సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్‌కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్‌బెంచ్‌లో లీక్ అయ్యాయి.
మల్టీ-కోర్ టెస్ట్‌లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్‌సెట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు.
గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా
6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్
90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్‌ప్లే
64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ధర
గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999
6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment