అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ 71 | Samsung Galaxy A71 With Quad Rear Cameras launched | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ 71

Published Wed, Feb 19 2020 8:21 PM | Last Updated on Wed, Feb 19 2020 8:33 PM

Samsung Galaxy A71 With Quad Rear Cameras launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్‌ ఇండియాలో కొత్త స్మార్ట్‌పోన్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఏ 70కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ 71ని  ఆవిష్కరించింది. భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ 71.  ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఫిబ్రవరి 24 నుండి శాంసంగ్ ఒపెరా హౌస్, శాంసంగ్.కామ్‌తో పాటు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా  ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుంది.

భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గెలాక్సీ ఎ 71 లో కొన్ని 'మేక్ ఇన్ ఇండియా' లక్షణాలను కూడా శాంసంగ్‌ అందిస్తోంది.  గెలాక్సీ ఏ 71 సులభంగా చెల్లింపులను ప్రారంభించడానికి శాంసంగ్ పే ఇంటిగ్రేషన్‌తో ప్రీలోడ్ చేసింది. అంతేకాదు మెరుగైన భద్రత కోసం శాంసంగ్ నాక్స్  ఏఫీచర్‌ను కూడా జోడించింది.  టెక్స్ట్ మెసేజింగ్ యాప్‌లో విజువల్ కార్డులు , రిమైండర్‌లు,  ఆఫర్‌ల రూపంలో ఉంటాయి. స్థానిక భాషలకు మద్దతు ఇవ్వడానికి హ్యాండ్‌సెట్‌లో బహుభాషా టైపింగ్ సౌలభ్యం కూడా ఉంది. వినోదం, ఇ-కామర్స్, ఆహారం ,  ట్రావెల్ డొమైన్‌లలో కంటెంట్ కోసం శోధించేందుకు వీలుగా ఫైండర్‌, అలాగే సింగిల్‌ ట్యాప్‌తో స్క్రీన్‌షాట్‌సేవ్‌, స్మార్ట్ క్రాప్ ఫీచర్స్‌ అందిస్తోంది. వివో వి 17 ప్రో, ఒప్పోరెనో, రెడ్‌మి కె 20 ప్రో, వన్‌ప్లస్ 7  లాంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ 71 ఫీచర్లు
6.70 అంగుళాల  ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
 ఆండ్రాయిడ్‌ 10
1080x2400 పిక్సెల్స​ రిజల్యూషన్‌
8జీబీర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
512 జిబి వరకు విస్తరించుకునే అవకాశం
32 ఎంపీ  సెల్ఫీకెమెరా
64+ 12+ 5+ 5 ఎంపీ రియర్‌ క్వాడ్‌కెమెరా
4500 ఎంఏహెచ్‌  బ్యాటరీ సామర్థ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement