Samsung Galaxy F14 5G With 6000MAH Battery Launched in India - Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ , అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా!

Published Fri, Mar 24 2023 4:58 PM | Last Updated on Fri, Mar 24 2023 5:28 PM

Samsung Galaxy F14 5G with 6000mAh battery launched check price - Sakshi

సాక్షి,ముంబై: శాంసంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  5nm ప్రాసెసర్ ,  6000 mAh బ్యాటరీ  శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ  స్మార్ట్‌ఫోన్‌ను  ఈరోజు (మార్చి 24)   భారత మార్కెట్‌లో విడుదల చేసింది.  5జీ సెగ్మెంట్‌లో‌ మాత్రమే  వస్తోంది. ఈ కనెక్టివిటీ కోసం 13 బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందీ మొబైల్‌. అలాగే Exynos 1330 చిప్‌సెట్‌తో వస్తుందని,   ఇందులోన బిగ్‌ బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాటరీ  లైఫ్‌ అందిస్తుందని కంపెనీ  పేర్కొంది.

పరిచయ ఆఫర్‌గా శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీను ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్‌ల  కొనుగోళ్లపై 4 జీబీ ర్యామ్‌ +128 జీబీ స్టోరేజ్‌ కోసం రూ. 12,990, 6జీబీ ర్యామ్‌,  128జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ రూ. 14,490కే అందిస్తోంది. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్‌ మొదలవుతుంది.  ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ తోపాటు  ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో త్రి కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ   స్పెసిఫికేషన్స్‌
6.6-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే 
90Hz రిఫ్రెష్ రేట్‌, Android 13 ఆధారంగా One UI 5
50ఎంపీ ప్రధాన కెమెరా 2MP మాక్రో కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా .
6000 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 

అతేకాదు  గరిష్టంగా 2 తరాల OS అప్‌గ్రేడ్‌లను 4 సంవత్సరాల వరకు భద్రతా అప్‌డేట్‌లను అందిస్తుంది. ఫైనాన్షియల్ అప్లికేషన్‌లు, వ్యక్తిగత ఐడీలు,  ఇతర రహస్య పత్రాలను  స్టోర్‌ చేసుకునేందుకు ఆల్-ఇన్-వన్ అప్లికేషన్‌ వాయిస్ ఫోకస్ ఫీచర్ , Samsung Walletకి  మద్దతు కూడా ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement