితనం చూపిస్తూ ఈ సీనియర్ హీరోను ఎగతాళి చేస్తున్నారు. చిత్రానికి ప్రమోషన్ చేస్తే చేశారుగానీ.. ఇలా కనీస పరిజ్ఞానం లేకుండా పోస్ట్ ఎలా చేస్తారంటూ ఏకీపడేస్తున్నారు. కోట్లాది అభిమానులు ఉన్న సల్మాన్ ఎవరో స్టాల్లోన్కు తెలీదా? అంటూ కొందరు.. కనీసం సల్మాన్ పోస్ట్ చేసిన ఫోటో చూసైనా స్టాల్లోన్ ఫోటో పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ మరికొందరు సలహాలిస్తున్నారు. ఏదిఏమైనా స్టాలోన్ ఇప్పటిదాకా ఆ పోస్ట్‌ను మాత్రం డిలీట్ చేయలేదు. The very best wishes to very talented film hero SALMAN KHAN For his next film RACE 3 !@beingsalmankhan A post shared by Sly Stallone (@officialslystallone) on Mar 21, 2018 at 1:25pm PDT -
రిలీజ్ కాకముందే సీక్వెల్!
సాక్షి, సినిమా : బాలీవుడ్లో మరో సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించేశారు. భాఘీ నుంచి మరో చిత్రం రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించటం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగానే బాఘీ 3 సినిమా ఉండబోతున్నట్లు చెప్పేశారు. నిర్మాత సాజిద్ నడియా వాలా సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతోంది. బాఘీ 2 తెరకెక్కిస్తున్న అహ్మద్ ఖాన్ మూడో పార్ట్‌ను డీల్ చేయబోతున్నాడు. మిగతా తారాగణం త్వరలో ప్రకటించనున్నారు. బాఘీ మొదటి పార్ట్ తెలుగు వర్షం చిత్రం రీమేక్‌గా తెరకెక్కింది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. రెండో పార్ట్‌ను క్షణం రీమేక్‌గా అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. దిశా పఠానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. క్లాసిక్ మూవీ బేతాబ్ లో మాధురి సాంగ్ ‘ఏక్ దో తీన్’ పాట రీమిక్స్‌పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులు వేయనుంది. మార్చి 30న బాఘీ-2 విడుదల కానుంది. Drumrolls 🥁🎷 Our excitement level has just tripled! We are thrilled to share the 3rd instalment of #SajidNadiadwala’s Baaghi franchise starring @iTIGERSHROFF directed by @khan_ahmedasas#Baaghi3 @WardaNadiadwala pic.twitter.com/ijYdyIqbVs — Nadiadwala Grandson (@NGEMovies) 19 February 2018 -
ఈఎస్ఐ సంఖ్య నమోదు సీరీస్ మార్పు
హిందూపురం అర్బన్ : ఈఎస్ఐ సంఖ్య నమోదు సీరీస్ మార్పు జరిగినట్లు ఈఎస్ఐ బ్రాంచ్ అధికారి ఉబేదుల్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపప్రాంతీయ కార్యాలయం తిరుపతి పరిధిలోకొచ్చే అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నమోదైన సంస్థల ఈఎస్ఐ సంఖ్య మార్పు జరిగినట్లు తెలిపారు. ఈఎస్ఐ నమోదు సంఖ్య 52 సీరీస్‌కు బదులు 79 సీరీస్‌గా మార్చామన్నారు. ఈవిషయంలో అవసరమైన వివరాలకు ఈఎస్ఐ పోర్టల్‌లో లాగిన్ అవ్వడానికి ఇబ్బందులు ఉంటే sro-tirupathi@esic.inకు మెయిల్ చేసుకోవాలన్నారు. అలాగే మరింత సమాచారం కోసం 0877–2246187 ఫోన్ చేసి సంప్రదించొచ్చన్నారు. -
అంతులేని కథలు..
టీవీ సీరియళ్లు కొన్ని ఏళ్లకేళ్లు సాగుతుంటాయి. ఆ కథలకు అంతుండదు. ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తాయో నిర్వాహకులే చెప్పలేరు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఒకవేళ వీక్షకుల్ని ఆకట్టుకోకపోతే, ఉన్నట్టుండి సీరియల్‌ను ముగించేస్తారు. కొన్ని సీరియళ్లు, మాత్రం వీక్షకుల ఆదరణతో ఏళ్ల తరబడి సాగుతుంటాయి. మధ్యలో చిన్న విరామం తీసుకున్నప్పటికీ, అదే కాన్సెప్టుతో కూడిన కొత్త సిరీస్‌ని మళ్లీ మొదలెడతారు. దీంతో అవి దశాబ్దాలపాటు సాగుతుంటాయి. ఇలా టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. ద గైడింగ్ లైట్ (57 ఏళ్లు).. టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ ఇదే. అమెరికాకు చెందిన సీబీఎస్ చానెళ్లో ఈ సీరియల్ దాదాపు 57 ఏళ్ల పాటు ప్రసారమైంది. అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన సీరియల్ కాబట్టి, దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1952 జూన్ 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, 2009, సెప్టెంబర్ 18న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. బుల్లితెరపై ప్రసారం కాక ముందు 1937 నుంచి పదిహేనేళ్లపాటు ఇది అమెరికాలోని ఎన్బీసీ రేడియోలో టెలికాస్ట్ అయ్యింది. అటు టీవీలో, ఇటు రేడియోలో ప్రసారమైన ధారావాహికగా చూస్తే ఇది 72 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం 18,262 ఎపిసోడ్లుగా ఇది వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రారంభంలో రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే ప్రేక్షకుల ఆదరణ బావుండడంతో క్రమంగా అరగంట, గంటపాటు కూడా ప్రసారమైంది. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ సీరియల్ 2009లో ఆగిపోయింది. యాజ్ ద వరల్డ్ టర్న్స్ (54 ఏళ్లు) టీవీ ప్రేక్షకుల్ని అత్యధిక కాలం అలరించిన రెండో సీరియల్ యాజ్ ద వరల్డ్ టర్న్స్. 54 ఏళ్లపాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ 1956 ఏప్రిల్ 2న ప్రారంభమైంది. చివరి ఎపిసోడ్ 2010, సెప్టెంబర్ 17న ప్రసారమైంది. అమెరికాలోని సీబీఎస్ చానెళ్లో ఇది ప్రసారమయ్యేది. ఇర్నా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ యాజ్ ద వరల్డ్ టర్న్స్ను ‘ద గైడింగ్ లైట్’కి సిస్టర్ షోగా పిలిచేవారు. ఈ సీరియల్ ఎక్కువగా న్యూయార్క్‌లోని మన్హట్టన్లోనే షూటింగ్ జరుపుకొంది. 1956లో ఇది రోజూ మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. ఆ తర్వాత రోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మారి, అరగంట ప్రసారమయ్యేది. పన్నెండేళ్ల ప్రసారమయ్యాక వీక్షకుల ఆదరణ బావుండడంతో గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సీరియల్ పూర్తయ్యేవరకు దాదాపు 13,000 ఎపిసోడ్లు ప్రసారమైంది. జనరల్ హాస్పిటల్ (54 ఏళ్లు).. 1963 ఏప్రిల్ 1న తొలిసారిగా ప్రారంభమైన ఈ అమెరికన్ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతుండడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 54 ఏళ్లుగా జనరల్ హాస్పిటల్ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకుని, తర్వాత కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీవీ హిస్టరీలో అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్గానే కాక, అత్యధిక కాలం నిర్మాణంలో ఉన్న సీరియల్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఫ్రాంక్ అండ్ డోరిస్ హర్స్‌లీ అనే దంపతులు దీనికి రచన చేశారు. పోర్ట్ చార్లిస్ అనే ఒక కల్పిత నగరంలోని హాస్పిటల్ నేపథ్యంగా ఈ సీరియల్ సాగుతుంది. 2003లో టీవీ గైడ్ అనే ఓ సంస్థ జనరల్ హాస్పిటల్‌ను సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ (44 ఏళ్లు).. అమెరికాలోని సీబీఎస్ చానళ్లో ప్రసారమవుతున్న ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ 44 ఏళ్లుగా కొనసాగుతుండడం విశేషం. తొలి ఎపిసోడ్ 1973 మార్చి 26న ప్రసారమైంది. అప్పటినుంచి 1980 వరకు వారానికి ఐదు రోజుల చొప్పున, రోజూ అరగంటపాటు ఇది ప్రసారమయ్యేది. అనంతరం ప్రసార సమయం గంటకు పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ 11 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం స్థానిక చానళ్లలో ఇది ప్రసారమవుతోంది. విస్కన్సిన్ రాష్ట్రంలోని జినోవా అనే ఒక కల్పిత నగరంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతోంది. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ (51 ఏళ్లు).. 1965లో తొలిసారిగా ప్రసారమైన డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అమెరికాలోని ఎన్బీసీ చానళ్లో 1965, నవంబర్ 8న ఈ సీరియల్ ప్రారంభమైంది. 51 ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 13,032 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1965 నుంచి 1975 వరకు తొలుత రోజు అరగంట మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ప్రేక్షకాదరణ బావుండడంతో 1975 ఏప్రిల్ 21 నుంచి రోజూ అరగంటపాటు ప్రసారమయ్యేది. సాలెమ్ అనే ఒక కల్పిత నగరంలో ఉండే కొన్ని కుటుంబాలు, వారి మధ్య సంఘర్షణలతో ఈ సీరియల్ రూపొందింది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇది ప్రసారమైంది. 2013 వరకు ఆన్లైన్లో డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ రీ టెలికాస్ట్ అయ్యేది. వన్ లైఫ్ టు లివ్ (45 ఏళ్లు).. ఇది కూడా అమెరికన్ సీరి యలే. 1968 నుంచి 2012 వరకు దాదాపు 45 ఏళ్లపాటు ఇది ప్రసారమైంది. అమెరికాలోని ఏబీసీ చానళ్లో 1968 జూలై 15న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, చివరి ఎపిసోడ్ 2012 జనవరి 13న ప్రసారమైంది. కానీ చివరి సిరీస్‌ను 2013 ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఆన్లైన్లో ప్రసారం చేశారు. పెన్సిల్వేనియాలోని లియాన్ వ్యూ అనే ఒక కల్పిత నగరంలోని కొంత మంది వ్యక్తుల జీవితంలోని సంఘటనల ఆధారంగా వన్ లైఫ్ టు లివ్ సాగుతుంది. 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించి, అత్యధిక కాలం ప్రసారమైన ఐదో సీరియల్‌గా నిలిచింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మనమేం సిరీస్ కోల్పోలేదు: సచిన్
న్యూఢిల్లీ: తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసి విమర్శల పాలౌతున్న టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అండగా నిలిచారు. ఆదివారం ఢిల్లీలో 21 కిలోమీటర్ల మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. టీమిండియా ఓటమిపై స్పందించారు. 'మనమేం సిరీస్ కోల్పోలేదు. ఒక ఓటమి ఎదురైనంతమాత్రాన మాత్రాన తిరిగి పోరాడలేమని కాదు' అని సచిన్ పేర్కొన్నారు. భారత జట్టులో మంచి పోరాటపటిమ ఉందని.. మిగిలిన మ్యాచ్‌ల్లో పుంజుకొని ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి?
మెల్బోర్న్:గడిచిన ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన భారత క్రికెట్ జట్టును కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే నెల్లో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనున్న నేపథ్యంలో ఆ జట్టు అప్పుడే కసరత్తులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 'ఆట' ఏమిటో చూస్తాం? అంటూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మైండ్ గేమ్‌కు తెరలేపాడు. ఆసీస్ కెప్టెన్ మాటలే భారత పర్యటనను ఆ జట్టు ఎంత సిరీయస్‌గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. 2016లో స్వదేశంలో జరిగిన సిరీస్ ల్లో భారత్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్లను భారత్ కంగుతినిపించిన తరుణంలో తమ వ్యూహాన్ని మరింత మెరుగుపరుచుకునే ఇక్కడ అడుగుపెట్టాలని ఆసీస్ భావిస్తోంది. దీనిలో భాగంగా తొలుత దుబాయ్‌లోని ప్రాక్టీస్ పిచ్‌లపై ఆడాలని ఆసీస్ యోచిస్తోంది. ఈ రకంగా దుబాయ్‌లో కొంతవరకూ ప్రాక్టీస్ లభిస్తే, భారత్ లో పిచ్‌లపై ఆడటం సులభతరం అవుతుందని ఆసీస్ జట్టు అధికారుల భావనగా ఉంది. 2004 నుంచి భారత్ గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన ఆసీస్.. 2013లో చివరిసారి భారత్ లో పర్యటించి ఆడిన నాలుగు టెస్టులను చేజార్చుకుంది మరొకసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే సమగ్రమైన ప్రణాళికతోనే భారత్ రావాలనుకుంటుంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్‌ను కట్టడి చేయాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన అవసరం. ఆ క్రమంలోనే దుబాయ్‌లో ప్రాక్టీస్‌కు మొగ్గు చూపుతుంది. 'అన్ని చోట్ల భారత్ తరహా పిచ్‌లు ఉండవు. దుబాయ్‌లోని భిన్నమైన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తే మాకు చాలా వరకూ ప్రిపరేషన్ లభిస్తుంది' అని ఆసీస్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ పేర్కొన్నారు. దుబాయ్ లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రూపొందించిన పిచ్‌లు చాలా బాగున్నాయంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం అక్కడ స్పిన్ పిచ్లే కాదు.. ఆ పిచ్‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయంటూ కితాబిచ్చారు. దాదాపు దుబాయ్‌లో ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైన ఆసీస్.. టీమిండియా మొత్తం జట్టుపై దృష్టి పెట్టింది. తమ టార్గెట్ రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు మాత్రమే కాదని, ఓవరాల్‌గా భారత్ జట్టును ఎలా కట్టడి చేయాలనే దానిపైనే వ్యూహరచన సాగుతుందని హోవార్డ్ అన్నారు. -
రూపాయికి ఫివర్.. మార్కెట్లకూ దెబ్బ
డెరివేటివ్‌ల సిరీస్ ముగింపు సెషన్లో 2013 ఆగస్టు తర్వాత మొదటిసారి దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్ 191.64 పాయింట్లు నష్టపోయి 25,860.17 వద్ద, నిఫ్టీ 67.80 పాయింట్ల నష్టంతో 7965.50 పాయింట్ల వద్ద ముగిసింది. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టాటా స్టీల్ గురువారం ట్రేడింగ్‌లో లాభాలనార్జించగా... టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, మహింద్రా అండ్ మహింద్రాలు నష్టాలు గడించాయి. గ్లోబల్ మార్కెట్లో అమెరికా కరెన్సీ డాలర్ పుంజుకోవడంతో గురువారం రూపాయి భారీ స్థాయిలో పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో 30 పైసలు నష్టపోయిన రూపాయి ఆల్ టైమ్ కనిష్టా స్థాయికి చేరింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి, భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేపట్టడంతో రూపాయి కొంత కోలుకుని, 18 పైసల నష్టంతో 68.74వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న అవుట్‌ఫ్లోస్‌తో రూపాయి విలువ భారీ స్థాయిలో పడిపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో రూపాయి విలువ 70కి పడిపోయిన ఆశ్చర్యం లేదని పేర్కొంటున్నారు. ఇటు డాలర్ విలువ బలపడుతుండటంతో పాటు దేశీయంగా నోట్ల బ్యాన్ కొనసాగుతుండటంతో బంగారం ధరలు కూడా దిగొస్తున్నాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 106 రూపాయిల నష్టపోయి 28,723గా నమోదైంది. -
సిరీస్‌పై కన్నేసిన భారత్
విండీస్ మహిళలతో రెండో వన్డే నేడు సాక్షి, విజయవాడ స్పోర్ట్స: తొలి వన్డే విజయంతో జోరుమీదున్న భారత మహిళల జట్టు మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే రెండో వన్డేలో విజయం సాధించాలనే లక్ష్యంతో మిథాలీ సేన బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌తో పాటు వేద ఫామ్‌లో ఉంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఒత్తిడి విండీస్ జట్టుపై వుంది. దీంతో పాటు ఒక్క మ్యాచ్ గెలిచినా... ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశమూ వెస్టిండీస్‌ను ఊరిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచకప్‌కి అర్హత సాధించింది. -
వన్డేల్లోనూ పని పట్టాలి
రేపు కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్ దూకుడు కొనసాగిస్తామన్న రహానే ధర్మశాల: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో చిత్తు... ఆ తర్వాత జింబాబ్వేపై 3-0తో ఘన విజయం... 2016లో భారత వన్డే జట్టు రికార్డు ఇది. ఈ సంవత్సరం మన జట్టు చెప్పుకోదగ్గ సంఖ్యలో వన్డేలు ఆడకపోగా, తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగుతోంది. టెస్టుల్లో కివీస్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత అలాంటి ప్రదర్శనను కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. పైగా కోహ్లి నాయకత్వ పటిమతో ఇప్పుడు ధోనిపై కూడా అదే స్థారుులో అంచనాలు ఉండటంతో పాటు అతనిపై కూడా ఒత్తిడి ఉండటం ఖాయం. పూర్తిగా జూనియర్లతో జింబాబ్వేలో విజయవంతంగా జట్టును నడిపించినా... గత ఏడాది భారత్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవాన్ని అతను మర్చిపోకపోవచ్చు. టెస్టు టీమ్‌తో పోలిస్తే సౌతీ, అండర్సన్‌లాంటి స్పెషలిస్ట్‌లు జట్టులోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచగా... మన జట్టు కీలక బౌలర్లు అశ్విన్, షమీలకు వన్డేలనుంచి విశ్రాంతినిచ్చింది. ఆఖరి సారిగా న్యూజిలాండ్ గడ్డపై ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోరుుంది. ర్యాంకుల్లో కివీస్ జట్టు మనకంటే ఒక స్థానం ముందే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొంది. కెప్టెన్ ధోని, కోహ్లిలతో పాటు జట్టు సభ్యులంతా నెట్స్‌లో పాల్గొన్నారు. తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ఎక్కువ సేపు బౌలింగ్ చేశాడు. అశ్విన్ గైర్హాజరులో అతను మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. ‘టెస్టుల్లాగే వన్డేల్లోనూ దూకుడుగా ఆడతాం. మా బలమేంటో మాకు బాగా తెలుసు. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాం. వన్డేలకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం సమస్య కాదు. కొత్తగా జట్టుతో చేరిన కుర్రాళ్లు సత్తా చాటుతారని నమ్ముతున్నా’ అని మ్యాచ్ సందర్భంగా భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. భారత్‌లోనే ఇతర మైదానాలతో పోలిస్తే ధర్మశాల మరీ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలం కాదు. పేసర్లకు ఈ పిచ్ చక్కగా అనుకూలిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే కివీస్‌కు కూడా ఒక రకంగా అనుకూల మైదానం ఇది. ఈ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. 2013లో ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్లతో ఓడగా... 2014లో వెస్టిండీస్‌పై 59 పరుగులతో నెగ్గింది. -
బీసీసీఐ స్పందించలేదు!
ఇండోర్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ పై పలు అనుమానాలు తలెత్తాయి. మరోవైపు కివీస్, భారత్ మధ్య జరగనున్న చివరిదైన మూడో టెస్టుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ టెస్టు నిర్వహణపై ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎంపీసీఏ కార్యదర్శి మిలింద్ కన్మాడికర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 8న ఇండోర్ లోని హోల్కర్ స్డేడియంలో చివరి టెస్టును నిర్వహించనున్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు తమకు బీసీసీఐ నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు అందలేదని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన ఆర్ఎం లోథా కమిటీ తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేసిందని బీసీసీఐ ఆరోపించింది. అయితే బ్యాంకు ఖాతాల నిలుపుదల చేయలేదని లోథా కమిటీ ఓ ప్రకటనలో తెలపడంతో మూడో టెస్టుపై నీలినీడలు తొలిగిపోయాయి. గతంలో బీసీసీఐకి ఇలాంటి సంకట పరిస్థితులు ఎదురుకాలేదు. లోథా కమిటీ సిఫార్సులు అమలుచేయడం కష్టతరమని బీసీసీఐ మొదటినుంచీ చెబుతూనే ఉంది. -
కివీస్ తో సిరీస్ కు ఢోకా లేదు!
-
కివీస్ తో సిరీస్ కు ఢోకా లేదు!
ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం నూజిలాండ్ తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ సిరీస్ ను పూర్తిగా రద్దు చేయాల్సి వస్తుందనే సంకేతాలు వెళ్లాయి. ఇందుకు కారణం బీసీసీఐ అకౌంట్లను రద్దు చేయాలంటూ బ్యాంకులకు లోధా కమిటీ సూచించినట్లు వార్తలు రావడమే. దానిలో భాగంగానే రోజువారీ నిధులను కూడా ఆపమని చెప్పలేదని లోధా తాజా ప్రకటనలో పేర్కొంది. అవసరమైతే బ్యాంకులకు రాత పూర్వకంగా వివరణ ఇస్తామని ఈ మేరకు లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. గత శుక్రవారం జరిగిన ఎస్ జీఎంలో తన అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. అయితే ఇది తమ ప్రతిపాదనలకు వ్యతిరేకం కావడంతో బీసీసీఐ అకౌంట్లను నిలుపుదల చేయాలంటూ లోధా ప్యానెల్ ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో కివీస్-భారత్ ల సిరీస్ అనేక సందేహాలు చోటు చేసుకున్నాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు కూడా సిరీస్ రద్దు విషయాన్ని ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రతీ రోజూ తాము ఏమీ చేయాలో చెప్పడానికి లోధా కమిటీ ఏర్పడలేదని బీసీసీఐ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, దీనిపై వెంటనే లోధా కమిటీ స్పందించడంతో సిరీస్ పై అలుముకున్న నీలి నీడలకు ముగింపు దొరికింది. దాంతో పాటు వచ్చే ఏడాది ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు పాల్గొనడంపై కూడా సందిగ్ధత ఏర్పడటంతో లోధా కమిటీ వివరణ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు చాంపియన్స్ ట్రోఫీ కాల వ్యవధి పెద్దగా లేకపోయినా ఇది ముందుస్తు షెడ్యూల్ కాబట్టి ఆ రెండు సిరీస్ ల్లోనూ భారత్ పాల్గొనవచ్చని లోధా తెలిపింది. -
మరో వైట్‌వాష్ తప్పదా?
షార్జా: గత కొన్ని నెలల క్రితం భారత్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చాంపియన్ గా నిలిచింది. అయితే అప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం విండీస్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. పలువురు ప్రధాన ఆటగాళ్లపై వేటు ఒక కారణమైతే, మరికొంతమంది గైర్హాజరీ ఆ జట్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేసింది. యూఏఈలో పాకిస్తాన్ తో జరుగుతున్న దైపాక్షిక సిరీసే ఇందుకు ఉదాహరణ. ఇరు జట్ల సుదీర్ఘ సిరీస్ లో విండీస్ అత్యంత పేలవంగా ఆడుతోంది. పాకిస్తాన్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్‌లో వైట్ వాష్ అయిన వెస్టిండీస్.. మూడు వన్డేల సిరీస్ లో కూడా అదే ఆట తీరును కనబరుస్తోంది. జాసన్ హోల్డర్ నాయకత్వంలో పాక్ తో సిరీస్‌లు ఆడుతున్న విండీస్ ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో విండీస్ 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డారెన్ బ్రేవో, మార్లోన్ శ్యామ్యూల్స్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. టాస్ గెలిచిన పాకిసాన్ తొలుత బ్యాటింగ్ తీసుకుని 337 పరుగులు చేసింది. ఆ జట్టులో బాబర్ అజామ్(123) సెంచరీ సాధించడంతో పాటు, షోయబ్ మాలిక్ (90), సర్ఫరాజ్ అహ్మద్(60)లు రాణించడంతో పాక్ భారీ స్కోరు నమోదు చేసింది. అయితే అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 278 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో వన్డే సిరీస్ ను కూడా చేజార్చుకున్న విండీస్ మరో వైట్ వాష్ దిశగా కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరుగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్ ఎంతవరకు రాణిస్తుందో? -
ఆస్ట్రేలియాదే చివరి వన్డే
సెంచరీతో గెలిపించిన వార్నర్ శ్రీలంకపై 4-1తో సిరీస్ విజయం పల్లెకెలె: శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో పరువు నిలబెట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 40.2 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. గుణతిలక (39), ధనంజయ (34), కుషాల్ మెండిస్ (33), పతిరణ (32) ఓ మోస్తరుగా ఆడారు. మిషెల్ స్టార్క్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, హెడ్, జంపా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (126 బంతుల్లో 106; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక గడ్డపై వన్డేల్లో ఒక ఆసీస్ ఆటగాడు సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. వార్నర్, బెరుులీ కలిసి మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి ఆసీస్ విజయాన్ని సునాయాసం చేశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డేలో మాత్రమే లంక నెగ్గింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6, 9 తేదీల్లో రెండు టి20 మ్యాచ్‌లు జరుగుతారుు. -
జింబాబ్వే చేరుకున్న ధోని సేన
హరారే: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు గురువారం జింబాబ్వేకు చేరుకుంది. పదహారు మంది సభ్యుల భారత క్రికెట్ బృందం మంగళవారం జింబాబ్వే పయనమైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ మేరకు ధోని అండ్ గ్యాండ్ జింబాబ్వే చేరుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్విట్టర్ అకౌంట్లో స్పష్టం చేసింది. జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లను ఆడనుంది. ఇరు జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 వరకూ వన్డే సిరీస్, 18 వ తేదీ నుంచి 22 వరకూ టీ 20 సిరీస్ జరుగనుంది.జూన్ 11న తొలి వన్డే, జూన్ 13న రెండో వన్డే, జూన్ 15న మూడో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టీ20 జూన్ 18న, రెండో టీ20 జూన్ 20న, మూడో టీ20 జూన్ 22న జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో నిర్వహించనున్నారు. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వార్నర్!
సొంతగడ్డపై భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్... గత కొంతకాలంగా మోకాలి, తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చి వార్నర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్ల బృందం భావిస్తోంది. జనవరిలో జరిగే ఆసీస్ పర్యటనలో భారత్... ఐదు వన్డేలు, మూడు టి20లు ఆడుతుంది. -
పాక్‌తో చర్చలు జరుపుతాం
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వ్యాఖ్య న్యూఢిల్లీ: డిసెంబరులో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య సిరీస్ జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. ఈ విషయం గురించి అక్టోబరు 25 తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు చర్చలు జరుపుతారని చెప్పారు. ‘చర్చల కోసం భారత్‌కు వచ్చిన షహర్యార్ ఖాన్ బృందానికి మేం మంచి ఆతిథ్యం ఇచ్చాం. ఊహించని పరిణామాల వల్ల చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబరు 25న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు సమావేశమై సిరీస్ గురించి చర్చిస్తారు’ అని శుక్లా తెలిపారు. అటు పాక్ బోర్డు అధికారులు కూడా బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు అందాయని తెలిపారు. బీసీసీఐలో అంబుడ్స్‌మన్ ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పారదర్శకతను పెంచేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 9న జరిగే ఏజీఎమ్‌లో దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇకపై బోర్డులో పదవుల్లో ఉన్న ఎవరైనా ఎలాంటి నిబంధనలను అతిక్రమించినా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తలెత్తినా ఈ అంబుడ్స్‌మన్ వాటిని పరిశీలిస్తుంది. అలాగే ఇకపై సెలక్షన్ కమిటీ ఎంపిక తర్వాత ఆ జట్టును అధ్యక్షుడు ఆమోదించాల్సిన అవసరం లేకుండా నిబంధనలను మార్చనున్నారు. ఇకపై రాష్ట్రాల సంఘాలు ఆడిట్ చేసిన అకౌంట్స్‌ను అప్పగిస్తేనే తర్వాతి ఏడాదికి నిధులు ఇస్తారు. ఇలా అనేక అంశాలపై మార్పులు, చేర్పులను 9న జరిగే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. -
కాన్పూర్‌లో స్లో వికెట్
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే రేపు కాన్పూర్: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం కాన్పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు స్లో వికెట్ సిద్ధంగా ఉంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో పిచ్ స్వభావాన్ని మార్చడం కష్టమని స్థానిక క్యురేటర్ చెబుతున్నారు. తొలి వన్డేలో భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉందని, స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తొలి వన్డే డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం కూడా ఉండదు. వన్డే సిరీస్ షెడ్యూల్ అక్టోబరు 11: తొలి వన్డే, కాన్పూర్ 14: రెండో వన్డే, ఇండోర్ 18: మూడో వన్డే, రాజ్‌కోట్ 22: నాలుగో వన్డే, చెన్నై 25: ఐదో వన్డే, ముంబై -
ఆఫ్ ద ఫీల్డ్
ఆట మారినా అదే ‘శైలి’ దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటల పాటు మన క్రికెటర్లు బ్యాడ్మిం టన్ ఆడుతున్నారు. అయితే ఒకరితో ఒకరు కాకుండా... చిన్నస్వామి స్టేడియంలోని బ్యాడ్మింటన్ క్లబ్ సభ్యులతో కలిసి ఆడుతున్నారు. ధోని, కోహ్లి వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం బ్యాడ్మిం టన్ ఆడారు. అయితే ఆట మారినా వీళ్ల శైలి మాత్రం మారలేదు. ధోని తన ఆటతీరులో ఎక్కువగా డ్రాప్స్, ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు సాధించాడు. క్రికెట్లో సింగిల్స్ దొంగిలించే తరహాలో ఇక్కడా పాయింట్లు రాబట్టాడు. దీనికి భిన్నంగా కోహ్లి దూకుడు ప్రదర్శిం చాడు. స్మాష్‌ల ద్వారానే పాయింట్లు సాధిం చే ప్రయత్నం చేశాడు. ప్రతి పాయిం ట్నూ వేగంగా ముగించాలనే తపనతో ఆడాడు. ఇషాంత్, భువనేశ్వర్, ధావన్, అశ్విన్, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, మురళీ విజయ్ కూడా తమ కెప్టెన్లతో పాటు బ్యాడ్మిం టన్ ఆడుతూ కనిపించారు. -
షెహదత్ స్థానంలో రూబెల్
భారత్‌తో సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన ఢాకా: భారత్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. పాక్‌తో తొలి టెస్టులో విఫలమైన రూబెల్ హుస్సేన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయంతో దూరమైన షెహదత్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. ఫిట్నెస్ పరీక్షలో రూబెల్తో పాటు వివిధ గాయాలతో బాధపడుతున్న తమీమ్, షకీబ్, ముఫ్ఫికర్ పాస్ కావడంతో జట్టులో చోటు కల్పించారు. జట్టు: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, కైస్, మోమినుల్, మహ్మదుల్లా, షకీబ్, సౌమ్య, శువుగుటా హొమ్, తైజుల్, షాహిద్, రూబెల్, జుబేర్, లిట్టన్ దాస్, అబుల్ హసన్. -
సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడమే మా లక్ష్యం
-
టెస్టుల నుంచి ధోని తప్పుకుంటున్నాడా?
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత టెస్టు క్రికెట్‌కు భారత కెప్టెన్ ధోని గుడ్‌బై చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. 2012లో ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం తర్వాత... ‘ఏదో ఒక ఫార్మాట్ నుంచి త్వరలో తప్పుకుంటాను’ అని ధోని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్‌లో ఆదివారం మ్యాచ్ తర్వాత ‘నేను గరిష్టంగా ఏం చేయగలనో అది చేశాను. ఇంకా జట్టును ముందుకు తీసుకెళ్లేంత దృఢంగా ఉన్నానా, లేదా అనేది వేచి చూడండి. ఓ వార్త కోసం మీరు ఎదురు చూడాల్సిందే’ అని ధోని వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం కోల్పోవడమే సిరీస్‌లో ఓటమికి ప్రధాన కారణమని ధోని విశ్లేషించాడు. ‘కచ్చితంగా ఈ ఫలితం తీవ్ర నిరాశను కలిగించింది. 150 పరుగులు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేలేం. సిరీస్ ఆసాంతం మా బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడిలో ఆడారు. ఆత్మవిశ్వాసం కోల్పోయారు. చాలామంది కుర్రాళ్లు భారత్ బయట టెస్టులు ఆడలేదు. దీని నుంచి వారు భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటారు’ అని ధోని అన్నాడు. -
ఆఖరి అవకాశం!
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్ 0-4తో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సొంత గడ్డపై కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఒకేసారి ఆ రెండింటికీ ప్రతీకారం తీర్చుకుంటామనే పట్టుదల ఈ సిరీస్‌కు ముందు భారత యువ జట్టులో కనిపించింది. ఇంగ్లండ్ పేలవమైన ఫామ్‌లో ఉండటం అందుకు కారణమైంది. ఇక లార్డ్స్‌లో విజయం సాధించగానే భారత్ తిరుగులేని స్థితిలో నిలిచినట్లు అనిపించింది. అయితే... ఒక్కసారిగా ధోని సేన సుడి మారిపోయింది! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏదీ కలిసి రాలేదు. దాంతో వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఫలితంగా మన జట్టు ఆత్మవిశ్వాసం అడుగంటితే... ప్రత్యర్థి మాత్రం అమితోత్సాహంతో ఉంది. ఇకపై సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కనీసం సమం చేసినా భారత్ పరువు నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిరీస్ కోల్పోలేదన్న సంతృప్తి దక్కుతుంది. అలా జరగాలంటే ఇప్పుడు ఆఖరి అవకాశం జట్టు ముంగిట నిలిచింది. అయితే ఏ ఒక్కరో కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తేనే అది సాధ్యమవుతుంది. ►ధోని సేన సత్తాకు పరీక్ష ►తీవ్ర ఒత్తిడిలో భారత్ ►సిరీస్‌పై ఇంగ్లండ్ గురి నేటినుంచి ఆఖరి టెస్టు మ.గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం లండన్: ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ ధోని బృందం నేటినుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు సమాయాత్తమైంది. సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలన్నా... ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపు మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా సిరీస్‌ను గెలుచుకునే స్థితిలో ఇంగ్లండ్ ఉంది. ఆటగాళ్ల ఫామ్‌తో పాటు తుది జట్టు కూర్పు వరకు టీమిండియా సమస్యల్లో ఉండగా... కుక్ సేన మాత్రం వరుస విజయాలు ఇచ్చిన జోరుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇషాంత్ ఖాయం... లార్డ్స్‌లో సంచలన బౌలింగ్ తర్వాత గాయంతో రెండు టెస్టులకు దూరమైన ఇషాంత్ ఈ టెస్టు బరిలోకి దిగనున్నాడు. మేనేజ్మెంట్ ఈ విషయాన్ని నిర్ధారించింది. రెండు రోజుల పాటు అతను ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. పంకజ్ సింగ్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. ఇషాంత్ వస్తే భువనేశ్వర్, ఆరోన్లతో కలిసి జట్టు పేస్ బౌలింగ్ పదునెక్కుతుంది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో ఆడనున్నట్లు ధోని ప్రకటించాడు. ముగ్గురు పేసర్లతో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటాడు. అయితే ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానంలో స్టువర్ట్ బిన్నీని తీసుకురావచ్చని అంచనా. ప్రాక్టీస్ సెషన్లో బిన్నీ సుదీర్ఘంగా సాధన చేయడం కూడా దీనికి సంకేతంగా చెప్పవచ్చు. మరోవైపు గంభీర్, ధావన్‌లలో ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. మొదటి మూడు టెస్టులు ధావన్ ఆడాడు కాబట్టి... గంభీర్‌కే మరో చాన్స్ ఇవ్వవచ్చని వినిపిస్తోంది. లార్డ్స్‌లో ఆకట్టుకున్న రహానే తర్వాతి రెండు టెస్టుల్లో రాణించలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అన్నింటికి మించి పుజారా, కోహ్లిల ప్రదర్శనపైనే జట్టు విజయావకాశాలు ఉన్నాయనేది స్పష్టం. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గౌరవప్రదంగా సిరీస్ ముగించవచ్చు. రాబ్సన్ మినహా... మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. జట్టులోని ఆటగాళ్లలో ఓపెనర్ రాబ్సన్ మినహా అందరూ ఏదో ఒక దశలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టులో రాణించినా... కుక్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే ఈ సారైనా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్న గ్యారీ బ్యాలెన్స్, ఫామ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ జో రూట్ బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. సీనియర్ బెల్‌తో పాటు కీపర్ బట్లర్ బ్యాటింగ్ కూడా కీలకం కానుంది. తన స్పిన్‌తో భారత బ్యాటింగ్ పనిపట్టిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఈసారి అతను రాణిస్తాడని ఇంగ్లండ్ ఆశిస్తోంది. రాబ్సన్ విఫలమవుతున్నా... విజయాల జట్టును మార్చే ఆలోచన ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు లేదు. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ మ్యాచ్ ఆడనున్నాడు. ముఖానికి ప్లాస్టర్ ఉన్నా... అతను ఎలాంటి అసౌకర్యం లేకుండా గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇక టీమిండియాపై మైదానంలోనూ, బయటా సమస్యగా మారిన అండర్సన్‌పై ఆ జట్టు ఎంతో ఆధారపడుతోంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, ఆరోన్, ఇషాంత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బ్యాలెన్స్, ఇయాన్ బెల్, రూట్, మొయిన్ అలీ, బట్లర్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోర్డాన్. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో పాటు అండర్సన్కూ మంచి రికార్డు లేకపోవడం భారత్‌లో ఉత్సాహం నింపే అంశం. గత నాలుగేళ్లలో ఓవల్‌లో ఇంగ్లండ్ ఒక్కటే టెస్టు నెగ్గింది. 2010 నుంచి ఆ జట్టుకు ఇతర వేదికల్లో ఎక్కడా ఇలాంటి పేలవ రికార్డు లేదు. ఈ మైదానంలో అండర్సన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్లు తీయలేకపోయాడు. ఇక్కడ గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అతను ఒకేసారి రెండుకు మించి వికెట్లు తీయగలిగాడు. మరోవైపు ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే భారత్‌కు ఓవల్‌లోనే కాస్త మెరుగైన రికార్డు ఉంది. పైగా ప్రపంచంలోని ఏ గ్రౌండ్లో కూడా భారత్ ఇన్ని (7) మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించలేదు. గత ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఏదో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ కనీసం 400 పరుగులు దాటగలిగింది. పిచ్ ఓవల్ పిచ్ గతంలో స్పిన్‌కు బాగా అనుకూలించినా ఇటీవల ఆ పరిస్థితి లేదు. అయితే నాలుగో టెస్టుతో పోలిస్తే ఇక్కడ వేగం, బౌన్స్ తక్కువ. భారత జట్టుకు ఇది అనుకూలాంశమనే చెప్పాలి. వాతావరణం గురువారం ఒక్కసారిగా వర్షం రావడంతో భారత్ ప్రాక్టీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. టెస్టు జరిగే సమయంలో కూడా వర్షానికి అవకాశం ఉన్నా... మ్యాచ్‌కు అంతరాయం కలగకపోవచ్చు. -
That follow a logical rule..!
NUMBER SERIES Series is divided into two types. One is Number series and another one is Letter series. In Bank clerk exams 5 questions are covering from number series. Number series tests present numerical sequences that follow a logical rule which is based on elementary arithmetic. An initial sequence is given from which the rule is to be deduced. You are then asked to predict the next number that obeys the rule. Practice Questions Directions(1-5): What should come in place of question mark (?) in the following number series. (SBI Clerk 6-1-2008) 1. 12, 6.5, 7.5, 12.75, 27.5, 71.25, ? 1) 225.75 2) 216.75 3) 209.75 4) 236.75 5) 249.75 2. 16, 24, 36, 54, 81, 121.5, ? 1) 182.25 2) 174.85 3) 190.65 4) 166.55 5) 158.95 3. 12, 12, 18, 45, 180, 1170, ? 1) 13485 2) 14675 3) 15890 4) 16756 5) 12285 4. 22, 23, 27, 36, 52, 77, ? 1) 111 2) 109 3) 113 4) 117 5) 115 5. 16, 14, 24, 66, 256, 1270, ? 1) 8564 2) 5672 3) 4561 4) 7608 5) 6340 Directions (6-10) In the following number series, a wrong number is given. Find out that wrong number. (SBI Clerk 10-2-2008) 6. 2, 11, 38, 197, 1172, 8227, 65806 1) 11 2) 38 3) 197 4) 1172 5) 8227 7. 16, 19, 21, 30, 46, 71, 107 1) 19 2) 21 3) 30 4) 46 5) 71 8. 7, 9, 16, 25, 41, 68, 107, 173 1) 107 2) 16 3) 41 4) 68 5) 25 9. 4, 2, 3.5, 7.5, 26.25, 118.125 1) 118.125 2) 26.25 3) 3.5 4) 2 5) 7.5 10. 16, 4, 2, 1.5, 1.75, 1.875 1) 1.875 2) 1.75 3) 1.5 4) 2 5) 4 Directions (11-13): What will come in place of the question mark (?) in the following number series? (Union Bank of India 6-2-2011) 11. 17, 98, 147, 172, 181, ? 1) 180 2) 192 3) 184 4) 182 5) None of these 12. 11, 19, 31, 47, 67, ? 1) 80 2) 81 3) 86 4) 96 5) None of these 13. 748, 460, 316, 244, 208, ? 1) 180 2) 190 3) 172 4) 182 5) None of these Directions (14-16): What will come in place of the question mark (?) in the following number series. 14. 12, 16, 24, 36, 52, ? 1) 80 2) 76 3) 72 4) 82 5) None of these 15. 17, 21, 37, 73, 137, ? 1) 246 2) 236 3) 217 4) 237 5) None of these 16. 620, 412, 308, 256, 230, ? 1) 217 2) 227 3) 207 4) 234 5) None of these Directions (17-18): What will come in place of the question mark (?) in the following number series. (Bank of Baroda 6-6-2010) 17. 153, 150, 144, 132, 108, ? 1) 60 2) 84 3) 54 4) 72 5) None of these 18. 31, 40, 58, 85, 121, ? 1) 166 2) 175 3) 157 4) 184 5) None of these Directions (19-23): What should come in place of the question mark (?) in the following number series? 19. 36, 37, 46, 71, ? 201, 322 1) 120 2) 107 3) 135 4) 96 5) None of these 20. 12, 20, 100, ? 8900, 88900, 888900 1) 1000 2) 900 3) 800 4) 500 5) None of these 21. 7, 7, 14, 42, 168, ?, 5040 1) 672 2) 850 3) 740 4) 800 5) None of these 22. 21, 30, 12, 39, 3, ?, -6 1) 66 2) 12 3) 48 4) 75 5) None of these 23. 10, 24, 52, ?, 220, 444, 892 1) 104 2) 98 3) 112 4) 108 5) None of these Solutions 4. Ans: 3 Here given number series is based on the following pattern 22 + 12 = 22 + 1 = 23 23 + 22 = 23 + 4 = 27 27 + 32 = 27 + 9 = 36 36 + 42 = 36 + 16 = 52 52 + 52 = 52 + 25 = 77 and 77 + 62 = 77 + 36 = 113 5. Ans: 4 The given number series is based on the following pattern 16 ´ 1 – 2 = 14 14 ´ 2 – 4 = 24 24 ´ 3 – 6 = 66 66 ´ 4 – 8 = 256 256 ´ 5 – 10 = 1270 and 1270 ´ 6 – 12 = 7608 6. Ans: 4 The series is based on the following pattern 2 ´ 3 + 5 = 11 11 ´ 4 – 6 = 38 38 ´ 5 + 7 = 197 197 ´ 6– 8 = 1174 : it is not 1172 1174 ´ 7 + 9 = 8227 8227 ´ 8 ´ 10 = 65806 Clearly 1172 is the wrong number and it should be replaced by 1174 7. Ans: 1 The series is based on the following pattern 16 + 12 = 17 but not 19 17 + 22 = 21 21 + 32 = 30 30 + 42 = 46 46 + 52 = 71 71 + 62 = 107 Clearly 19 should be replaced by 17 8. Ans: 4 The series is based on the following pattern. 7 + 9 = 16 9 + 16 = 25 25 + 41 = 66 but not 68 41 + 66 = 107 66 + 107 = 173 So 68 should be replaced by 66 9. Ans: 3 The series is based on the following pattern 4 ´ 0.5 = 2 2 ´ 1.5 = 3 but not 3.5 3 ´ 2.5 = 7.5 7.5 ´ 3.5 = 26.25 26.25 ´ 4.5 = 118.25 So 3.5 should be replaced with 3 10. Ans: 2 The series is based on the following pattern. 16 ´ 0.25 = 4 4 ´ 0.5 = 2 2 ´ 0.75 = 1.5 1.5 ´ 1.00 = 1.5 but not 1.75 1.5 ´ 1.25 = 1.875 So 1.75 should be replaced by 1.5 11. Ans: 4 The series is based on the following pattern. 17 + 92 = 98 98 + 72 = 147 147 + 52 = 172 172 + 32 = 181 181 + 12 = 182 So the ans is 182 12. Ans: 5 The series is based on the following pattern. 11 + 8 = 19 19 + 12 = 31 31 + 16 = 47 47 + 20 = 67 67 + 24 = 91 So the ans is 91 13. Ans: 2 The series is based on the following pattern. 748 – 288 = 460 460 – 144 = 316 316 – 72 = 244 244 – 36 = 208 208 – 18 = 190 14. Ans: 3 The series is based on the following pattern. 12 + 4 = 16 16 + 8 = 24 24 + 12 = 36 36 + 16 = 52 and 52 + 20 = 72 15. Ans: 4 The series is based on the following pattern. 17 + 22 = 21 21 + 42 = 37 37 + 62 = 73 73 + 82 = 137 and 137 + 102 = 237 16. Ans: 1 The series is based on the following pattern. 620 – 208 = 412 412 – 104 = 308 308 – 52 = 256 256 – 26 = 230 and 230 – 13 = 217 17. Ans: 1 The series is based on the following pattern. 153 – 3 = 150 150 – 6 = 144 144 – 12 = 132 132 – 24 = 108 108 – 48 = 60 So the ans is 60 18. Ans: 1 The series is based on the following pattern. 31 + 9 = 40; 40 + 18 = 58 58 + 27 = 85; 85 + 36 = 121 121 + 45 = 166 19. Ans: 1 The series is based on the following pattern. 36 + 12 = 37 37 + 32 = 46 46 + 52 = 71 71 + 72 = 120 120 + 92 = 201 201 + 112 = 322 So the ans is 120 20. Ans: 2 The series is based on the following pattern. 12 + 8 = 20 20 + 80 = 100 100 + 800 = 900 900 + 8000 = 8900 8900 + 80000 = 88900 88900 + 800000 = 888900 21. Ans: 5 The series is based on the following pattern. 7 ´ 1 = 7; 7 ´ 2 = 14 14 ´ 3 = 42; 42 ´ 4 = 168 168 ´ 5 = 840; 840 ´ 6 =5040 22. Ans: 3 The series is based on the following pattern. 21 + 9 = 30; 30 – 18 = 12 12 + 27 = 39 39 – 36 = 3 3 + 45 = 48 48 – 54 = –6 -
సిరీస్ విజయంపై భారత్ దృష్టి
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక అనంతరం దీనిని భారత ‘ఎ’ జట్టుగా బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ అభివర్ణించాడు. కానీ ఇప్పుడు ఆ ‘ఎ’ జట్టును ఎదుర్కోవడానికే ప్రత్యర్థి ఆపసోపాలు పడుతోంది. తొలి వన్డేలో టీమిండియా ఏకపక్ష విజయం అనంతరం ఇప్పుడు బంగ్లాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరో వైపు ఆడుతూ పాడుతూ శుభారంభం చేసిన రైనా సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డేలో తలపడనున్నాయి. బౌలర్లకు మరో అవకాశం గత మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప, రహానే , రైనా, రాయుడు రాణించడంతో భారత బ్యాటింగ్ విభాగం ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ భారత యువ బౌలర్లు కొంత మేరకే సఫలం కాగలిగారు. గాయంతో పూర్తి ఓవర్లు వేయలేకపోయిన మోహిత్ ఈ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కోసం తస్కీన్ అహ్మద్‌కు స్థానం ఇచ్చే అవకాశం ఉంది. వర్షం ముప్పు!: రెండో వన్డేకు కూడా వాతావరణం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం కూడా ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.