సాక్షి, ముంబై: అన్‌లైన్ దిగ్గజం అమెజాన్ దీపావళి సేల్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ సిరీస్‌లోని గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ఇతర శాంసంగ్ గెలాక్సీ ఇతరఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది.
గెలాక్సీ ఎస్22 5జీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్ సేల్‌లో రూ. 32 వేల తగ్గింపుతో రూ.99,999కే అందిస్తోంది. దీని ఎంఆర్‌పీ ధర రూ. 1,31,999. దీనికి తోడు రూ. 13300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు అమెజాన్ అన్ని బ్యాంక్ కార్డ్‌ల కొనుగోళ్లపై రూ. 50వేల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 8,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో 40 వేల రూపాయల తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫీచర్లు
6.8 అంగుళాల AMOLED స్క్రీన్
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 ప్రాసెసర్
40 ఎంపీ సెల్ఫీ కెమెరా
108+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
5000 mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment