Samsung Galaxy M52 5G Gets Up To Rs 10K Price Cut In India - Sakshi
Sakshi News home page

Samsung Galaxy M52 5G: శాంసంగ్‌ గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీ తగ్గింపు

Published Thu, Jun 23 2022 4:40 PM | Last Updated on Thu, Jun 23 2022 5:05 PM

Samsung Galaxy M52 5G Gets Up To Rs 10k Price Cut In India - Sakshi

సాక్షి, ముంబై:  శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపు  ధరలో లభిస్తుంది. గత ఏడాది లాంచ్‌ చేసిన మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ‘ఎం52 5జీ’ ధరను 10వేల రూపాయలు తగ్గించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్‌ లభించనుంది. 
 

శాంసంగ్‌  గెలాక్సీ ఎం52 5జీ హై-ఎండ్ వేరియంట్‌ (8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌) ను రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో 21,999  రూపాయలకు అందుబాటులో ఉంది.  దీని అసలు ధర రూ. 31,999.  బ్లేజింగ్ బ్లాక్,  ఐసీ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 

అలాగే శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  అసలు ధర  రూ. 29,999గా ఉంటే  ఇపుడు  రిలయన్స్‌ డిజిటల్‌ ద్వారా రూ.20,999 లకే లభిస్తోంది.  ఇదే వేరియంట్‌ ధర  అమెజాన్‌లో  రూ. 24,999 గా ఉంది. 


శాంసంగ్‌  గెలాక్సీ ఎం52 ఫీచర్లు
6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ సూపర్ AMOLED డిస్‌ప్లే 
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌  778G SoC
64+12+ 5 ఎంపీ  ట్రిపుల్ రియర్ కెమెరా 
32 ఎంపీ సెల్ఫీ కెమెరా 
5000 mAh బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ 
USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement