సాక్షి, ముంబై : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధరపై నాలుగువేల రూపాయల శాశ్వత తగ్గింపుతో అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఆన్‌లైన్ సైట్లలో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని ముంబైలోని మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి ట్విటర్‌లో ధృవీకరించారు. (వాట్సాప్‌లో ఎర్రర్ : యూజర్లు గగ్గోలు)
మొబైల్ ఫోన్‌లపై 12 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ రేట్ల పెంపుతో దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ నోట్ 10లైట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ మార్కెటో 4 వేల రూపాయల ధర తగ్గించడంతో పాటు, అదనపు ఆఫర్లను అందించడం విశేషం. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ నోట్ 10 లైట్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5000 క్యాష్‌బ్యాక్ లభ్యం. మిగిలిన ఆన్‌లైన్ చెల్లింపులపై 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందివ్వనుంది. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్)
కొనుగోలుదారులు 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020వరకు మాత్రమే చెల్లుతాయి. ఈ మోడల్స్ ధరలు ఇప్పటివరకు వరుసగా 41,999 రూపాయలు, 43,999 రూపాయలుగా ఉన్నాయి. జనవరిలో భారతదేశంలో లాంచ్ చేసినపుడు గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధర 38999 రూపాయలు.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రస్తుత ధరలు
6 జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు
8 జీబీ మోడల్ ధర 39,999 రూపాయలు
గెలాక్సీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్
ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9810 సాక్
6జీబీ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్
1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12+ 12+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment